Tirumala Darshan Tickets Online : తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల ఎప్పుడంటే? ఆన్‌లైన్ బుకింగ్ చేసుకోవడం ఎలా?

Tirumala Darshan Tickets Online : తిరుమల వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే, తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకోవాలంటే తప్పనిసరిగా ముందుగా టికెట్లను తీసుకోవాలి. లేదంటే దర్శనానికి వెళ్లిన సమయంలో టికెట్లు దొరక్క చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. నేరుగా తిరుమలలో టికెట్ కౌంటర్ దగ్గరకు వెళ్లి లైనులో నిలిచుని మరి టికెట్లను కొనుగోలు చేయడమంటే చాలా కష్టమే.

ఒకవేళ నిలబడినా టికెట్లు దొరుకుతాయని గ్యారెంటీ ఉండదు. ఇలాంటి ఏ టెన్షన్ లేకుండా సులభంగా స్వామివారి దర్శనం చేసుకోవాలంటే అడ్వన్స్ బుకింగ్ చేసుకోవడమే ఉత్తమం. అందుకే చాలామంది తిరుమల వెళ్లి టికెట్లు తీసుకోవడం కన్నా ఆన్‌లైన్‌లో శ్రీవారి దర్శన టికెట్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు.

ప్రత్యేకించి శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థమై ఆన్‌లైన్‌లో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను విడుదల చేస్తుంటుంది. తాజాగా తిరుమల దేవస్థానం (టీటీడీ) వారు తిరుమల వచ్చే భక్తుల కోసం ఈ నెల 24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ టికెట్ల ధర కేవలం రూ. 300 మాత్రమే. అందులోనూ వచ్చే సెప్టెంబర్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లు ఆన్‌లైన్ కోటాను కూడా విడుదల చేయనుంది.

Tirumala Darshan Tickets Online : శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లు బుకింగ్ తేదీలివే :

మరోవైపు.. మంగళవారం ఉదయం (జూన్ 18)న 10 గంటలకు ఎలక్ట్రానిక్ డిప్ ఆర్జిత సేవా టికెట్లను భక్తుల కోసం అందుబాటులోకి రానున్నాయి. అదేవిధంగా ఈ నెల 20న ఉదయం 10గంటల వరకు టికెట్లను ముందుగా బుకింగ్ చేసుకునేందుకు టీటీడీ అవకాశం కల్పించింది. అదే రోజున టీటీడీ మరిన్ని టికెట్లను విడుదల చేసే అవకాశం ఉంది.

How to book tirumala darshan tickets online September 2024 in telugu
Tirumala Darshan Special Tickets Online ( Image Source : Google )

జూన్ 21న మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్లను విడుదల చేయనుంది. ఈ నెల 22న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్లను కూడా విడుదల చేయనుంది. అదే రోజు ఉదయం 11 గంటలకు శ్రీవాణి టికెట్లను కూడా టీటీడీ దేవస్థానం రిలీజ్ చేయనుంది. ఈ నెల 22న మధ్యాహ్నం 3 గంటలకు దివ్యాంగుల దర్శన టికెట్లు, వయోవృద్ధుల కోసం టోకెన్లను కూడా విడుదల చేయనుంది. చివరిగా ఈ నెల 24న రూ. 300తో ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది.

Read Also : Pushpa 2 Release Date : పుష్పరాజ్ వచ్చేస్తున్నాడు.. తగ్గేదేలే.. పుష్ప-2 మూవీ కొత్త రిలీజ్ డేట్ ఇదిగో..!