Kalki 2898 Movie Review : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన మహాభారతం బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కిన భారీ బడ్జెట్ మూవీ ‘కల్కి 2898AD’ ఈరోజు (జూన్ 27, 2024)న తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీలో మెయిన్ లీడ్‌లో ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనేతో అతిపెద్ద తారాగణం నటించడంతో మూవీకి పెద్ద హైలెట్ అని చెప్పవచ్చు. డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ కల్కీ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
అందులోనూ నిర్మాత అయిన అశ్వినీదత్ ఎన్నో వేల కోట్లు మూవీ కోసం వెచ్చించారు. వాస్తవానికి రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి మూవీ తర్వాత ప్రభాస్ ఖాతాలో సరైన హిట్ పడలేదు. చాలా సినిమాల తర్వాత ‘కల్కి 2898AD’ మూవీ ఏ రేంజ్‌లో ఉంటుందా? అనేది అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ప్రభాస్ కల్కీ మూవీ మాస్ ఆడియోన్స్‌కు ఎంతవరకు కనెక్ట్ అవుతుంది? థియేటర్లలోకి వచ్చిన ‘కల్కి 2898AD’ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకోగలిగిందా? మాస్ ఆడియోన్స్‌ను మెప్పించిందా? లేదా అనేది ఇప్పుడు రివ్యూలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
Kalki 2898 Movie Review : కల్కి మూవీ స్టోరీలైన్ :
ప్రభాస్ ‘కల్కి 2898AD’ స్టోరీ మొత్తం మహాభారతంలో కీలక ఘట్టాల గురించే సాగుతుంటుంది. అప్పట్లో పాండవుల్లో అగ్రజుడు అయిన ధర్మరాజు ఆడిన అబద్ధంతో స్టోరీ స్టార్ట్ అవుతుంది. కురుక్షేత్రం సమయంలో కృష్ణుడి శాపంతో అశ్వర్థామ (అమితాబ్ బచ్చన్) కల్కి ఎప్పుడు జన్మిస్తాడా? అని ఎదురుచూస్తాడు. ఇక, సుమతి (దీపికా పదుకొనె) తన కడుపున కల్కి పుట్టబోతున్నాడని తెలిసి సంరక్షకుడిగా అశ్వర్థామ ఉంటాడు. అతిపెద్ద మాయా ప్రపంచంలోకి అడుగుపెట్టడానికి ఒక మిలియన్ యూనిట్ల కోసం చూస్తున్న భైరవ (ప్రభాస్)కు సుమతిని తీసుకువస్తే.. మిలియన్ల యూనిట్లు పొందవచ్చునని గ్రహిస్తాడు.

అందుకే భైరవ అశ్వర్థామతో భీకర పోరు చేస్తుంటాడు. ఎలాగైనా సుమతిని తీసుకెళ్లాలని తెగ ప్రయత్నిస్తుంటాడు. ఇంతకీ భైరవ సుమతిని అశ్వర్థామను ఎదురించి తీసుకువస్తాడా? అసలు సుప్రీమ్ యష్కిన్ ఎవరు? అతడికి భైరవ్ సాయం చేయడానికి కారణం ఇదేనా? అతడికి సుమతి ఎందుకు అవసరం? అనేది మొత్తం మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధంతో కలగలిసి ఉంటుంది. అంతేకాదు.. కలియుగం అంతానికి దీనికి మధ్య ఏంటి సంబంధం అనేది ఆసక్తిగా ఉంటుంది. అవేంటో పూర్తిగా తెలియాలంటే ‘కల్కి 2898AD’ మూవీ థియేటర్లలో తప్పక చూడాల్సిందే..