5 Facts About Anna Lezhneva : నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA)లో భాగమైన నటుడు, రాజకీయ నేత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ (JSP) ఇటీవల ముగిసిన లోక్‌సభ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో భారీ మెజార్టీతో విజయం సాధించింది. జనసేనకు 21 మంది శాసనసభ్యులు ఉన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో టాలీవుడ్ పవర్ స్టార్ పార్టీ ఫ్లోర్ లీడర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఈ ముఖ్యమైన విజయాన్ని పురస్కరించుకుని ఇంటికి తిరిగి వచ్చిన పవన్‌కు ఆయన సతీమణి అన్నా లెజ్నెవా సాదర స్వాగతంతో పలికారు. లెజ్నెవా పవన్ కల్యాణ్‌కు హారతి ఇచ్చి ఆయన నుదిటిపై తిలకాన్ని దిద్దారు. పక్కనే అకిర నందన్ కూడా నిలబడి ఉన్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
5 Facts About Anna Lezhneva : అన్నా లెజ్నెవా ఎవరు? :
1. అన్నా లెజ్నెవా 1980లో రష్యాలో జన్మించారు. ఆమె మోడల్-నటి. 2011లో తీన్ మార్ మూవీ సమయంలో పవన్ కళ్యాణ్‌ను కలిశారు. అప్పుడే వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆన్-సెట్ రొమాన్స్ రిలేషన్‌షిప్‌గా మారింది. రెండు సంవత్సరాల డేటింగ్ తర్వాత సెప్టెంబర్ 30 2013న వివాహం చేసుకున్నారు. పవన్ కళ్యాణ్‌కు లెజ్నెవా మూడవ భార్య.
2. ఈ పవన్, లెజ్నెవా దంపతులకు మార్క్ శంకర్ పవనోవిచ్ అనే కుమారుడు ఉన్నాడు. లెజ్నేవాకు తన మొదటి వివాహం తర్వాత పోలేనా అంజనా పవనోవా అనే కుమార్తె కూడా ఉంది.
3. మోడలింగ్ కెరీర్ మాత్రమే కాకుండా లెజ్నేవా సింగపూర్‌లో హోటల్స్ కలిగి ఉన్నారని పుకారు ఉంది. రష్యా, సింగపూర్ రెండింటిలో ఆస్తులతో సహా దాదాపు రూ. 1800 కోట్ల విలువైన ఆస్తులను కలిగి ఉన్నట్లు సమాచారం.

4. పవర్ స్టార్ పవన్ వైవాహిక చరిత్ర దృష్ట్యా.. కళ్యాణ్‌తో లెజ్నేవా రిలేషన్ కారణంగా అనేక సవాళ్లను ఎదుర్కొంది. గతంలో 19 ఏళ్ల నందినిని 1997లో పవన్ వివాహం చేసుకున్నారు. ఆ వివాహం 2008లో విడాకులతో ముగిసింది. ఆ తర్వాత సినీనటి రేణు దేశాయ్‌ని 2009లో వివాహం చేసుకున్నారు. 2012లో విడిపోయే ముందు వారికి అకిరా నందన్, ఆధ్య అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.
పవన్‌కు హారతి ఇచ్చి స్వాగతం పలుకుతున్న అన్నా లెజ్నెవా :
Celebrating the success with Family 💐#Pawankalyan #Akiranandan pic.twitter.com/qPh0lxFpd6
— Suresh PRO (@SureshPRO_) June 4, 2024
5. నివేదికల ప్రకారం.. మెగా హీరో వరుణ్ తేజ్ నిశ్చితార్థం, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కుమార్తెల ఊయల వేడుక వంటి ముఖ్యమైన కుటుంబ శుభకార్యక్రమాల్లో చాలాసార్లు లెజ్నెవా కనిపించలేదు. దాంతో అన్నా లెజ్నెవా, పవన్ విడిపోతున్నారనే ప్రచారం జరిగింది.
వైవాహికపరంగా పుకార్లు ఉన్నప్పటికీ.. లెజ్నెవా తన భర్త పవన్ ప్రజా జీవితంలో చురుకుగా పాల్గొంటుంది. పవన్ ఇటీవలి ఎన్నికల విజయం సందర్భంగా ఆమె హాజరై మద్దతుగా నిలిచారు. సంప్రదాయ ఆచారాలను నిర్వహించి అభిమానులను పలకరిస్తూ విడిపోతున్నారనే వార్తలకు చెక్ పెట్టారు.
