Mohini Ekadashi 2024 : మే 19న మోహినీ ఏకాదశి.. ఈ రోజున 12 రాశుల వారు ఇలా చేస్తే ప్రతి పనిలోనూ విజయం తధ్యం..!

Mohini Ekadashi 2024 : ఈరోజు మే19 ఆదివారం.. మోహినీ ఏకాదశి పర్వదినం.. నేటి దినఫలాల్లో ఏకాదశి తిధి మధ్యాహ్నం ఒంటిగంట యాభై ఒక్క నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత ద్వాదశి తిధి వచ్చింది. అదేవిధంగా, నక్షత్రం హస్తా ఉంది. ఆదివారం హస్తా నక్షత్రంతో కలిస్తే రావడంతో మానస యోగం ఉంటుంది. ఈ మానసియోగం అనేక కార్యాలను విజయవంతంగా పూర్తిచేసేలా చేస్తుంది. అంటే.. 12 రాశుల వాళ్లు.. ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్లినప్పుడు లేదా ముఖ్యమైన ప్రయాణాలు చేసినా మానసయోగం వల్ల విశేషంగా కార్యజేయం కలుగుతుంది.

అలాగే, రాసి చక్రం చార్ట్‌లో గ్రహాల స్థితిగతులను పరిశీలిస్తే.. ఆదివారానికి అధిపతి అయిన సూర్యుడు వృషభరాశిలో శుక్రుడు ఇంట్లో ఉన్నాడు.. అంటే శత్రువు ఇంట్లో ఉన్నాడు అనమాట.. సూర్యుడు శత్రువు ఇంట్లో ఉన్నాడు కాబట్టి ప్రమోషన్ల కోసం అధికారుల వద్దకు వెళ్లటం లాంటివి తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలి. అత్యవసరమై వెళ్లినప్పటికీ అధికారులతో బాగా ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడాలి. రాజకీయ రంగంలో లేదా వ్యవసాయ రంగంలో కూడా నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం ఎంతైనా మంచిది.

హస్తా నక్షత్రం.. ఏయే కార్యాలు చేసే మంచిదంటే? :
తండ్రి వైపు బంధువులతో జాగ్రత్తగా మాట్లాడాలి. పిత్రార్జిత ఆస్తిపాస్తుల వ్యవహారాలు జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలి. అలాగే, హస్తా నక్షత్రానికి అధిపతి అయిన చంద్రుడు.. కన్యారాశి బుధుడు ఇంట్లో అంటే శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి, 12 రాశుల వాళ్ళకి కొద్దిగా మానసిక అశాంతి, ఒత్తిడి వంటి ఏర్పడతాయి. అయినప్పటికీ మనోధైర్యంతో అన్ని సమస్యలను అధిగమించగలుగుతారు. అలాగే, నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు.

హస్తా నక్షత్రం కాబట్టి.. అన్నప్రాసన, నామకరణము, సీమంతము, అక్షరాభ్యాసము, చెవులు కుట్టించుకోవడం వంటి ఇలాంటి కార్యక్రమాలను చేసుకోవచ్చు. అలాగే వ్యవసాయానికి సంబంధించినటువంటి పనులకు హస్తా నక్షత్రం మంచిదైనప్పటికీ కూడా కర్తరి ఉంది. అందుకే కొత్త పనులను అసలు నిర్వహించరాదు. అలాగే రత్నాలు కొనడం, ధరించటం ఇలాంటి వాటికి కూడా హస్తా నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే మంత్ర విద్యలు, గురువుల దగ్గర నేర్చుకోవడానికి కూడా హస్తా నక్షత్రం అద్భుతంగా అనుకూలిస్తుంది.

ఏయే పనులకు హస్త కలిసివస్తుందంటే? :
ఇక, తీర్థయాత్రలకు వెళ్లడానికి చేసే ప్రయత్నాలకు ఈ నక్షత్రం చక్కగా అనుకూలిస్తుంది. విద్యా సంబంధమైనటువంటి కోర్సులు ప్రారంభించడానికి ఎడ్యుకేషన్‌కి సంబంధించిన ప్రత్యేకమైనటువంటి కోర్సుల్లో జాయిన్ అవ్వటానికి హస్తా నక్షత్రం చాలా మంచిది. అలాగే, ప్రభుత్వ సంబంధమైనటువంటి పనులు నిర్వహించుకోవడానికి చేసే ప్రయత్నాలకు కూడా ఈ నక్షత్రం బాగా అనుకూలిస్తుంది. అంటే.. గవర్నమెంట్ ఆఫీసులో ఏవైనా పనులు ఉన్నట్లయితే.. ఆ పనులు పూర్తి చేసుకోవడానికి చేసే ప్రయత్నాలకు హస్తా నక్షత్రం బాగా అనుకూలిస్తుంది.

Mohini Ekadashi 2024 : This Lord Vishnu's Mantras Chant According to 12 Zodiac Signs
Mohini Ekadashi 2024

అదేవిధంగా, అధికార పదవులు పొందడానికి చేసే ప్రయత్నాలకు కూడా హస్తా నక్షత్రం చాలా మంచిది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులు నిర్వహించుకుంటే ఉత్తమ ఫలితాలను తొందరగా ప్రాప్తిస్తాయి అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఈనాటి దినఫలాల్లో ద్వాదశి రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. ముందుగా 12 రాశుల్లో ఏ రాశివారు మోహిని ఏకాదశి 2024 మంత్రాలను ఏది చదివాలి? ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనేది ఒక్కొక్కటిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

రాశిచక్రం ప్రకారం.. మోహిని ఏకాదశి 2024 మంత్రాలను ఇలా పఠించాలి :

మేష రాశి ( హ్రీం శ్రీం శ్రీం లక్ష్మీ నారాయణాయ నమ: ) :
మేష రాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో కూడా విశేషమైనటువంటి గౌరవ మర్యాదలు లభిస్తాయి. అలాగే విశేషమైన ధన లాభం కలుగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అదేవిధంగా ఏ పని ప్రారంభించిన సరే ఆ పనిలో విజయాలను అందిపుచ్చుకోవటానికి ఈ రోజు మేషరాశి వాళ్లకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

వృషభ రాశి (గోపాలాయ ఉత్తరధ్వజాయ నమ: ) :
వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో పూర్తి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. వ్యతిరేక ఫలితాలు అన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే జీవితంలో అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి. విశేషమైనటువంటి భోగభాగ్యాలు కలిగే యోగం వృషభ రాశి వాళ్ళకు ఉంది.

మిధున రాశి (క్లీం కృష్ణాయ నమః ) :
మిధున రాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలోనూ గౌరవ మర్యాదలు ఎక్కువగా పొందే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే, విశేషమైన ధనలాభం కలుగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వృధా ఖర్చులు తగ్గించుకోవడానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. అదేవిధంగా, ఏ పని ప్రారంభించిన మిధున రాశి వాళ్ళు ఆ పని దిగ్విజయంగా పూర్తి చేసుకోగలరు.

కర్కాటక రాశి ( హ్రీం హిరణ్యగర్భాయ అవ్యక్తరూపిణే నమ: ) :
కర్కాటక రాశి వాళ్ళకి ఈ రోజు దొంగల భయం కనిపిస్తుంది. విలువైన వస్తువులు, ఆభరణాల భద్రత పట్ల కొంచెం అప్రమత్తంగా ఉండాలి. కొన్ని వ్యవహారాల్లో మానసికంగా వేదన, బాధ ఉంటాయి. మనోధైర్యంతో వాటిని అధికమించే ప్రయత్నం చేయాలి.

సింహరాశి ( క్లీం బ్రాహ్మణే జగదాధారాయ నమ: ) :
సింహ రాశి వాళ్ళకి ఈరోజు మనోవాంఛిత ఫలసిద్ధి కలుగుతుంది. అంటే.. వాళ్ళ మనసులో ఏది కోరుకున్న సరే అది చాలా సులభంగా నెరవేరుతుంది. సింహ రాశి వాళ్ళకి ఈరోజు మంచి అవకాశాలు ఎక్కువగా కలిసి వస్తాయి. అలాగే, ప్రతి విషయంలో కూడా దైవానుగ్రహం వెన్నంటే నడిపిస్తూ ఉంటుంది. ఆ దైవానుగ్రహం వల్ల అనుకున్న పనులు సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు.

కన్యారాశి ( పీం పితాంబరాయ నమ:) :
కన్యా రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా సర్వజనులతో కలహాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. అంటే.. మీరు ఎవరితో మాట్లాడినా సరే వాళ్ళతో గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే దొంగల వల్ల కూడా భయాలు కలిగి సూచనలు ఉన్నాయి. అంటే.. దొంగల భయం ఎక్కువగా ఉంటుంది.. కాబట్టి, వస్తువులు, ఆభరణాల భద్రత పట్ల కన్యారాశి వాళ్లు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన సమయంగా చెప్పవచ్చు.

తులా రాశి (తత్వ నిరంజనాయ తారక రామాయ నమ:) :
తులా రాశి వాళ్ళకి ఈరోజు ధనవ్యయం కనిపిస్తోంది. అంటే.. ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు. ధనాన్ని పొదుపుగా ఉంచుకుని ఖర్చును అదుపులో ఉంచుకోవాలి. అలాగే, దగ్గరి బంధువులు అంటే.. ఆప్త బంధువులకి ఏదో ఒక విధంగా సహాయం చేయాలని చేసే ప్రయత్నాలు తులారాశి వాళ్లకు చాలా చక్కగా అనుకూలిస్తాయి.

వృశ్చిక రాశి (నారాయణాయ సురసింహాయ నమ:) :
వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు అసత్య ప్రవర్తన వల్ల ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి. అంటే.. తరచూ అబద్ధం చెప్పడం వల్ల చాలా వరకు సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ప్రతి విషయం కూడా భయత్మకంగా మారుతుంటుంది. కాబట్టి, సాధ్యమైనంత వరకు అబద్ధం చెప్పకుండా ఉన్నట్లయితే వృశ్చిక రాశి వాళ్లకు అనుకూల ఫలితాలు కనిపిస్తాయి.

ధనుస్సు రాశి (శ్రీం దేవకృష్ణాయ ఊర్ధ్వజాయ నమ:) :
ధనుస్సు రాశి వారికి ఈరోజు వాహన ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నాయి. అందుకే, వాహనాల మీద వెళ్లేటప్పుడు వెల్లుల్లి రెబ్బ దగ్గర పెట్టుకుని మరి ప్రయాణాలు చేయడం చాలా మంచిది. అలాగే, ధన నష్టం కలిగే సూచనలు కూడా ఉన్నాయి. ధనుస్సు రాశి వాళ్ళు ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు ఒకటికి పది సార్లు ఆలోచించి ధనాన్ని ఖర్చు చేయాలి.

మకర రాశి (శ్రీం వత్సలాయ నమ: ) :
మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా పిత్రార్జిత ధనాన్ని వృద్ధి చేయడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. మీకు తండ్రిని తాత నుంచి గాని ఏవైనా ఆస్తిపాస్తులు వచ్చినట్లయితే వాటిని రెట్టింపు చేసుకోవటానికి మీరే ప్రయత్నాలు చేసినా ప్రయత్నాలు అన్ని విజయవంతం అవుతాయి. అలాగే ఏ పని ప్రారంభించినా కూడా మకర రాశి వారికి ఈరోజు ఆ పనిలో కార్యసిద్ధి చాలా సులభంగా లభిస్తుంది.

కుంభరాశి ( శ్రీం ఉపేంద్రాయ అచ్యుతాయ నమ:) :
కుంభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి కలుగుతుంది. మానసికంగా ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోగలుగుతారు.

మీనరాశి ( క్లీం ఉద్ధృతాయ ఉద్ధరిణే నమ:) :
మీన రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా దొంగల భయం కనిపిస్తుంది. విలువైన వస్తువుల భద్రత పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సాంఘికంగా గౌరవ మర్యాదలు సన్నగిల్లే సూచనలు ఉన్నాయి. మీ కీర్తి ప్రతిష్టలకు గౌరవ మర్యాదలకు భంగం కలిగింపజేసే వ్యక్తుల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.

మోహిని ఏకాదశి విశిష్టత :

12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావడానికి ఈరోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అదే మోహిని ఏకాదశి.. అన్నవరం సత్యదేవుని కళ్యాణం మోహిని ఏకాదశి అంటే.. శ్రీమహావిష్ణువు మోహిని దాల్చిన రోజుగా చెబుతారు. ఈ మోహిని ఏకాదశి సందర్భంగా విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే చాలా మంచిది. అయితే, 12 రాశుల వాళ్ళు విష్ణు సహస్రనామం మొత్తం చదువుకోలేకపోయిన ఈరోజు రెండు ప్రత్యేకమైన మంత్రాలు చదువుకుంటే మీకు తిరుగు ఉండదు. వృత్తిలో గాని ఉద్యోగంలో గాని వ్యాపారంలో గాని ఏ పనులు అయినా సరే ఆ రెండు మంత్రాలు ఒక్కొక్క మంత్రం 11 సార్లు చెప్పినా అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు. వెంటనే కార్యసిద్ధి లభిస్తుంది. ‘‘ఓం నమో భగవతే విష్ణవే.. ‘‘హ్రీం విష్ణువే నమః‘‘.. ఈ రెండు మంత్రాలు మోహిని ఏకాదశి సందర్భంగా పఠిస్తే.. ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే అన్నవరం సత్యనారాయణ స్వామి వారి కళ్యాణం ఉత్సవం సందర్భంగా సత్యనారాయణ స్వామిని మనసులో స్మరించుకుని వెళ్లినా కూడా విశేషమైనటువంటి కార్యజేయం కలుగుతుంది.

రవిహోర సమయం.. ఏయే పనులకు మంచిదంటే? :
ఈరోజు ఆదివారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో.. రాత్రి 8 నుంచి 9 మధ్యలో రవిహోర ఉంటుంది. ముఖ్యమైనటువంటి రాజకీయ వ్యవహారాలు నిర్వహించుకోవచ్చు. దస్తావేజులు రాసుకోవచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవచ్చు. అప్లికేషన్లు రాసేందుకు రవిహోర చాలా మంచిది. అలాగే, రాజకీయ నేతలను కలుసుకోవడానికి, వైద్యులను కలుసుకోవటానికి రవిహోర మంచిది. అదేవిధంగా, కొత్త కొత్త వ్యవహారాలు చట్టసంబంధమైనటువంటి వ్యవహారాలు ఏవి నిర్వహించడానికైనా రవిహోర విశేషంగా అనుకూలిస్తుంది. హోర కాలాన్ని బట్టి ఈ పనులు నిర్వహించుకుంటే ఉత్తమమైన ఫలితాలను పొందవచ్చు.

Read Also : Devotional Stories : పాపాత్ములే సంతోషంగా ఎందుకు ఉంటారు? పార్వతి దేవి అడిగిన ప్రశ్నకు పరమేశ్వరుడు చెప్పిన రహాస్యం తెలిస్తే షాకవుతారు..!