Pushpa 2 Update : పుష్పగాడు వచ్చేస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్‌లో బాక్సాఫీసు రికార్డులను బద్దలు కొట్టి భారీ కలెక్షన్లు రాబట్టిన పుష్ప సీక్వెల్ రెండో పార్టుతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇప్పటికే పుష్ప 2 మూవీ నుంచి రెండు పాటలు రిలీజ్‌గా ఊహించనీ రీతిలో ఫుల్ రెస్పాన్స్ వచ్చింది. పుష్ప నుంచి ఏ చిన్న అప్‌డేట్ వచ్చినా దానికుండే రెస్పాన్స్ మామూలుగా లేదనే చెప్పాలి.
సినిమా రిలీజ్ కాకముందే పుష్ప 2 మూవీ టీమ్‌కు ఎక్కడలేని క్రేజ్ వచ్చేసింది. కలెక్షన్లు, నేషనల్ అవార్డులు వచ్చినప్పుడు కూడా ఇంతగా రెస్పాన్స్ చూసి ఉండరు. పుష్పరాజ్ టీమ్ అంటే.. ఆ మాత్రం ఉంటుందిలే అన్నట్టుగా ఉంది. ఇంతకీ పుష్పగాడు ఏ ప్లాన్ చేస్తున్నాడా అనే క్యూరాసిటీ ఎక్కువగా కనిపిస్తోంది.
పార్టీ ఎక్కడ పుష్ప అని అడిగింతేలా పుష్పరాజ్ ఎలాంటి క్రేజీ థింగ్స్ చేస్తున్నాడా? అనే ఆసక్తి నెలకొంది. సోషల్ మీడియాలో ఎక్కడా చూసినా పుష్ప గురించే తెగ ట్రెండ్ అవుతోంది. పుష్ప ఫస్ట్ పార్ట్ కన్నా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక, రాబోయే సీక్వెల్ పుష్ప ది రూల్ రిలీజ్ కూడా దగ్గరపడుతోంది. ఇప్పటికే మూవీ రిలీజ్‌కు సంబంధించి కౌంట్ డౌన్ కూడా మొదలైంది.

మరోవైపు.. సినిమా ఫైనల్ షూటింగ్ స్టేజ్ వరకు వచ్చింది. ప్రస్తుతం చివరి షెడ్యూల్ జరుపుకుంటోంది. మరో రెండు వారాల పాటు ఈ షూటింగ్ జరుగనుంది. లాస్ట్ షెడ్యూల్ సమయంలో కీలకమైన సన్నివేశాలు, క్లైమాక్స్ యాక్షన్ సీన్ షూటింగ్ పూర్తి చేయనుంది చిత్రయూనిట్. షూటింగ్ పూర్తి అయిన వెంటనే పుష్ప పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారట..
Pushpa 2 Update : పుష్ప లాస్ట్ షూటింగ్ అప్‌డేట్ వచ్చేసిందోచ్..
ఇప్పటివరకూ షూటింగ్ తీసిన వెంటనే ఎప్పటికప్పుడూ ఎడిటింగ్ పనులు కూడా జరిగిపోతున్నాయట.. ఫైనల్‌గా నిర్మాణానంతర పనులను కూడా మొదలుపెట్టేస్తోంది పుష్ప టీమ్. అంతటితో ఆగలలేదు.. సినిమా ప్రమోషన్లపై కూడా పుష్ప టీమ్ ఫుల్ ఫోకస్ పెట్టేసింది.
అత్యంత వేగంగా మూవీ ప్రమోషన్ ప్లానింగ్ జరుగుతోందని టాలీవుడ్ వర్గాల సమాచారం. ఇప్పటికే దీని గురించి సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. లాస్ట్ అప్‌డేట్ వచ్చిరాగానే అదే జోరుగా ట్రెండ్ కొనసాగుతోంది. వచ్చే ఆగస్టు 15న పుష్ఫ 2 మూవీ రిలీజ్ చేసేందుకు మూవీ యూనిట్ ప్లాన్ చేస్తోంది. అయితే, మూవీ రిలీజ్ టెన్షన్ దగ్గర పడుతున్నా ఏమాత్రం టెన్షన్ లేకుండా మూవీ యూనిట్ శరవేగంగా పనులను జరుపుకుంటోంది.
అన్ని సినిమాల్లా కాకుండా పుష్ప 2 మూవీ ప్రమోషన్ ప్లానింగ్ ఎంతమాత్రం తగ్గడం లేదు.. అసలు తగ్గేదేలే అన్నట్టుగా ముందుకు దూసుకుపోనుంది. మరికొద్దిరోజుల్లో రిలీజ్ కానున్న పుష్ప 2 మూవీ కోసం అల్లు అభిమానులతో పాటు ఇతర ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read Also : Pushpa 2 Video Song : పుష్ప 2 మూవీ నుంచి ‘సూసేకి అగ్గిరవ్వ’ రెండో సాంగ్ చూశారా? శ్రీవల్లి అదరగొట్టిందిగా!