CM Chandrababu Naidu : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ నేతృత్వంలోని జనసేన, బీజేపీ కూటమి సూపర్ విక్టరీ సాధించింది. ఏపీ అసెంబ్లీలో మొత్తం 175 సీట్లకు ఎన్డీఏ కూటమి 164 సీట్లతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ ఎన్నికల్లో వైస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 11 స్థానాలకే సరిపెట్టుకుంది. దాంతో ఏపీలో టీడీపీ కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. బీజేపీ, జనసేన సహాకారంతో టీడీపీలో మళ్లీ ఏపీలో అధికారం చేపట్టింది. టీడీపీ అఖండ విజయంతో ఏపీలో నాల్గోసారి ముఖ్యమంత్రిగా ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
తన కేబినెట్‌లోని మంత్రులతో కూడా ఆయన ప్రమాణం చేయించారు. రాష్ట్రంలో గత ప్రభుత్వంలో పూర్తి పనులతో పాటు మొత్తం పరిపాలనపైనే సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. అందులోనూ ప్రత్యేకించి అనేక పథకాల అమలు విషయంలో కూడా కీలక నిర్ణయాలను తీసుకుంటున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన టీడీపీ అధినేత అధికారంలో వచ్చిన అనంతరం ముఖ్యంగా ప్రజా సంక్షేమంపైనే తన దృష్టిని కేంద్రకరించారు. అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకుని వారికి ఒక్కొక్కటిగా శుభవార్తలను అందిస్తున్నారు. ఎన్నికల్లో హామీలు పూర్తిస్థాయిలో నెరవేర్చేలా ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారు.
CM Chandrababu Naidu : చంద్రన్న బీమా పథకం ఎవరికి వర్తిస్తుందంటే?
టీడీపీ ప్రభుత్వం ఏపీ ప్రజల సంక్షేమానికే పెద్దపీట వేస్తుందని చంద్రబాబు చెబుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలోని పథకాలను కొనసాగిస్తామని కూడా స్పష్టం చేశారు. అయితే, ఆయా పథకాల పేర్లలో మార్పులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరో పథకం పేరును చంద్రబాబు సర్కార్ మార్చేసింది. గత వైసీపీ హయాంలో అమలైన వైఎస్సార్ బీమా పథకం పేరును చంద్రన్న బీమా పథకంగా పేరు మార్చేసి అధికారిక ఉత్తర్వులను జారీ చేశారు సీఎం చంద్రబాబు. పేదలతో పాటు అసంఘటిత రంగ కార్మికులకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.

కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడం కోసం ఈ పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. ఈ పథకం కింద 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల లోపు వయసు కలిగిన కుటుంబ పెద్దల్లో ఎవరైనా సహజ మరణంతో వారి కుటుంబానికి రూ.లక్ష పరిహారంగా ఏపీ ప్రభుత్వం అందిస్తుంది. 18ఏళ్ల 70 ఏళ్లలోపు వయసున్న కుటుంబ పెద్ద ప్రమాదవశాత్తు మరణించినా లేదా శాశ్వత వైకల్యం సంభవించినా వారి కుటుంబానికి రూ.5 లక్షల పరిహారాన్ని ప్రభుత్వం చెల్లించనుంది.
Read Also : CM Chandrababu Salary : ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు నాయుడు నెల జీతం ఇదేనట!