Gold Price Today : బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ఎంత తగ్గిందంటే?

Gold Price Today : బంగారం ధర తగ్గిందోచ్.. బంగారం కొనేందుకు చూస్తున్నవారికి ఇదే సరైన సమయం. ఇప్పటివరకూ ప్రపంచ బులియన్ మార్కెట్లో దూసుకుపోయిన బంగారానికి ఎట్టకేలకు బ్రేక్ పడింది. కొన్నిరోజులుగా దూకుడు మీదున్న బంగారం ధరలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. యూఎస్‌లో వడ్డీ రేట్లు, అంతర్జాతీయంగా గోల్డ్, సిల్వర్‌పై పెట్టుబడులు నెమ్మదించడమే అసలు కారణమని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే కొద్దిరోజులు కూడా బంగారం ధరలు తగ్గే అవకాశం లేకపోలేదని అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ బంగారం మార్కెట్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 250 తగ్గగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర సుమారుగా రూ. 270 వరకు తగ్గింది.

Gold Price Today : తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇవే :

తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్టాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. సోమవారం (మే 27) బంగారం ధరల్లో హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల బంగారం 10గ్రాముల ధర రూ.66,650 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,710కు తగ్గింది. నిన్నటి ధర రూ.72,440తో పోలిస్తే.. రూ. 270 వరకు తగ్గింది. అలాగే, విజయవాడలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,650 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,710కి తగ్గింది. విశాఖపట్నంలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,650 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,710కి తగ్గింది.

Gold Price Today _ Gold And Silver Prices in Hyderabad and Vijayawada on May 27th in Telugu
Gold Price Today

మెట్రో నగరాల విషయానికి వస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,800 కాగా, 24 క్యారట్ల 10 గ్రాములు బంగారం రూ. 72,860గా ఉంది. ముంబై, కోల్‌కతా, బెంగళూరు నగరాల్లో.. 22 క్యారట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.66,650 కాగా, 24 క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 72,710గా ఉంది. చెన్నై నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 67,200 ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.73,310గా ఉంది.

వెండి ధర ఎంతంటే? :

బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా భారీగానే తగ్గాయి. దేశవ్యాప్తంగా సోమవారం (ఉదయం 11 గంటలు)కు నమోదైన డేటా ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లో వివిధ నగరాల్లో వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా హైదరాబాద్, విజయవాడ, విశాఖలో కిలో వెండి ధర రూ.97,500. అలాగే చెన్నైలో కిలో వెండి రూ.93,000 ఉండగా, కోల్‌కతా, ముంబై, ఢిల్లీ ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ.93,000, బెంగళూరులో కిలో వెండి ధర రూ. 92,000కు చేరింది.

Read Also : Gold Rates Today May 23, 2024 : బంగారం ప్రియులకు బిగ్ రిలీఫ్.. తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎంతంటే?