Maha Shivratri 2024 : మహాశివరాత్రి పర్వదినం ఎంతో ప్రాముఖ్యమైనది. అందులోనూ మారేడు దళం అంటే మహాశివుడికి ఎంతో ప్రీతి. అత్యంత శక్తివంతమైన మారేడు మొక్క దగ్గర మహాశివరాత్రి రోజున ఏయే పూజలు చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసా? మహాశివరాత్రి రోజు 14 లోకాల్లో ఉన్నటువంటి పుణ్య తీర్థాలన్నీ కూడా మారేడులో ఉంటాయి. శివరాత్రి రోజు మారేడు మొక్క దగ్గర కొన్ని ప్రత్యేకమైన పూజలు చేస్తే మీ ఇంట్లో మహాలక్ష్మి కొలువుదీరుతుంది.
Read Also : Ganesh Jayanti 2023 : వినాయకుడు ఎలా జన్మించాడు.. విఘ్ననాయకుడు అనే పేరు ఎలా వచ్చిందంటే?
మహాశివరాత్రి రోజు ఎవరైనా సరే ఎక్కడైనా దగ్గర్లో ఉన్న శివాలయానికి వెళ్లి ఆలయ ప్రాంగణంలో మారేడు మొక్క నాటితే చాలా మంచిది. వారికి అఖండ సంపద కలుగుతుంది. శివాలయంలో మారేడు మొక్క నాటడం వీలు కాకపోతే మీ ఇంట్లో తులసి కోట పక్కనే చిన్న కుండిలో మారేడు మొక్క నాటండి. ఆ మారేడు మొక్క దగ్గర మట్టితో చేసిన శివలింగం ఉంచి జలాభిషేకం చేయండి. శివలింగానికి నీళ్లతో అభిషేకం చేసుకోవడం ద్వారా శ్రీమహాలక్ష్మి దేవి అఖండైశ్వర్య ప్రాప్తిని అనుగ్రహిస్తుంది.
మారేడు దళంతో నియామాలను పాటించండి :
ప్రతిరోజు మారేడు మొక్క నాటండి. వీలు కాకపోతే తులసి కోట పక్కనే ఒక కుండీ పెట్టుకొని అందులో మారేడు మొక్క నాటండి. అక్కడ మట్టితో చేసిన శివలింగం పెట్టి జలాభిషేకం చేయండి. లక్ష్మీ కటాక్షం అద్భుతంగా కలుగుతుంది. అలాగే మారేడు దళానికి సంబంధించి కొన్ని అద్భుతమైన నియమాలు కూడా ఉన్నాయి. ఒక మారేడు దళాన్ని పరమేశ్వరుడికి ఎన్ని రోజులైనా సమర్పించవచ్చు. సమర్పించిన మారేడు దళాన్ని మళ్ళీ కడిగి కూడా పూజలకు వినియోగించుకోవచ్చు. ఒకసారి శివుడికి మారేడు దళం పెట్టి పూజ చేశాక మళ్ళీ మర్నాడు అదే మారేడు దళాన్ని కడుక్కొని పూజకు వాడుకోవచ్చు. అదే మారేడుతలంతో శివ పూజ చేయొచ్చని పురాణా గ్రంధాల్లో చెప్పడం జరిగింది.
మీకు శివపూజకు చేయగల శక్తి ఉంటే వెండితో గాని లేదా బంగారు లోహంతో గాని ఒక మారేడు దళం తయారు చేయించుకోవాలి. ప్రతిరోజు ఆ వెండి మారేడు దళం లేదా బంగారు మారేడు దళంతో శివలింగానికి సమర్పించండి. శివుడికి సమర్పించండి లేదా మారేడు దళాలతో శివ పూజ చేస్తూ ఉండండి. అయితే, మారేడు దళాలనేటటువంటివి ఒకసారి శివుడికి పూజ చేసిన తర్వాత మళ్లీ కొత్త మారేడు దళాలు తెచ్చుకోండి. మీ దగ్గర మారేడు దళాలు లేవనుకోండి.. ఆ పూజకు ఉపయోగించినటువంటి మారేడు దళాలే మళ్లీ కడిగి వాటిని శివ పూజకు ఉపయోగించుకోవచ్చు. అంతేకాదు.. కింద పడినటువంటి మారేడు దళం కూడా కడిగి శివ పూజకు వినియోగించుకోవచ్చు. ఈ విషయాన్ని ఆచార మయూకం అనే గ్రంథంలో చెప్పడం జరిగింది.

అలాగే, ఎవరైనా సరే మహాశివరాత్రి రోజు అఖండ సామ్రాజ్యాధిపత్యం పొందాలనుకుంటే.. బ్రహ్మాండమైనటువంటి పదవులు, బ్రహ్మాండమైన రాజయోగం, బ్రహ్మాండమైనటువంటి ప్రమోషన్లు రావాలంటే మారేడు దళంతో ఈ ప్రత్యేకమైన పూజను చేయాలి. కొబ్బరినీళ్ళల్లో మారేడు దళాన్ని ముంచాలి. కొబ్బరి నీళ్లలో ముంచిన మారేడు దళంతో శివలింగం దగ్గర గాని శివుడి ఫోటో దగ్గర గాని ఉంచి నమస్కారం చేసుకోవడం ద్వారా మహాదైశ్వర్యం కలుగుతుంది. శివరాత్రి రోజు ఒక మారేడు దళం తీసుకొని దాన్ని కొబ్బరి నీళ్లలో తడిపాలి. కొబ్బరినీళ్ళల్లో తడిపిన మారేడు దళం శివుడి దగ్గర నుంచి నమస్కారం చేసుకోవాలి. మీ కోరికలను చెప్పుకోవాలి. మీకు కచ్చితంగా మహదేశ్వరియం కలుగుతుంది. అఖండ సామ్రాజ్య ఆదిపత్యం, రాజయోగం కలుగుతుందని ఆగమ శాస్త్రంలో చెప్పడం జరిగింది.
ఈ 11 దీపాలతో అష్ట దరిద్రాలు తొలగిపోతాయి :
ఎవరైనా సరే, మహాశివరాత్రి రోజు మారేడు చెట్టు దగ్గర, బిల్వ వృక్షం దగ్గర 11 దీపాలు వెలిగిస్తారో అట్టివారికి జీవితంలోని అష్ట దరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఆడవాళ్లు లేదా మగవాళ్ళు ఎవరైనా సరే శివ ఆలయంలో గాని ఇంట్లో గాని మారేడు ఎక్కడ ఉంటే.. అక్కడకు వెళ్లి 11 ప్రమిదలు పెట్టాలి. ఆ 11 ప్రమిదల్లో ఆవు నెయ్యి గాని నువ్వుల నూనె గాని పోసి దీపాలు వెలిగించాలి. అలా 11 ప్రమిదల్లో మహాశివరాత్రి రోజు మారేడు వృక్షం దగ్గర లేదా మారేడు మొక్క దగ్గర దీపం పెడితే ఎన్నో జన్మలు పాపాలు నశించిపోతాయి. ఈ 11 దీపాల వల్ల అష్ట దరిద్రాలు తొలగిపోతాయి. ప్రతి ఒక్కరి జీవితంలో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలాగే, మహాశివరాత్రి రోజు మారేడు చెట్టు దగ్గర ఎవరికైనా భోజనం పెడితే అనేక వేల మందికి అన్నదానం చేసిన ఫలితం కలుగుతుంది. అలాగే మహాశివరాత్రి రోజు ఎవరైనా సరే మారేడు చెట్టు సమీపంలో లేదా మారేడు మొక్క దగ్గర ఎవరికైనా క్షీరాన్నంగానే నెయ్యి గాని దానం ఇస్తే.. వాళ్ళు జన్మలో దరిద్రులు కారని ధర్మసింధు అనే గ్రంధాల్లో చెప్పడం జరిగింది.
ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండాలంటే? :
మీ జీవితంలో ఆర్థిక బాధలు అనేవి రాకుండా ఉండాలంటే అద్భుతమైన పరిష్కారం ఒకటి ఉంది. జీవితంలో దరిద్రం అనేది లేకుండా ఉండాలంటే జీవితంలో డబ్బుకు ఎప్పుడు లోటు లేకుండా ఉండాలంటే మహాశివరాత్రి రోజు ఎక్కడైనా మారేడు వృక్షం ఉందో చూసుకోండి. ఆ మారేడు వృక్షం సమీపంలో గాని లేదా ఒక చిన్న మారేడు మొక్క దగ్గర పూజ చేసుకోవాలి. ఆ మారేడు మొక్క దగ్గర గాని ఎవరికైనా క్షీరా అన్నం పాలతో చేసినటువంటి పాయసం లేదా ఆవు నెయ్యి దానం ఇవ్వండి. అప్పటి నుంచి మీ జీవితంలో దరిద్రం అనేది మీ దగ్గరికి చేరదు. ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు కూడా మీ దరిదాపుల్లోకి కూడా ఉండవని ధర్మసింధు అనే గ్రంధంలో చెప్పడం జరిగింది. ఇంతటి శక్తి మారేడు దళానికి ఉంది కాబట్టి మహాశివరాత్రి పర్వదినాన మారేడు దగ్గర ప్రత్యేక పూజలను భక్తి శ్రద్ధలతో చేయడం ద్వారా అనేక పాపకర్మలను తొలగించుకోవచ్చు. ఇప్పటివరకూ మీ జీవితాన్ని పట్టిపీడిస్తున్న దరిద్రాలన్నీ తొలగిపోతాయి. అఖండ ఐశ్వర్య ప్రాప్తిని పొందవచ్చు.