Hdfc Bank Offers : 2024 పండుగ సీజన్‌లో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త. బ్యాంక్ పాపులర్ క్రెడిట్ కార్డ్‌లలో కొన్నింటిపై వార్షిక రుసుము లేదా ఇతర ఛార్జీలను ఎత్తివేసింది. మీరు క్రెడిట్ కార్డు కోసం వార్షిక ఛార్జీని చెల్లించాల్సిన అవసరం లేదు.
నివేదిక ప్రకారం.. ఈ ఆఫర్ డిసెంబర్ 31 వరకు (Swiggy HDFC) బ్యాంక్ క్రెడిట్ కార్డ్, (Tata Neu Plus HDFC) బ్యాంక్ క్రెడిట్ కార్డ్, (HDFC) బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌కి చెల్లుబాటు అవుతుంది. అంతకుముందు, కస్టమర్‌లు ఫ్రీడమ్ క్రెడిట్ కార్డ్, బిజ్‌ఫస్ట్ క్రెడిట్ కార్డ్ కోసం వార్షిక రుసుము లేకుండా అక్టోబర్ 31 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
పాపులర్ క్రెడిట్ కార్డ్‌ల వార్షిక రుసుములు :
టాటా న్యూ ప్లస్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వార్షిక రుసుము రూ. 499 కాగా, టాటా న్యూ ఇన్ఫినిటీ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వార్షిక రుసుము రూ. 1,499, స్విగ్గీ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కోసం వార్షిక రుసుము రూ. 500 వరకు చెల్లించాల్సి ఉంటుంది.
Hdfc Bank Offers : క్రెడిట్ కార్డు వార్షిక ఛార్జీలు ఏంటి? :
క్రెడిట్ కార్డ్ సదుపాయాన్ని అందించే దాదాపు అన్ని బ్యాంకుల్లో మీరు జాయినింగ్ ఫీజు, వార్షిక ఛార్జీలు చెల్లించవలసి ఉంటుంది. వార్షిక రుసుములు మీ కార్డ్‌కి ప్రతి సంవత్సరం వర్తించే అత్యంత సాధారణ కార్డ్ ఛార్జీలు. మీరు జాయినింగ్ ఫీజును ఒక్కసారి మాత్రమే చెల్లించాలి. అయితే, వార్షిక ఛార్జీని ప్రతి సంవత్సరం చెల్లించాలి.
బ్యాంకులను బట్టి వార్షిక ఛార్జీలు మారుతూ ఉంటాయి. అయితే, కొన్ని బ్యాంకులు దీన్ని వసూలు చేయడం లేదు. అదే సమయంలో, మీరు ప్రతి సంవత్సరం ఇంత మొత్తంలో కొనుగోళ్లు చేస్తే.. మీకు వార్షిక ఛార్జీలో రాయితీ ఇస్తామని కొన్ని బ్యాంకులు కస్టమర్లకు షరతులు విధించాయి.
Read Also : Diwali 2024 : దీపావళి రోజున లక్ష్మీ దేవి అనుగ్రహం పొందాలంటే మీ ఇంట్లో ఈ 3 వస్తువులను పారేయండి!