Mahesh Babu Rajamouli : వామ్మో.. మహేశ్‌తో మూవీలో డేంజరస్ షాట్స్..? ఏ హీరో చేయని రిస్క్ రాజమౌళి చేయించనున్నాడా..?

Mahesh Babu Rajamouli : రాజమౌళి అంటేనే.. హిట్.. ఆయన సినిమా తీశాడంటే.. అది బాక్సాఫీసు వద్ద రికార్డులు బద్దలు కొట్టాల్సిందే.. రాజమౌళి దర్శకత్వంలో ఏ హీరో వచ్చినా వంద శాతం పక్కా హిట్ ఇస్తాడనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అందుకే చాలామంది హీరీలు జక్కన్నతో సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇప్పటివరకూ టాప్ హీరోలతో చేసిన అన్ని మూవీలు పాన్ ఇండియా లెవల్‌లో భారీ హిట్ అందుకున్నాయి.

విదేశాల్లో కూడా రాజమౌళి సినిమాలకు ఫుల్ క్రేజ్ ఉంటుంది. అలాంటి రాజమౌళి ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి అనేక మంది టాప్ హీరోలతో సినిమాలు చేశారు. ప్రతిసినిమాకు ఒక ప్రత్యేకతను చాటుకున్నాడు జక్కన్న.. ఏదైనా సినిమా తీయాలంటే.. అది వందశాతం క్వాలిటీగా ఉంటేనే సినిమా రిలీజ్ వరకు వెళ్తుంది. లేదంటే.. అప్పటివరకూ సినిమాను ఏళ్ల తరబడి చెక్కుతూనే ఉంటాడు.

మహేష్‌తో జక్కన్న మూవీపై భారీ అంచనాలు :
తనకు సినిమా పర్‌ఫెక్ట్‌గా అనిపించిన తర్వాతే థియేటర్లలో వదులుతాడు. సినిమా షూటింగ్ మొదలైనప్పటినుంచి పూర్తయ్యే వరకు స్టోరీ సహా ఏ ఒక్క చిన్న విషయం కూడా బయటకు రాకుండా చాలా జాగ్రత్త పడతాడు రాజమౌళి. ఇప్పటికే బాహుబలి, ఆర్ఆర్ఆర్ మూవీలతో ప్రపంచ దేశాలకు టాలీవుడ్ పరిశ్రమను పరిచయం చేసిన రాజమౌళి.. రాబోయే తన సినిమాపై ఫోకస్ పెట్టాడు. అయితే, ఈసారి సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్నాడంటూ గతకొంతకాలంగా టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. మహేష్ ఇప్పటివరకూ రాజమౌళితో ఒక్క సినిమా కూడా చేయలేదు.

Mahesh Babu Rajamouli
Mahesh Babu Rajamouli ( Image Credit : Google )

జక్కన్నతో మహేష్ మూవీ అనగానే అభిమానుల్లో కూడా ఎంతో ఆసక్తిని రేకిత్తించింది. సినిమా సెట్ పైకి వెళ్లకముందే రాజమౌళి, మహేష్ కాంబినేషన్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వాస్తవానికి ఈ మూవీకి సంబంధించి కనీసం పూజా కార్యక్రమాలు కూడా జరగలేదని సమాచారం. అంతేకాదు.. మహేష్‌తో మూవీలో నటించబోయే నటీనటుల విషయంలో జక్కన్న అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారట.. మొత్తం ముగ్గురు హీరోయిన్లు ఉంటారని జోరుగా ప్రచారం కొనసాగుతోంది. అలాగే, పెద్ద హీరోలు ఇద్దరూ విలన్ రోల్స్ చేయబోతున్నారనే టాక్ కూడా నడుస్తోంది.

Mahesh Babu Rajamouli : రెండు పార్టులుగా మహేష్ మూవీ? :

రాజమౌళి మహేష్ తో చేయబోయే మూవీని రెండు పార్టులుగా తెరకెక్కించనున్నాడట. ఇప్పటివరకూ రాజమౌళి తన సినిమాలోని హీరోలను ప్రత్యేకమైన షేడ్స్‌లో చూపించారు. అయితే, ఈసారి మహేష్‌ను మిగతా హీరోల మాదిరిగా కాకుండా సరికొత్త డిఫరెంట్ షేడ్స్‌లో చూపించాలని గట్టిగా నిర్ణయించుకున్నాడట.

అందరిలా చేస్తే ఏం బాగుంటుంది.. కాస్తా డిఫరెంట్‌గా ఉంటే బెటర్ అనే ఆలోచనలో ఉన్నారట. ఈసారి మహేష్‌తో మూవీలో ఎక్కడా కూడా డూప్ లేకండా రిస్కీ షాట్స్ తీయనున్నాడట. ఇందులో మహేష్‌తో ఏకంగా లైవ్ పర్ఫార్మెన్స్ కూడా చేయించనున్నాడట.

ఒకవేళ ఈ వార్త నిజమే అయితే.. అంతకన్నా డేంజర్ మరొకటి ఉండదు. సినిమా మంచిగా రాకుంటే జక్కన్నకు నచ్చదు. తాను అనుకున్నట్టుగా వచ్చేంతవరకు ఎంతదూరమైన రాజమౌళి వెళ్తాడనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఈ వార్త బయటకు రాగానే మహేష్ అభిమానులకు టెన్షన్ పట్టుకుంది. ఏదిఏమైనా మహేష్‌ గత సినిమాల్లో కన్నా సరికొత్త డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నాడని టాక్ వినిపిస్తోంది.

Read Also : Jr NTR Virat Kohli : జూ.ఎన్టీఆర్‌‌‌‌పై విరాట్ కోహ్లీ సంచలన కామెంట్స్.. ఒక్క మాటతో అందరి నోళ్లు మూయించాడుగా..!