Pawan Kalyan : ఏపీ సచివాలయం సందడిగా మారింది. మంత్రుల బాధ్యతల స్వీకరణ నేపథ్యంలో సచివాలయంలో సందడి వాతావరణం నెలకొంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఇప్పటికే పవన్ 5 కీలక శాఖల బాధ్యతల స్వీకరణకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ కాసేపట్లో పదవి బాధ్యతలు స్వీకరించనున్నారు. విజయవాడలోని క్యాంప్ ఆఫీసులో పవన్ బాధ్యతల స్వీకరణకు అధికారులు ఏర్పాటు చేశారు. ఈరోజు ఉదయం 9.30 పవన్ విజయవాడలోని తనకు కేటాయించిన క్యాంపు ఆఫీసులో బాధ్యతలు స్వీకరించనున్నారు.
Pawan Kalyan : డిప్యూటీ సీఎంగా తొలి సంతకం దేనిపై చేస్తారో?
బాధ్యతల స్వీకరణ అనంతరం పవన్ కీలక సమావేశాలను నిర్వహించనున్నారు. బాధ్యతలు స్వీకరించిన రోజే డిప్యూటీ సీఎంగా పవన్ ఫుల్ బిజీగా గడపనున్నారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో భేటీ కానున్నారు.
అలాగే మంత్రిత్వ శాఖ అయిన పంచాయితీరాజ్, రూరల్ డెవలప్మెంట్, రూరల్ వాటర్ సప్లయ్, అటవీ పర్యావరణం, శాస్త్ర, సాంకేతిక శాఖల బాధ్యతల్ని కూడా పవన్ స్వీకరించనున్నారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన తొలి సంతకం ముందుగా దేనిపై చేస్తారనే ఆసక్తి నెలకొంది.

బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఉదయం 11 గంటల 30 నిమిషాలకు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో భేటీ నిర్వహించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు గ్రూప్ 1, గ్రూప్ 2 అధికారులతో సమావేశం కానున్నారు.
మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు పంచాయితీ సెక్రటరీ అసోసియేషన్‌తో జనసేనాని భేటీ కానున్నారు. గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులతో వివిధ అంశాలపై పవన్ చర్చించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు మంగళగిరి పార్టీ ఆఫీసుకు పవన్ వెళ్లనున్నారు. ఈ రాత్రి పార్టీ ఆఫీసులోనే పవన్ బస చేయనున్నారు.
