Horoscope Today 2nd June 2024 : జూన్ 2 ఆదివారం రాశిఫలాలు.. ఈరోజున 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసా?

Horoscope Today 2nd June 2024 : జూన్ 2వ తేదీ. శ్రీక్రోధి నామ సంవత్సరం, వైశాఖమాసం, ఉత్తరాయణం. వసంత రుతువు, ఆదివారం. ఏకాదశి రాత్రి 1 గంట 29 నిమిషాల వరకు. నక్షత్రం : రేవతి, రాత్రి 12:54 నుంచి 3:11 నిమిషాల వరకు ఉంటుంది. దుర్ముహూర్తం: సాయంత్రం, 4 గంటల 43 నిమిషాల నుంచి 5:35 వరకు. అమృతకాలం: రాత్రి 11:26 నుంచి 1:25 నిమిషాల వరకు ఉంటుంది. రాహుకాలం: సాయంత్రం, 4 గంటల 30 నిమిషాల నుంచి 6 గంటల వరకు ఉంటుంది. సూర్యోదయం: ఉదయం 5:30 నిమిషాలకు, సూర్యాస్తమయం: సాయంత్రం 6:15 నిమిషాలకు. ఈరోజు అపరి ఏకాదశి.. వైశాఖ బహుళ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఇక, 12 రాశుల వారు ఈరోజు ఎలాంటి ఫలితాలను పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం.

మేషరాశి :
ఈ రాశి వారికి ఈరోజు స్థిరమైన ఫలితం ఉంటుంది. ఆదాయం పెరిగింది కదా అని దుబారాకు దిగకండి. అప్పు చేయాల్సి వస్తుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా మెలగడం మంచిది. స్నేహితుల సహాయంతో ఒక పెద్ద సమస్యను పరిష్కరించుకుంటారు. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. కొత్త ఉద్యోగంలో చేరుతారు. భూవ్యవహారాలు లాభసాటిగా సాగుతాయి. బంధుమిత్రులతో సత్సంబంధాలు ఉంటాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కలిసివస్తాయి. కోర్టు కేసులలో విజయం ఉంటుంది. పిల్లలతో సంతృప్తిగా ఉంటారు. గురు భక్తి పెరుగుతుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ప్రయాణాల వల్ల పనులు నెరవేరుతాయి. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. ఆర్థిక లావాదేవీలు వ్యాపార ఒప్పందాలు కలిసివస్తాయి.

స్థిర,చరాస్తులు వల్ల ఆదాయం పెరుగుతుంది. వివాహది శుభకార్య ప్రయత్నాలు కలుస్తాయి. సాంస్కృతిక సేవా కార్యక్రమాలను పాల్గొంటారు. అధికారులతో స్నేహంగా ఉంటారు. మంచి సమయం ఉంటుంది. ముఖ్య కార్యాలు త్వరగా పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలు కలిసివస్తాయి. పిల్లల్లో ఒకరికి మంచి ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారం ఫలిస్తుంది. వ్యాపారంలో అనుకూలత ఉంటుంది. ఆపద తొలుగుతుంది. ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయండి. అదృష్ట యోగం ఉంది. బంధుమిత్రుల ద్వారా మేలు జరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో సొంత ఆలోచనలు కలిసి రావు. ఉద్యోగస్తులకు పనిభారం తగ్గుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం జాగ్రత్త. ఇష్టదైవాన్ని స్మరించండి. ప్రశాంతమైన జీవనం లభిస్తుంది. ఈరోజు ఈ రాశివారికి శుభ ఫలితాలే గోచరిస్తున్నాయి.

వృషభ రాశి :
ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. మొహమాటం పనికిరాదు. సుఖ సౌభాగ్యాలు ఉంటాయి. మీ ఆదాయానికి హద్దులు ఉండవు. తలకమానిన ధర్మంగా ఇతరులకు సహాయపడతారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఉద్యోగం విషయంలో ఆందోళన కలుగుతుంది. భార్య పిల్లలతో కాలక్షేపం చేస్తారు. ఇరుగుపొరుగుతో విభేదాలు తగ్గుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. దూరపు బంధువులను కలుస్తారు. నూతన వస్తువులను కొంటారు. కళాకారులకు అనుకూలంగా ఉంటుంది. వృధా ఖర్చుల మూలంగా అవసరానికి డబ్బు లేకుండా పోతుంది. రావాల్సిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. వ్యాపారంలో భాగస్వాములు మధ్య అవగాహన పెరుగుతుంది.

బంధుమిత్రులతో సఖ్యత పెరుగుతుంది. విద్యార్థులకు ఈరోజు అనుకూలిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగస్తులు ఓపికతో పనులు చేయడం అవసరం. తోటి ఉద్యోగుల సహకారంతో పనులు పూర్తి చేస్తారు. అనవసరమైన ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఆరోగ్యంగా ఉంటారు. పారిశ్రామికవేత్తలు న్యాయ సమస్యలను కొంతవరకు అధిగమిస్తారు. దైవభక్తి పెరుగుతుంది. కార్యసిద్ధి ఉంటుంది. ఉద్యోగం అనుకూలం. అధికారుల ద్వారా మేలు జరుగుతుంది. కొన్ని విషయాల్లో నిదానంగా విజయం వస్తుంది. వ్యాపారంలో శ్రమ ఫలిస్తుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. వృత్తి వ్యాపారాల్లో వృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగంలో పదోన్నతులు పెరుగుతాయి. వ్యాపారులు మరింత శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. సూర్య స్తుతి మంచిది. మొత్తం మీద ఈరాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి.

మిధున రాశి :
ఈ రాశి వారికి ఈరోజు ఆదాయం స్థిరంగా ఉంటుంది. ప్రారంభించిన పనులు పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. విద్యార్థులు చదువులో రాణిస్తారు. వివాహది శుభకార్య ప్రయత్నాలు కలిసివస్తాయి. అనవసరమైన ఖర్చులు రావడంతో కొన్ని పనుల్లో జాప్యం జరగవచ్చు. ఖర్చులపై నియంత్రణ అవసరం. ఉద్యోగం, వృత్తి వ్యాపారాల్లో బాధ్యతలు పెరుగుతాయి. అయితే, అందరి సహకారంతో వాటిని విజయవంతంగా నిర్వర్తిస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. కొత్త దుస్తులు, వస్తువులు కొంటారు. ఉద్యోగంలో ప్రశంసలు అందుకుంటారు. పిల్లలకు పెళ్లి సంబంధం విషయంలో బాగా ఆలోచిస్తారు. పిల్లలనుంచి శుభవార్తలు వింటారు. అంతా మీరు అనుకుంటున్నట్లుగా జరుగుతుంది.

కొత్త స్నేహితులు పరిచయం అవుతారు. వ్యాపారులు కష్టపడాల్సి ఉంటుంది. కోర్టు కేసుల్లో గెలిచే సూచనలు ఉన్నాయి. ప్రేమ వ్యవహారాలు కలిసివస్తాయి. లక్ష్యం నెరవేరుతుంది. ఆత్మబలం పెరుగుతుంది. అవరోధాలు క్రమంగా తలుగుతాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. కొన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఎంత బయట చికాకులు తగ్గుతాయి. అనుకున్న పనులు ముందుకు సాగుతాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాల్లో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆశించిన ఫలితాలు ఉంటాయి. ధర్మబద్ధంగా ముందుకు సాగండి. దత్తాత్రేయ స్వామిని దర్శిస్తే మంచి జరుగుతుంది. మొత్తం మీద ఈరాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి.

కర్కాటక రాశి :
ఈరాశి వారికి ఈరోజు ఉన్నత స్థితి గోచరిస్తోంది. పదిమందికి ఆదర్శవంతులుగా నిలుస్తారు. కీలక విషయాల్లో కుటుంబ సభ్యులతో చర్చించి ముఖ్య నిర్ణయం తీసుకుంటారు. ఆలోచనలను సరైన సమయంలో ఆచరణలు పెట్టి సత్ఫలితాలను పొందుతారు. ఆరోగ్యంగా ఉంటారు. ఏకాగ్రతతో పనులు చేస్తారు. రోజువారి కార్యకలాపాలు సంతృప్తికరంగా ఉంటాయి. రాజకీయ ప్రభుత్వ పనుల్లో ఖర్చులు బాధ్యతలు పెరగవచ్చు. వ్యవహారాలు అనుకూల ఫలితాలు ఇస్తాయి. వివాదాలకు దూరంగా ఉంటారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉండవచ్చు. ఖర్చుల నియంత్రణ అవసరం. ఉద్యోగస్తులు బాధ్యతగా ఉంటారు. దైవభక్తి పెరుగుతుంది. భూముల కొనుగోలు చేస్తారు.

కార్మికులకు, కర్షకులకు అనుకూలమైన రోజు. ప్రయాణాలు కలిసివస్తాయి. ఆరోగ్యంగా ఉంటారు. అద్భుతమైన శుభయోగాలు ఉన్నాయి. అదృష్టవంతులు అవుతారు. ఉద్యోగ వ్యాపారాలు, కొందరికి మీవల్ల మేలు కలుగుతుంది. భూగృహ విషయాల్లో పురోగతి ఉంటుంది. మిత్రులతో సంతోషాన్ని పంచుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు తగ్గించుకుని అప్పులు తీర్చుకునే కార్యక్రమం చేపడతారు. భవిష్యత్తులో మీకు ఉపయోగపడగల వారితో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగ వివాహ ప్రయత్నాలు కలిసివస్తాయి. వ్యాపారులు తేలిక పురోగతిని సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. సన్నిహితుల నుంచి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. వృతి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి లభిస్తుంది. విద్యార్థుల ప్రయత్నాలు కలిసివస్తాయి. ఇష్టదైవనామస్మరణ మంచిది. మొత్తంమీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి.

సింహరాశి :
ఈరాశి వారికి ఈరోజు ఆర్థిక ఒప్పందాలు అనుకూలిస్తాయి. పూర్వంతో పోలిస్తే ఆదాయం పెరుగుతుంది. పాత బాకీలు కొన్ని వస్తువులు అవుతాయి. ఉత్సాహంతో పనులు చేస్తారు. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది.ఉద్యోగస్తులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. రాజకీయ కోర్టు ప్రభుత్వ పనులు అందరి సహకారం లభిస్తుంది. మంచి ఫలితాలను పొందుతారు. వ్యవసాయదారులకు వాతావరణం అని పిలుస్తుంది. స్నేహితులరాక సంతృప్తిని ఇస్తుంది. ఇంటబయట అనుకూలత ఉంటుంది. కళాకారులకు ఆదాయం పెరుగుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. తలచిన పనులు నెరవేరుతాయి. వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది.

Today Horoscope 2nd June 2024 _ Daily Panchangam And Rasi Phalalu Telugu
Today Horoscope 2nd June 2024 ( Photo Credit : Google )

విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపారస్తులు పురోగతిని సాధిస్తారు. ప్రేమను ఫలిస్తాయి. కోర్టు కేసులో విజయం మీదే. అనారోగ్య సమస్యలను అధిగమిస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. బంధుమిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తిచేస్తారు. చిన్ననాటి మిత్రులకు కలయిక ఆనందం కలిగిస్తుంది. విందు వినోద కార్యక్రమాలు పాల్గొంటారు. వ్యాపారాలలో నూతన ఆలోచనలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులకు పనిఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఆర్థిక వాతావరణం ఆశాజనకంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఫలించి షికారులు చేస్తారు. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. రామ రక్షా స్తోత్రం పఠిస్తే మేలు జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశివారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి.

కన్య రాశి :
ఈరాశి వారికి ఈరోజు ప్రయత్న కార్యాలు సఫలమవుతాయి. అవరోధాలను సునాయాసంగా దాటుతారు. కొంత శ్రమ పెరుగుతుంది. సకాలంలో బాధ్యతలను నెరవేరుసతారు. ప్రతి అంశాన్ని లోతుగా విశ్లేషించండి. మంచి ఫలితాలు పొందుతారు. అనవసర వాదనల జోలికి పోవద్దు. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు ఉంటాయి. ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. పిల్లలపై చదువులకు ప్రయత్నాలు అనుకూలిస్తాయి.కొత్త ఉద్యోగాల్లో చేరతారు. విద్యార్థులకు అనుకూలమైన రోజు. దూర ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. ఆఫీసులో తోటి ఉద్యోగుల సహకారంపై అధికారుల ఆదరణ లభిస్తుంది. బరువు బాధ్యతలకు మనస్పూర్తిగా స్వీకరించి సత్ఫలితాలు పొందుతారు. మిత్రుడు బంధువర్గంతో పనులు కలిసి వస్తాయి.

Horoscope Today 2nd June 2024 :  ఏయే రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయంటే?

రాజకీయపరంగా, కోర్టు ప్రభుత్వ పనులు అనుకూలత ఉంటుంది. ఆస్తి తగదాలు ఒక కొలిక్కి వస్తాయి. శ్రమ అధికమైన సత్ఫలితాలు సాధిస్తారు. భూములు కొనుగోలు చేస్తారు. సంఘంలో మంచి పేర్లు సంపాదిస్తారు. వాహనం, వస్తువులు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. కొందరు స్నేహితులతో చిన్ననాటి సంగతులు నెమరవేసుకుంటారు. ఖర్చులు పెరగడంతో అదనపు ఆదాయం కోసం ఆలోచిస్తారు. విదేశాలను ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న మీ అబ్బాయి గురించి మంచి కబురు వస్తుంది. వ్యాపారులకు చాలా బాగుంటుంది. శుభ ఫలితాలు ఉంటాయి. బంధుమిత్రులతో ఊహించని కలహాలు కలుగుతాయి. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. వ్యాపారాలు అంతంత మాత్రమే సాగుతాయి. ఉద్యోగ వాతావరణ చికాకుగా ఉంటుంది. ఇష్టదైవాన్ని ధ్యానిస్తే మేలు జరుగుతుంది. మొత్తంమీద ఈరాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు ఆచరిస్తున్నాయి.

తులారాశి :
ఈరాశి వారు ఈరోజు ఇంటా బయట సంతృప్తిగా ఉంటారు. ఇంట్లోకి కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. సేవా కార్యక్రమాలపై మనసు నిలుపుతారు. కళాకారులకు అనుకూలం. మంచి అవకాశాలతో ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు ఆదరణ పెరుగుతుంది. స్నేహితులు బంధువర్గంతో చిన్నపాటి మనస్పర్ధలు ఉన్న పనులు నెరవేరుతాయి. వాహనం మూలంగా ధనం ఖర్చు అయ్యే సూచనలు ఉన్నాయి. దేవత గురుభక్తి పెరుగుతుంది. ఆధ్యాత్మిక ప్రవచనాలపై మనసు నిలుపుతారు. మంచి వారి సహచర్యం లభిస్తుంది. విద్యార్థులకు చదువు విషయంలో పెద్దల ప్రోత్సాహం లభిస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ కనబరుస్తారు. సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక స్థితి బాగుంటుంది.

అనుకున్న పనులు సకాలంలో అవుతాయి. ఉద్యోగంలో కీర్తి పెరుగుతుంది. ఆటంకాలు ఉన్న ఓర్పుతో లక్ష్యాలు చేరుకోగలరు. తెలియని వ్యక్తులతో జాగ్రత్త. బాధ్యతాయుతంగా ప్రవర్తించి నలుగురికి ఆదర్శప్రాయలవుతారు. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. ఉద్యోగంలో పైఅధికారులు ఎంతగానో ప్రోత్సహిస్తారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. వివాహ సంబంధాలు కుదరవచ్చు. ప్రేమ వ్యవహారాన్ని కలుస్తాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలలో నిలకడగా ఉంటారు. వృత్తి వ్యాపారాల్లో వివాదాలు కలుగుతాయి. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నిరుద్యోగులకు ప్రయత్నాలు కలుస్తాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. లక్ష్మీదేవి ఆరాధిస్తే మంచి జరుగుతుంది.

వృశ్చిక రాశి :
వృశ్చిక రాశి వారికి ఈరోజు స్థిరా చరాస్తులు మూలంగా ఆదాయం సమకూరుతుంది. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. వృద్ధి వ్యాపారాల్లో పనిభారం పెరిగిన సంతృప్తిగా ఉంటారు. కళాకారులకు అనుకూలమైన రోజు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆదాయం క్రమేపి పెరుగుతుంది. తలపెట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. సాంస్కృతిక ధార్మిక సేవా కార్యక్రమాలకు హాజరవుతారు. శుభకార్యాలు చేస్తారు. పారిశ్రామికవేత్తలు సమస్యలను అధిగమిస్తారు. సిబ్బంది సహకారం పొందుతారు. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆఫీస్‌లో మంచి పేరు వస్తుంది. కొన్ని విషయాలను బాధ్యతతో స్వీకరించి విజయవంతంగా పూర్తి చేస్తారు.

దేవుడు మీవైపే ఉన్నాడని మీకు అర్థమవుతుంది. డబ్బు ఖర్చు వస్తుంది. పలుకుబడి పెరుగుతుంది. విదేశీ సంస్థల ఉద్యోగం లభిస్తుంది. వీసా మంజూరు అవుతుంది. గతంలో మీరు కొన్న స్థలం రేటు పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. ప్రేమ జీవితం బాగుంటుంది. నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తాడు. ప్రతి ఉద్యోగాలు అనుకూలిస్తాయి. శివనామస్మరణ ఫలితాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు అద్భుత ఫలితాలు గోచరిస్తున్నాయి.

ధనస్సు రాశి :
ఈ రాశి వారికి ఈరోజు ఆదాయం స్థిరంగా ఉంటూ పెరుగుతుంది. బంధుమిత్రులతో సత్ససంబంధాలు కొనసాగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి.ఆదాయం పెరుగుతుంది. అయితే, రాబడిని దృష్టిలో పెట్టుకొని పనులు చేయడం మంచిది. ఉద్యోగస్తులకు ఆఫీసులో తోటివారి సహకారంతో ఉన్నా పైఅధికారుల నుంచి విమర్శలు ఉండవచ్చు. సంయమనంతో వ్యవహరించాలి. ప్రయాణాలు కలిసి వస్తాయి. వాహన మూలంగా అనుకొని ఖర్చులు ముందుకు వస్తాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. పాతబాకీలు వస్తూ ఉంటాయి. ఉద్యోగంలో ఇబ్బందులు తగ్గుతాయి. ఆశయం సిద్ధిస్తుంది. పెద్దలనుంచి ప్రశంసలు పొందుతారు. వ్యాపారంలో మంచి ఫలితాలు ఉంటాయి.

అవసరాలకు తగ్గట్టుగా ఆలోచన సరళిని మార్చుకోవాలి. ఆశయం ఉన్నతంగా ఉంటే కార్యసిద్ధి కూడా విశేషంగానే ఉంటుంది. బంధుమిత్రుల ద్వారా లాభపడతారు. వివాహ సంబంధం కుదురుతుంది. జేబు నిండుగా ఉంటుంది. వ్యాపారులకు బాగా అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు కలిసివస్తాయి. గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. మానసిక ప్రశాంతత కలుగుతుంది. చేపట్టిన వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహంతో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఒక స్నేహితుడిని ఆర్థికంగా ఆదుకుంటారు. శివారాధన మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ రోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి.

మకర రాశి :
ఈ రాశి వారికి ఈరోజు భూముల కొనుగోలు వ్యవహారాలలో ఆదాయం సమకూరుతుంది. విద్యార్థులకు ఈరోజు అనుకూలమైన రోజు. ఉన్నత విద్యా ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఉద్యోగస్తులు సహోద్యోగులతో స్నేహపూర్వకంగా మెలుగుతారు. పైఅధికారుల ఆదరణతో పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. ప్రారంభించిన పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. అయితే, వృధా ఖర్చులు ఉంటాయి. బంధు వర్గంతో సంబంధాలు కలిసివస్తాయి. ఆరోగ్యంగా ఉంటారు. సమయానికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటారు. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది నుంచి ప్రతికూలత ఎదురైనా కార్య సాఫల్యం ఉంటుంది. రావాల్సిన డబ్బు చేతి అందుతుంది. ఆర్థిక ఒప్పందాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. కార్యసిద్ధి కలుగుతుంది.

ఉత్సాహంతో పనులు ప్రారంభించండి. ఆర్థిక స్థితి మెరుగు అవుతుంది. ఉద్యోగంలో పెద్దల సహకారం ఉంటుంది. వ్యాపారంలో శ్రద్ధ పెంచితే శ్రేష్టమైన ఫలితం వస్తుంది. ఆటంకం ఎదురవుతుంది. ఆవేశపరిచే సంఘటనలకు దూరంగా ఉండాలి. ఏలినాటి శని పెట్టె ఇబ్బందులు అన్ని కాదు. ఆరోగ్యం మీద కన్నివేసి ఉంచండి. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. బందు వర్గం వారితో సరదాగా గడుపుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు ఉత్సాహవంతంగా పాల్గొంటారు. ప్రయాణాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపార ఉద్యోగాలను కొంతమంది స్థితి ఏర్పడుతుంది. అనుకున్న సమయానికి డబ్బు చేతికి అందక ఇబ్బంది కలుగుతుంది. శివార్చన చేయించడం వల్ల ఉపయోగం ఉంటుంది. మంచి శక్తినిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి రోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి.

కుంభరాశి :
ఈరాశి వారు ఈరోజు ఇష్టకార్య సిద్ధి పొందుతారు. నలుగురిలో పలుకుబడిని సంపాదిస్తారు. పనుల్లో ఒత్తిడి తగ్గించుకోవాలి. విజ్ఞానము అధిగమిస్తారు. ధర్మ మార్గంలో పైకి వస్తారు. కుటుంబ సమస్యలను అధిగమిస్తారు. వ్యాపారంలో మేలు జరుగుతుంది. సుఖసంతోషాలు ఉంటాయి. ధనలాభం ఉంది. వృత్తిపరంగా పురోభివృద్ధి ఉంటుంది. ఉద్యోగస్తులకు ఆదరణ లభిస్తుంది. బంధుమిత్రులతో ఇబ్బందులు ఉండవచ్చు. సమయమనం పాటించాలి. రాజకీయ ప్రభుత్వ పనుల మూలంగా ఖర్చులు పెరుగుతాయి. ఇంటబయట సంతృప్తిగా ఉంటారు. వివాదాలకు దూరంగా ఉంటారు. పనులపై మనసు నిలుపుతారు. కొన్ని పనులకు ఆర్థిక పరమైన సమస్యలు ఎదురుకావచ్చు.

ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. రోజువారి కార్యక్రమాలు సంతృప్తిని ఇస్తాయి. వ్యాపారం లాభ సాటిగా కొనసాగుతుంది. ఆదాయం పెరుగుతుంది. కొన్ని మంచి పనులు జరుగుతాయి. ఉద్యోగంలో మార్పు ఉంటుంది. వ్యాపారులకు అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులు పురోగతినిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఖర్చుల విషయంలో ఆలోచించి వ్యవహరించడం మంచిది. ఆకస్మిత ప్రయాణాలు చేస్తారు. మిత్రులతో వివాదాలను కలుగుతాయి. వ్యాపారాధనలు అనుకున్న నిర్ణయాలు కలిసి వస్తాయి. వృతి ఉద్యోగాలు అనుకూలంగా ఉంటాయి. ప్రేమ వ్యవహారాలు ముందడుగు వేస్తారు. దుర్గాదేవిని పూజిస్తే మేలు జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి.

మీన రాశి :
ఈ రాశి వారికి ఈరోజు వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి. తలపెట్టిన పనులు నిరాటంకంగా పూర్తవుతాయి. సంతృప్తిగా ఉంటారు. విద్యార్థులకు అనుకూలమైన రోజు ఫలితాలు వస్తాయి. ఉన్నత విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి. దూర ప్రయాణాల వల్ల కావ్యం సఫలమవుతుంది. ఉద్యోగులకు పరిహారం, సాహో ఉద్యోగుల సహకారం అందుతుంది. అధికారుల అండదండలతో మంచి పేర్లు సంపాదిస్తారు. వ్యాపార విస్తరణ ప్రణాళికలు ముందుకు సాగుతాయి. గతంలో పెట్టిన పెట్టుబడిల వల్ల లాభాలు అందుకుంటారు. అయితే, డబ్బు విషయంలో జాగ్రత్త అవసరం. ఖర్చు విషయంలో నియంత్రణ తప్పనిసరి. ఆదాయం నిలకడగా ఉన్న ఆచితూచి ఖర్చు చేయడం చాలా మంచిది.

ఆరోగ్యం పర్వాలేదు అనిపిస్తుంది. దేవుడు మీద భక్తి బాగా పెరుగుతుంది. సంతానం వచ్చి శుభవార్తలు పెట్టారు. వ్యాపారులు పురోగతిని కాదు. హామీలు ఇవ్వద్దు. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. సమాజంలో ప్రముఖుల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తుంది. చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. పాత మిత్రుల నుంచి శుభకార్యా ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు, ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. కోర్టు కేసుల్లో నెగ్గుతారు. నవగ్రహ స్తోత్రం చదవడం మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి.

Read Also : Today Panchangam 1st June 2024 : ఈరోజు పంచాంగం.. రాశి ఫలితాలు.. హనుమాన్ జయంతి.. 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలు కలుగుతాయంటే?