Ashwagandha Powder Benefits : అశ్వగంధతో కలిగే అద్భుత ప్రయోజనాలివే.. ఎప్పుడు? ఎలా వాడాలి? ఎవరు తినొచ్చు ? ఎవరు తినకూడదంటే?

Ashwagandha Powder Benefits : ఆయుర్వేదంలో అశ్వగంధకు ఉన్న గుర్తింపు అంతా కాదు. దీన్ని దివ్య ఔషధంగా భావిస్తారు. ఇప్పుడు అశ్వగంధ వల్ల కలిగే పూర్తి ప్రయోజనాలు ఇప్పుడు తెలుసుకుందాం. అశ్వగంధవ పురాతన మూలిక. మనలో ఒత్తిడిని వెంటనే తరిమేస్తుంది. శరీరం బ్రెయిన్‌కి అంతులేని మేలు చేస్తుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ తొందరగా తగ్గించగలదు. మనలో ఎనర్జీ లెవెల్స్ వెంటనే పెంచగలదు. కంటి చూపును మెరుగుపరచగలదు.

అశ్వగంధ అంటే.. గుర్రం వాసన అని అర్థం. ఎందుకంటే ఈ మూలిక వాసన ప్రత్యేకంగా ఉంటుంది. అశ్వగంధ భారత్‌లోని ఉత్తర ఆఫ్రికాలో కనిపిస్తుంది. వేర్లు ఆకుల్ని ఔషధాలు వాడుతారు. మాటిమాటికి.. బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతుంటే.. అలాంటి వారు అశ్వగంధను వాడొచ్చు. ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది. తద్వారా షుగర్ లెవల్స్ అదుపులో ఉంచుకోవడంలో సాయపడుతుంది. ఇంతకీ, అశ్వగంధను ఎలా వాడాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

అశ్వగంధ ఎలా వాడాలంటే? :
అశ్వగంధలోని వితా ఫెరిన్ అనే పదార్థం క్యాన్సర్ అడ్డుకోగలదని పరిశోధనలో తేలింది. రకరకాల క్యాన్సర్లకు కూడా ఇది మందుగా పనిచేస్తుంది. పార్టిసాల్ అనే ఒత్తిడి పెంచే హార్మోనిది. ఎక్కువగా విడుదల అవ్వకుండా అశ్వగంధ కంట్రోల్ చేయగలదు. దీని కారణంగా ఒక్కోసారి బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. మీకు టెన్షన్లు, ఒత్తిడి, కంగారు, ఆందోళన హడావిడి, బిజీ లైఫ్ స్టైల్ ఉన్నట్లయితే.. మీరు అశ్వగంధ వాడడమే మేలు. తద్వారా మీకు ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. మీ బ్రెయిన్ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కొంతమంది అంతా అయిపోయిందని ఇక చావడమే మేలని నెగటివ్ ఆలోచనలు పెంచుకుంటూ ఉంటారు. అలాంటి వారు అశ్వగంధ వాడితే పాజిటివ్ అయిపోతారు. భవిష్యత్తుపై ఆశలు పెరుగుతాయి. డిప్రెషన్ నుంచి తొందరగా బయటపడతారు.

శరీర నిర్మాణం కండరాల్లో బలం పెంచడం అశ్వగంధకు మంచి పేరుంది. మగవారు రోజుకు 750 మిల్లీగ్రాములు చొప్పున 30 రోజులు తీసుకుంటే కండరాలు రాడ్డుల్లా తయారవుతాయి. శరీరంలో వేడి ఉన్నంతదాని కన్నా ఎక్కువగా దాటితే ప్రమాదం. అందుకే వేడిని కంట్రోల్ చేయడంలో అశ్వగంధ బాగా పనిచేస్తుంది. తద్వారా వ్యాధి నిరోధక శక్తి పెరిగేలా చేస్తుంది. అశ్వగంధ వాడే వారి బ్రెయిన్ చురుగ్గా ఉంటుంది. మతిమరుపు లక్షణాలు వారిలో కనిపించవు. ఈ కారణంగా మెదడు దెబ్బతింటే అశ్వగంధ వాడాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

నిత్యం సేవిస్తే.. అనేక అరోగ్య ప్రయోజనాలు :
అశ్వగంధ వేర్లను ముక్కలుగా చేసి వాటిని నేతిలో వేసి కాచి ఆ నేయిని పూటకు 20 గ్రాముల మోతాదు చొప్పున తీసుకోవాలి. ప్రతిరోజూ మూడు పూటలా తీసుకున్న లేదా ఆ నేతిని అన్నంలో కలిపి తింటూ ఉన్న కీళ్ల నొప్పులు, నడుం నొప్పి తగ్గుతాయి. నరాలు కూడా శక్తివంతమవుతాయి. అశ్వగంధ చూర్ణాన్ని వెన్నుపూస కలిపి ప్రతిరోజు ఉదయం సాయంత్రం సేవిస్తూ ఉంటే.. జుట్టుకు సంబంధించిన పలు సమస్యలు తొలగిపోతాయి. వెంట్రుకలు మృదువుగా మారడంతో పాటు ఒత్తుగా పెరుగుతాయి. ప్రతిఏటా రెండు మాసాల పాటు అశ్వగంధ చూర్ణాన్ని వాడితే చక్కని ఆరోగ్యంతో పాటు నిండు యవ్వనం వారి సొంతమవుతుంది. అశ్వగంధ చూర్ణానికి సమానంగా దానిమ్మ చూర్ణం పొడిని సమానంగా కలిపి భోజనం తర్వాత ఒక స్పూన్ తేనెతో కలిపి నెల రోజులపాటు తీసుకుంటే వీర్య వృద్ధి కలుగుతుంది.

Ashwagandha Powder Benefits : చక్కని నిద్ర కోసం అశ్వగంధను ఇలా వాడాలి :

నాలుగు గ్రాముల అశ్వగంధ చూర్ణాన్ని తేనెతో కలిపి పాలలో తీసుకుంటూ ఉంటే వృద్ధాప్యంలో కూడా శరీరం పుష్టిని పొందుతుంది. 10 గ్రాముల అశ్వగంధ చూర్ణాన్ని నెయ్యితో కలిపి సేవిస్తూ ఉండాలి. అంతేకాదు.. కొద్దిగా కప్పు పాలు తాగితే చక్కని నిద్ర పడుతుంది. అశ్వగంధ చూర్ణాన్ని పాలు, నువ్వుల నూనె, నెయ్యి, గోరువెచ్చని నీరుతో కలిసి ఏదో ఒకదానితో సేవిస్తుంటే.. బాగా బక్క చిక్కిన పిల్లల సైతం బలంగా తయారవుతారు. రెండు స్పూన్ల చూర్ణాన్ని పాలతో కలిపి తీసుకుంటే.. పసిపిల్లల తల్లులకు పాలు వృద్ధి అవుతాయి. అశ్వగంధ చూర్ణం శుద్ధి చేసిన పటికను సమపాలలో తీసుకుని కలిపి ఒక స్పూను మోతాదులో రోజుకు రెండుసార్లు రుతు సమయంలో తీసుకుంటే తెల్ల బట్ట తగ్గుతుంది.

ashwagandha powder benefits
Ashwagandha Powder Benefits ( Image Credit : Google )

అశ్వగంధ పాలతో కలిపి తాగడం వల్ల అధిక రక్తపోటుని నివారిస్తుంది. అధిక రక్తపోటును ఒక సాధారణ స్థాయి తీసుకొచ్చేందుకు 125 మిల్లీగ్రాములు, రెండు గ్రాముల అశ్వగంధ పొడిని కలిపి తయారుచేసిన మిశ్రమాన్ని రోజుకు రెండు సార్లు తీసుకోవాలి. తద్వారా శారీరక నీరసాన్ని తగ్గిస్తుంది. రెండు గ్రాముల అశ్వగంధ పొడిని 125 మిల్లీగ్రాముల త్రికాటు పొడితో కలిపి త్రికాటంలో మూడు ఘాటిని మూలికలు ఉంటాయి. ఇందులో ఎండిన అల్లం, నల్ల మిరియాలు, పొడుగు మిరియాలతో కలిపి రెండు సార్లు తీసుకోవాలి. రెండు గ్రాముల అశ్వగంధపు రెండుసార్లు పాలతో కలిపి తీసుకోవాలి. ఒక టీ స్పూన్ చక్కర, ఒక గిన్నెలో నాలుగు కప్పుల పాలు, 10 గ్రాముల అశ్వగంధ పొడిని కలిపి తీసుకోవాలి.

షుగర్ తగ్గాలంటే ఆవు పాలను వాడాలి. అందులో జెర్సీ వాడకూడు. లేదంటే.. డయాబెటిక్ లెవెల్స్ పెరుగుతాయి. మన దేశీ ఆవు ఏదైతే ఉంటుందో ఆ దేశ ఆవుపాలు వాడితేనే మనకి 100శాతం రిజల్ట్ కనిపిస్తుంది. పెన్నేరు గడ్డ అని కూడా దీనికి పేరుంది. మీలో ఏదైనా జబ్బునైనా తగ్గించే గుణం ఈ అశ్వగంధానికి ఉంది. ప్రస్తుత రోజుల్లో క్యాన్సర్ పేషెంట్‌కి కూడా ఈ అశ్వగంధని ఇచ్చి ఆ కాన్సర్ నయం చేయడంలో సాయపడుతుంది. ఈ విషయం ప్రాక్టికల్‌గా కూడా రుజువైందని అంటున్నారు.

Read Also : Lasoda Fruit Health Benefits : పిచ్చి మొక్క కాదు ఇది.. ఔషధాల గని.. విరిగి పండ్లతో వందలాది వ్యాధులు దూరం.. కనిపిస్తే ఇంటికి తెచ్చుకోండి!