Apple iPhone 15 Plus Sale : కొత్త ఆపిల్ ఐఫోన్ కోసం చూస్తున్నారా? అయితే, ఇదే సరైన టైమ్. విజయ్ సేల్స్‌లో ఆపిల్ డే సేల్ అందుబాటులో ఉంది. ఈ కొత్త సేల్ జూన్ 17 వరకు కొనసాగుతుంది. ఆపిల్ ప్రొడక్టులపై ఐఫోన్లు, మ్యాక్‌బుక్, ఐప్యాడ్ వరకు అనేక ఆఫర్‌లు అందుబాటులో ఉన్నాయి.
విజయ్ సేల్స్‌పై ఐఫోన్ 15 ప్లస్ డీల్ విషయానికి వస్తే.. మీకు అర్హత ఉన్న కార్డు ఉంటే.. మీ ఐఫోన్ 15పై రూ. 75వేల లోపు కొనుగోలు చేయవచ్చు. ఈ ఐఫోన్ ధరను మరింత తగ్గించడానికి మీ పాత ఐఫోన్ కొత్తదానికి ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు.
ఐఫోన్ 15 డీల్ ఎలా వర్క్ చేస్తుందంటే? :
ఆపిల్ ఐఫోన్ 15 ప్లస్ అసలు ధర రూ. 80వేలు ఉండగా ఐసీఐసీఐ కార్డ్ ఉంటే.. రూ. 74,000కి కొనుగోలు చేయవచ్చు, మీ బ్యాంక్ నేరుగా రూ. 6000 తగ్గింపును అందిస్తోంది. అదేవిధంగా, మీకు ఎస్‌బీఐ కార్డ్ ఉంటే.. మీరు ఐఫోన్‌పై రూ. 6000 తగ్గింపును పొందవచ్చు. మీ వద్ద పాత ఐఫోన్ ఉంటే.. మీరు మీ ఫోన్ IMEI నంబర్‌ను ఎంటర్ చేసి మీ పాత ఫోన్ వాల్యూను చెక్ చేయవచ్చు.
Apple iPhone 15 Plus Sale : ఐఫోన్ 15 ప్లస్ స్పెసిఫికేషన్‌లు
ఆపిల్ ఐఫోన్ 15 మోడల్ ప్రోమోషన్‌తో కూడిన 6.7-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లే, సరికొత్త A16 బయోనిక్ చిప్, కొత్త 48MP ప్రధాన సెన్సార్‌తో కూడిన ట్రిపుల్-లెన్స్ బ్యాక్ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంది.
ఐఫోన్ 15 ప్లస్ డిస్‌ప్లే అత్యధికంగా అమ్ముడైన పాయింట్‌లలో ఒకటి. ప్రోమోషన్ టెక్నాలజీతో కూడిన పెద్ద, హై-రిజల్యూషన్ డిస్‌ప్లేతో వస్తుంది. 120Hz వరకు రిఫ్రెష్ చేయగలదు. A16 బయోనిక్ చిప్ కూడా మార్కెట్‌లోని అత్యంత శక్తివంతమైన మొబైల్ చిప్‌లలో ఒకటి. మీరు ఐఫోన్ 15 ప్లస్ అత్యంత డిమాండ్ ఉన్న టాస్క్‌లతో కూడా పనిచేస్తుందని ఆశించవచ్చు.

ఆపిల్ ఐఫోన్ 15 ప్లస్ కెమెరా సిస్టమ్ గత మోడల్ కన్నా భారీ అప్‌గ్రేడ్‌తో వస్తుంది. ఈ కొత్త 48MP ప్రధాన సెన్సార్ తక్కువ కాంతిలో కూడా అద్భుతమైన ఫోటోలు, వీడియోలను క్యాప్చర్ చేయగలదు. అల్ట్రా వైడ్ కెమెరా, టెలిఫోటో కెమెరా కూడా అప్‌గ్రేడ్ అవుతుంది. మీరు వైడ్ రేంజ్ షాట్‌లను సులభంగా తీయవచ్చు.
ఆపిల్ ఐఫోన్ 15 ప్లస్ ఇతర ముఖ్యమైన ఫీచర్లలో లాంగ్ లైఫ్ ఉండే బ్యాటరీ, కొత్త అండర్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, యూఎస్‌బీ-సి పోర్ట్ ఉన్నాయి. మొత్తంమీద, ఆపిల్ ఐఫోన్ 15 ప్లస్ గత మోడల్‌తో పోలిస్తే గణనీయమైన అప్‌గ్రేడ్, పవర్ యూజర్‌లను, సాధారణ వినియోగదారులను ఆకట్టుకునేలా ఉంది.
ఇది సేల్స్ సీజన్ కాకపోవచ్చు. కానీ, విజయ్ సేల్స్ భారీ తగ్గింపులను అందిస్తోంది. పూర్తి రిటైల్ ధరను చెల్లించకుండానే కొన్ని అద్భుతమైన ప్రొడక్టులను కొనుగోలు చేసే అవకాశాన్ని అందిస్తుంది. మీరు ప్రీమియం ఐఫోన్ కోసం మార్కెట్‌లో డీప్ డిస్కౌంట్‌ల కోసం చూస్తున్నట్లయితే ఆపిల్ డేస్ సేల్ విజయ్ సేల్స్‌లో కొనుగోలు చేయొచ్చు. ఐప్యాడ్‌లు, మ్యాక్‌బుక్ ఎయిర్స్, మ్యాక్‌బుక్ ప్రోస్ మరిన్నింటితో సహా అనేక ఇతర ఆపిల్ ప్రొడక్టులు కూడా సేల్స్ సమయంలో అందుబాటులో ఉన్నాయి. ఈ డీల్స్ యూజర్లను ఆకర్షించేలా ఉంటాయి.
ఐఫోన్ 15 ప్లస్ ధర తగ్గింపు.. :
విజయ్ సేల్స్‌లో భాగంగా బ్లాక్ కలర్ వేరియంట్‌పై ఐఫోన్ 15 ప్లస్ తగ్గింపును ప్రకటించింది. అదే సమయంలో మీకు బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లలో ఒకదాన్ని అందిస్తుంది. ముందుగా, ఐఫోన్ 15 ప్లస్ ధరను రూ. 89,900 నుంచి 11 శాతం ప్రారంభ తగ్గింపు అందిస్తోంది. దాంతో మీకు రూ. 9,610 ఆదా అవుతుంది. అంతే కాదు. అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కార్డ్ రూ. 7500 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందిస్తుంది. HDFC బ్యాంక్, యెస్ బ్యాంక్, ఇతర బ్యాంకుల్లో కూడా ఆఫర్‌లు ఉన్నాయి.
ముందుగా వెబ్‌సైట్‌కి వెళ్లి మీ పిన్ కోడ్‌ని ఎంటర్ ద్వారా మీ ప్రాంతంలో ఆఫర్ అందుబాటులో ఉందో లేదో చెక్ చేయండి. మీరు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా చెక్ చేయవచ్చు. మీ ప్రస్తుత స్మార్ట్‌ఫోన్‌కు కంపెనీ ఎంత వాల్యూ ఇస్తుందో చూడాలి. అన్ని కలిపి ఈ ఐఫోన్ 15 ప్లస్ ధర తగ్గింపు (బ్యాంక్ ఆఫర్‌లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు, ప్రారంభ తగ్గింపుతో సహా) విలువైనదేనా లేదా వెల్లడిస్తుంది. ఐఫోన్ 15 ప్లస్‌లో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్‌లలో ఇదొకటి. ఇంటర్నల్ లిథియం-అయాన్ బ్యాటరీని కలిగి ఉంది. 20W అడాప్టర్‌తో సుమారు 30 నిమిషాల్లో 50శాతం వరకు ఛార్జ్ చేయగలదని ఆపిల్ చెబుతోంది.
Read Also : Tech Tips in Telugu : మీ పేరుతో ఎన్ని సిమ్ కార్డులు యాక్టివ్‌గా ఉన్నాయో తెలుసా? తప్పక తెలుసుకోండి