Shirish Bharadwaj : చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ మృతి.. అసలు కారణం ఇదే!

0
41
Mega Daughter Srija Ex Husband Shirish Bharadwaj is no more
Mega Daughter Srija Ex Husband Shirish Bharadwaj ( Image Source : Google )

Shirish Bharadwaj : టాలీవుడ్ మెగా‌స్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ మాజీ భర్త అయిన శిరిష్ భరద్వాజ్ మృతిచెందారు. గతకొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈరోజు మృతిచెందినట్టు సమాచారం. ఊపిరితిత్తులు దెబ్బతినడంతో ఆస్పత్రిలో చేరిన శిరిష్ ఆరోగ్యం విషమించి కన్నుమూసినట్టు తెలిసింది. 2007 ఏడాదిలో చిరంజీవి కూతురు శ్రీజను శిరీష్ భరద్వాజ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

అప్పట్లో పెద్దలకు తెలియకుండా వివాహం చేసుకోవడంతో మెగా ఫ్యామిలీ గురించి టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. పెళ్లి చేసుకున్న కొన్నేళ్ల తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. దాంతో శ్రీజ, శిరీష్ తమ పెళ్లి బంధానికి స్వస్తి పలికారు. అప్పట్లోనే తనను అదనపు కట్నం కోసం శిరీష్ వేధిస్తున్నాడంటూ శ్రీజ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. శిరీష్, శ్రీజకు ఒక పాప కూడా పుట్టింది.

Mega Daughter Srija Ex Husband Shirish Bharadwaj is no more
Shirish Bharadwaj ( Image Source : Google )

శ్రీజతో విడాకుల అనంతరం 2019లో హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ విహనను శిరీష్ పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఈ దంపతులిద్దరూ చెన్నైలో నివాసం ఉంటున్నట్టుగా తెలిసింది. కొద్దికాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న శిరీష్ లంగ్స్ దెబ్బతిని ఆరోగ్యం విషమించి మృతిచెందినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

శిరీష్ భరద్వాజ్ నుంచి విడాకులు తీసుకున్న అనంతరం శ్రీజ ప్రముఖ వ్యాపారవేత్త కళ్యాణ్ దేవ్‌ను ప్రేమించించింది. అనంతరం పెద్దల సమక్షంలో ఘనంగా శ్రీజ పెళ్లి చేసుకుంది. 2016 ఏడాదిలో బెంగళూరులో శ్రీజ, కల్యాణ్ దేవ్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ దంపతులకు కూడా ఒక కుమార్తె జన్మించింది.

ప్రస్తుతం శ్రీజతో కల్యాణ్ దేవ్ విడిపోయి ఎవరికి వారు తమ జీవితాన్ని గడుపుతున్నారు. శ్రీజతో విడాకుల అనంతరం శిరీష్ భ‌ర‌ద్వాజ్ బీజేపీలో చేరి రాజకీయాల్లో కొనసాగారు. తీవ్ర ఆరోగ్య సమస్యలతో శిరీష్ భరద్వాజ్ మృతిచెందారు.

Shirish Bharadwaj : చిరంజీవి మాజీ అల్లుడు ఇక లేరు : శ్రీరెడ్డి

శిరీష్ భరద్వాజ్ మృతిపై నటి శ్రీరెడ్డి సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. ఆ పోస్టులో.. చిరంజీవి మాజీ అల్లుడు శిరీష్ భరద్వాజ్ ఇక లేరు. ఇప్పటినుంచైనా నీకు శాంతి దొరికిందిరా శిరీష్. అందరూ నిన్ను మోసం చేశారని ఫేస్‌బుక్‌‌లో పోస్టు చేసింది శ్రీరెడ్డి. ఇప్పుడు ఈ పోస్టు వైరల్ అవుతోంది.

Read Also : Pushpa 2 Release Date : పుష్పరాజ్ వచ్చేస్తున్నాడు.. తగ్గేదేలే.. పుష్ప-2 మూవీ కొత్త రిలీజ్ డేట్ ఇదిగో..!