Pregnant Women Worship : గర్భవతులు పూజ దీపారాధన చేయవచ్చా? ఏ నెల నుంచి గర్భవతులు దీపారాధన పూజ చేయకూడదు అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. దీపం పరబ్రహ్మ స్వరూపం అని అంటారు. గర్భవతిగా ఉన్నప్పుడు పూజ చెయ్యకూడదా? దీపారాధన చేయకూడదా? అంటే.. మహిళకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి డెలివరీ అయ్యేంతవరకు చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకోవచ్చు.
అయితే నెలలు పెరుగుతున్న కొద్దీ గర్భిణీకి పూజ చేయడంలో కొద్దిగా ఇబ్బంది కలగవచ్చు. అలాంటప్పుడు ఇంట్లో దేవుని దగ్గర చక్కగా దీపం పెట్టి చైర్‌లో కూర్చుని లేదంటే.. టేబుల్ మీద కూర్చొని దేవుని స్మరించవచ్చు. అలాగే రోజు పురాణాలు చదవడం అలాగే భగవద్గీతను వినడం వంటివి చేయవచ్చు. అయితే, గర్భవతులు కొబ్బరికాయ కొట్టడం వంగి ఏదైనా అభిషేకాలు చేయడం అలాగే గుళ్లో ప్రదక్షిణలు చేయడం పనికిరావు.
ఇంకా ఏడో నెల నుంచి కొన్ని ప్రత్యేక పూజలు చేయకూడదు అని పెద్దవాళ్లు అంటారు. ఎందుకంటే.. గర్భవతి ఆరోగ్యం దృష్ట్యా ప్రత్యేక పూజలు చేయకూడదు అంటారు. ఎందుకంటే.. ఆ పూజలలో ఉపవాసం ఉండవలసి వస్తుంది. కొబ్బరికాయ కూడా కొట్టవలసి వస్తుంది. అలాగే చాలా సేపు వస్తుంది. అప్పుడు గర్భస్థ శిశువుకు ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి.. గర్భిణీలకు కొన్ని ప్రత్యేక పూజలు పనికిరావు. అలాగే, తీర్థయాత్రలకు వెళ్ళకూడదు అని అంటుంటారు.
మానసిక ఆరాధన ఇబ్బందికరంగా లేని పూజలు చేయవచ్చు. అలాగే గర్భవతులు వరలక్ష్మి వ్రతం, కేదారేశ్వర వ్రతం, సత్యనారాయణ వ్రతం, కాత్యాయని వ్రతం, గౌరీ వ్రతం, సంకటహర చతుర్థి వ్రతాలు అలాగే దీపావళి రోజున చేసే వ్రతాలు చేయకూడదు అని పెద్దలు చెప్తుంటారు. గర్భవతులు ఇంట్లో చక్కగా దీపారాధన పూజ చేసుకోవచ్చు. అయితే 5 నెలలు నిండినప్పటి నుంచి మాత్రం గర్భవతులు ఆలయాలకు వెళ్ళకూడదు అని పెద్దలు చెబుతుంటారు.
Pregnant Women Worship : దేవాలయాలకు గర్భిణీలు వెళ్లకూడదా? :
గర్భవతులకు పూజల విషయంలో ఈ నియమం పెట్టడం వెనుక దాగిన పరమార్థం ఇదే.. కేవలం గర్భవతుల క్షేమానికి సంబంధించి మాత్రమే ఈ నియమాన్ని అప్పట్లో పెద్దలు పెట్టారని చెప్పవచ్చు. అంతేతప్ప మరొకటి లేదు. గర్భవతిగా ఉన్న సమయంలో స్త్రీలు పూజల పేరుతో ఎక్కువ సేపు నేలపై కూర్చోలేరు. అలా చేస్తే వారికి పుట్టబోయే బిడ్డకు మంచిది కాదనే సదుద్దేశంతోనే ఈ నియమం పెట్టినట్టు తెలుస్తోంది.

పుణ్యక్షేత్రాల్లో అన్ని దాదాపు కొండలపైనే కొలువై ఉంటాయి. వందల మెట్లు ఉంటాయి. అందులోనూ ఆయా దేవాలయాల్లో భక్తుల రద్దీ కూడా ఎక్కువగానే ఉంటుంది. అలాంటి ప్రదేశాలకు గర్భవతులు వెళ్లడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. అన్ని మెట్లను ఎక్కలేరు. అందుకే అప్పట్లో మన పెద్దలు ఈ నియమాన్ని పెట్టినట్టుగా గ్రహించాలి. ధ్యానంతో మానసిక ప్రశాంతతను పొందవచ్చునని ఆరోగ్య నిపుణులు కూడా సూచిస్తున్నారు.
గర్భిణీలు నిత్య పూజ చేయవచ్చా..?
గర్భిణిలు దేవాలయాలకు వెళ్లి భగవంతుని దర్శనం చేయకూడదని అంటారు. కానీ, దేవుని ఆరాధన చేసుకోవచ్చు. భగవంతుని నామాన్ని జపించి తీరాలి. ఎందుచేత అంటే భగవంతుని నామాన్ని జపం చేసిన కారణం చేత లేక స్మరణ చేసినా పుట్టేటువంటి పిల్లవాడు లేక ఆ సంతానం మంచి విజ్ఞానం కలిగి జ్ఞానంతో ఉత్తమైన లక్షణాలతో జన్మిస్తారని విశ్వసిస్తుంటారు. గర్భవతులు ధ్యానం చేస్తే చాలా మంచిదని శాస్త్రాలు చెబుతున్నాయి.
Read Also : Dharma Sandehalu : పెళ్లి అయిన మహిళలు పొరపాటున కూడా ఈ 5 ఆభరణాలు ఇలా ధరించకూడదు.. భర్తకు ప్రాణగండం!