Pushpa 2 Release Date : పుష్పరాజ్ వచ్చేస్తున్నాడు.. తగ్గేదేలే.. పుష్ప-2 మూవీ కొత్త రిలీజ్ డేట్ ఇదిగో..!

Pushpa 2 Release Date : తగ్గేదేలే.. పుష్ప మళ్లీ వస్తున్నాడు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న పుష్ప మూవీ సెకండ్ పార్ట్ గురించి కొత్త అప్‌డేట్ వచ్చేసింది. పుష్ప ఫస్ట్ పార్ట్‌కు ఏమాత్రం తీసిపోనట్టుగా పుష్ప 2 ది రూల్ మూవీ ఉండబోతోంది. ఈ మూవీ విషయంలో చిత్ర యూనిట్ ఎంతమాత్రం రాజీపడటం లేదు. సినిమాకు అవసరమైన అన్నీ హంగులు చేర్చారట.. పుష్ప అంటే ఫ్లవర్ కాదు.. ఫైర్’ అన్నట్టుగా సినిమా మరోసారి అభిమానులను అలరించబోతోంది.

పుష్ప రాజ్‌గా అల్లు అర్జున్ క్రియేట్ చేసిన రికార్డులను తానే బద్దలు కొట్టేందుకు వస్తున్నాడు. ఇక దర్శకుడు సుకుమార్ సైతం హిస్టరీ క్రియేట్ చేశాడు. ‘పుష్ప’కు కంటిన్యూగా వస్తున్న ‘పుష్ప 2: ది రూల్’పై కూడా భారీగా అంచనాలు నెలకొన్నాయి. పుష్ప-2 మూవీ నుంచి ఎలాంటి చిన్న అప్‌డేట్ వచ్చినా యూట్యూబ్‌లో రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి. ఇటీవలే పుష్ప 2 మూవీ టీజర్‌తో పాటు పుష్ప పుష్ప పుష్పరాజ్‌ మూవీ విడుదలైన సంగతి తెలిసిందే.

ఈ మూవీలోని టైటిల్‌ సాంగ్‌, కపుల్‌ సాంగ్‌ ప్రేక్షకులు బాగా ఆకట్టుకున్నాయి. అందులో రెండో లిరికల్ సాంగ్ మాత్రం ఒక ఊపు ఊపేసింది. అంతగా ట్రెండ్ క్రియేట్ చేసింది. ‘సూసేకి అగ్గిర‌వ్వ మాదిరి వుంటాడే నా సామీ..’ రికార్డులు అంతాఇంతా కాదు.. ఎక్కడ చూసినా ఈ పాట పాడుతున్నారు.. ఈ పాటకే డ్యాన్సులతో హోరెత్తిస్తున్నారు.

Pushpa 2 Release Date : పుష్ప-2 మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడంటే?

తొలుత ఈ పుష్ప 2 మూవీని ఆగస్ట్ 15న థియేటర్లలోకి రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించగా.. తాజాగా డిసెంబర్‌ 6, 2024న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ పుష్ప సీక్వెల్ 2 ఇప్పటికే షూటింగ్‌ పార్ట్‌ పూర్తి చేసుకోగా.. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో పడింది. మూవీ విషయంలో పుష్ప చిత్ర యూనిట్ ఎక్కడా కూడా తగ్గేదేలే అన్నట్టుగా మందుకు వెళ్తున్నారు. టెక్నికల్‌గానూ అత్యున్నత విలువలతో మూవీని రిలీజ్ చేయాలని మూవీ మేకర్లు మరికొద్దిరోజులు సమయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అందుకే పుష్ప 2 ది రూల్ మూవీ రిలీజ్ డేట్ మార్చేసినట్టు మూవీ మేకర్లు ప్రకటించారు.

Pushpa 2 Release Date _ Allu Arjun's Pushpa 2 Rule Movie to be Release on December 6, 2024 Telugu
Pushpa 2 Release Date 2024 Telugu ( Image Source : Google )

‘పుష్ప ది రైజ్’ మూవీలో తనదైన న‌ట‌న‌తో బన్నీ తొలిసారిగా టాలీవుడ్ టాప్ హీరోగా జాతీయ ఉత్త‌మ న‌టుడిగా అవార్డు తీసుకున్నాడు. అంతేకాదు.. ఫస్ట్ టైమ్ దుబాయ్ మ్యాడ‌మ్ టుసార్ట్స్‌లో సౌత్ ఇండియన్ హీరో స్టాట్యూ, గ్యాల‌రీ‌ ఏర్పాటు చేయ‌టం తెలుగువాళ్లుగా ఎంతో గర్వపడాలి. బన్నీ తన మేనరిజంతో ఇలాంటి ప్ర‌త్యేక‌త‌ను ‘పుష్ప’ మూవీ ద్వారా సంపాదించుకున్నాడు. అతి త్వ‌ర‌లో ‘పుష్ఫ 2.. ది రూల్’ మూవీ రిలీజ్ కాబోతోంది.

పుష్ప మొదటి పార్ట్ మాదిరిగానే మళ్లీ ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అల్లు అర్జున్ 2.0తో మరో అసలైన తన నట విశ్వరూపాన్ని చూపించబోతున్నాడు. 90ఏళ్ల నాటి తెలుగు సినిమా చ‌రిత్రలో తొలిసారిగా ఒక తెలుగు హీరో సినిమా కోసం ఆయన న‌ట‌నను థియేటర్లలో వీక్షించేందుకు ప్ర‌పంచ దేశాల‌న్నీ ఎదురుచూసే స్థితికి పుష్ఫ మూవీ ఎదిగిందంటే.. ఆ మూవీ ఎంతగా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిందో చెప్పవచ్చు.

Read Also : Pushpa 2 Video Song : పుష్ప‌ 2 మూవీ నుంచి ‘సూసేకి అగ్గిరవ్వ’ రెండో సాంగ్ చూశారా? శ్రీవల్లి అదరగొట్టిందిగా!