Sharing Same Soap : ప్రతి ఇంట్లో ప్రతిఒక్కరూ ఒకే సబ్బును ఎక్కువగా వినియోగిస్తుంటారు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ ఒకే సబ్బును వాడేస్తుంటారు. ఇలా వాడటం ఆరోగ్యానికి మంచిదేనా? ఒకవేళ కుటుంబమంతా ఒకే సబ్బును పలుమార్లు స్నానానికి వాడటం ద్వారా ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి? అనేది అవగాహన ఉండదు. ఏముందిలే అని సబ్బును అందరూ వాడుతుంటారు. వాస్తవానికి ఫ్యామిలీలో ఎవరికైనా ఏదైనా అనారోగ్య సమస్యలు, చర్మ సంబంధిత వ్యాధులు (Sharing same soap side effects) ఉంటే అలాంటి సమయాల్లో ఒకరి సబ్బును మరొకరు వాడొచ్చా? అనే సందేహం రావొచ్చు. ఎందుకంటే.. ఇలాంటి పరిస్థితుల్లో ఒకరి చర్మ సమస్యలు మరొకరికి వ్యాపించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మామూలు సబ్బులో 62శాతం.. లిక్విడ్ సబ్బుల్లో 3 శాతం :
సాధారణంగా చెప్పాలంటే.. ఇంట్లో ఒకే సబ్బును అందరూ వాడుకోవచ్చు. కానీ, ఆ సబ్బుపై కంటికి కనిపించని సూక్ష్మక్రిములు ఉండవచ్చు. ఇండియన్ జర్నల్ ఆఫ్ డెంటల్ రీసెర్చ్‌లో ఏప్రిల్-జూన్ 2006లో జరిపిన ఒక అధ్యయనంలో సబ్బులో రెండు నుంచి ఐదు రకాల సూక్ష్మక్రిములు (Sharing Same Soap) ఉన్నాయని కనుగొన్నారు. ఇంకా, అమెరికన్ జర్నల్ ఆఫ్ ఇన్ఫెక్షన్ కంట్రోల్‌లో జూలై 2015 అధ్యయనంలో కూడా హాస్పిటల్ ఆవరణలో చేసిన ఒక అధ్యయనంలో దాదాపు 62 శాతం సబ్బులు కలుషితమయ్యాయని గుర్తించారు. ఇక లిక్విడ్ సబ్బుల్లో కేవలం 3 శాతం మాత్రమే ఉన్నాయని సూక్ష్మజీవులు ఉన్నాయని కనుగొన్నారు. సబ్బుపై దాగి ఉన్న బ్యాక్టీరియా అనేది ఒకరి నుంచి మరికొరికి సులభంగా వ్యాప్తి చెందుతుంది.
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. సబ్బుపై దాగిన బ్యాక్టిరీయాలో ఇ.కోలి, సాల్మొనెల్లా, షిగెల్లా బ్యాక్టీరియా, నోరోవైరస్, రోటవైరస్, స్టాఫ్ వంటి వైరస్‌లు కూడా ఉండే అవకాశం ఉంది. ఈ బ్యాక్టీరియా, వైరస్ ఒకే సబ్బును ఎక్కువ మంది వాడినప్పుడు ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి సోకుతాయి. కుటుంబంలో ఎవరికైనా కొన్ని చర్మంపై గాయాలు లేదా గీతలు పడటం ద్వారా తొందరగా వ్యాప్తి చెందుతాయి. మరికొన్ని టాయిలెట్‌లో విసర్జించే మలం నుంచి వ్యాపిస్తాయి.
సబ్బుపై ఉండే బ్యాక్టీరియా జాతులివే :
బ్యాక్టీరియా, సూక్ష్మజీవులు ఉనికికి అవకాశం ఉన్న తర్వాత కూడా సబ్బు సాధారణంగా వ్యాధిని ప్రసారం చేయదని పరిశోధకులు కనుగొన్నారు. 1965లో ప్రచురించిన ఒక ప్రధాన అధ్యయనంలో శాస్త్రవేత్తలు ఉద్దేశపూర్వకంగా తమ చేతులను ఐదు బిలియన్ల బ్యాక్టీరియాతో కలుషితం చేసే ప్రయోగాలను నిర్వహించారని ఓ నివేదిక వెల్లడించింది. బ్యాక్టీరియా అనేది స్టాఫ్, ఇ.కోలి వంటి వ్యాధిని కలిగించే జాతులుగా పేర్కొన్నారు. శాస్త్రవేత్తలు తమ చేతులను సబ్బుతో కడుక్కోవడంతో పాటు రెండో వ్యక్తిని (Sharing Same Soap) అదే సబ్బుతో కడుక్కోవాలని సూచించారు. అప్పుడు రెండో వ్యక్తి వాడిన అదే సబ్బు నుంచి బ్యాక్టీరియా ఇతరులకు వ్యాపించలేదని కనుగొన్నారు. బాక్టీరియా స్థాయిలు సబ్బుపై ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సబ్బును తీవ్రమైన వినియోగ పరిస్థితుల్లో కూడా పేలవంగా రూపొందించిన నాన్-డ్రెయిన్బుల్ సబ్బు మొదలైనవి వాటి కారణంగా అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అంటున్నారు.
Sharing Same Soap : సబ్బుతో వ్యాపించే ఇన్ఫెక్షన్ ఇదే :
సబ్బు బార్‌ను ఒకరినొకరు షేర్ చేసుకోవడం అనేది చాలావరకు సురక్షితమైనది అయితే, అదే సబ్బును షేర్ చేయడం ద్వారా సంక్రమించే ఒక ఇన్‌ఫెక్షన్ ఉంది. యూనివర్శిటీ ఆఫ్ ఫ్లోరిడా ఫుట్‌బాల్ ఆటగాళ్లపై 2008లో జరిపిన ఒక అధ్యయనంలో ఈ విషయం బయపడింది. సబ్బును షేర్ చేసే వారికి యాంటీబయాటిక్-రెసిస్టెంట్ స్టాఫ్ ఇన్ఫెక్షన్ అనే మెథిసిలిన్-రెసిస్టెంట్ స్టెఫిలోకాకస్ ఆరియస్ (MRSA) పునరావృత అంటువ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని తేలింది. ఈ ఇన్ఫెక్షన్ కారణంగా, అమెరికా, సీడీసీ సబ్బు వంటి వ్యక్తిగత వస్తువులను షేర్ చేసుకోవద్దని కూడా సిఫార్సు చేస్తోంది.

ఒక్క మాటలో చెప్పాలంటే.. ఒకే సబ్బును ఇంట్లో వారందరూ వాడటం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు. అయినప్పటికీ, (MRSA) ఇన్ఫెక్షన్ వ్యాప్తికి సంబంధించిన పరిశోధన ఒక్కటే ఆందోళన కలిగిస్తోంది. మీరు సబ్బును మరొకరితో షేర్ చేయకూడదని భావించినా లేదా బ్యాక్టీరియా వృద్ధి చెందే అవకాశం ఉందని ఉపయోగించకూడదనుకుంటే, మీరు లిక్విడ్ సోప్ లేదా బాడీ వాష్‌కి మారవచ్చు. అంతేకాదు.. జీరో-టచ్ డిస్పెన్సర్‌ను కూడా ఎంచుకోవచ్చు. మీరు ఒక సబ్బును ఉపయోగించినట్లయితే లేదా వెంటనే కుటుంబ సభ్యులతో షేర్ చేసినట్టుయితే మీ శరీరంపై ఉపయోగించే ముందు సబ్బును నీటితో పరిశుభ్రంగా కడగడం మంచిది.
సబ్బును మరొకరు వాడే ముందు ఏం చేయాలి? :
అలా చేస్తే ఒకరు వాడిన తర్వాత సబ్బుపై పేరుకుపోయిన ఏదైనా సూక్ష్మజీవులు లేదా బ్యాక్టీరియా వంటివి ఉంటే.. వెళ్లిపోతాయి. మీరు ఒకరి సబ్బును ఉపయోగిస్తున్నప్పుడు బాగా నురుగుగా ఉండేలా చూసుకోండి. ఒకసారి కడిగిన తర్వాత సబ్బును కాసేపు ఆరబెట్టండి. ఎందుకంటే.. వ్యాధికారక క్రిములు ఏమైనా ఉంటే అవి చనిపోతాయి. చర్మ కణాలతో తడిసిని సబ్బుపై బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంది. డ్రైనింగ్ సోప్ డిష్‌ని ఉపయోగించడం, దానిని క్రమం తప్పకుండా కడిగి శుభ్రం చేస్తుండాలి. చివరగా, సబ్బును ఒకరినొకరు ఉపయోగించకుండా ఉండటమే చాలా మంచిది. ఎందుకంటే.. సబ్బు ద్వారా మీ శరీరాన్ని అనేక వైరస్‌లు, బ్యాక్టీరియా తీసుకువెళ్లే సంభావ్య ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది.
స్నానం చేయడానికి లేదా చేతులు కడుక్కోవడానికి ఒకే సబ్బును అందరూ వాడటం వల్ల కూడా క్రిములు వ్యాపించే అవకాశాలు పెరుగుతాయి. సబ్బుపై ఉండే అంటుకునే పొర బ్యాక్టీరియా పెరుగుదలకు సంభావ్య వాతావరణం కావచ్చు. సబ్బును ఇతరులు కూడా వాడటం ద్వారా బ్యాక్టీరియా, సూక్ష్మజీవులు ఒక వ్యక్తి తగుసీ మరొకరికి వ్యాపిస్తాయి. అయితే, ఉపయోగించే ముందు సబ్బును బాగా కడగడం వల్ల వ్యాప్తిని నిరోధించవచ్చునని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
లిక్విడ్ సబ్బు, సాధారణ సబ్బు.. ఏది మంచిదంటే? :
ఒక కుటుంబంలో అందరూ ఒకే సబ్బును వాడుతారు. అందులో ఎక్కువగా సాధారణ సబ్బు బార్ వాడుతుంటారు. కొంతమంది మాత్రమే లిక్విడ్ సబ్బును వాడతారు. అయితే, లిక్విడ్ సబ్బు లేదా సాధారణ సబ్బు బార్ ఈ రెండింటిలో ఏది మంచిది? లిక్విడ్ సబ్బు మంచి ప్రత్యామ్నాయమా? అంటే.. లిక్విడ్ సబ్బునే మంచిదని చెప్పవచ్చు. ఎందుకంటే.. లిక్విడ్ సోప్ అనేది బాటిల్ నుంచి బయటకు పంపాల్సిన అవసరం ఉన్నందున బ్యాక్టీరియా పేరుకుపోవడం లేదా ఇన్‌ఫెక్షన్ వచ్చే అవకాశం లేదు. డిస్పెన్సర్‌లు టచ్-ఫ్రీ, మోషన్-యాక్టివేట్ కూడా కావచ్చు. అందుకే లిక్విడ్ సబ్బు వాడకమే చాలా మంచిది కూడా. కానీ, వాడే ముందు సబ్బు బార్ కడిగి ఆ తర్వాత ఆరబెట్టుకుని స్నానానికి వాడితే ఎలాంటి సమస్యా ఉండదు.
ఇలా చేస్తే బ్యాక్టీరియా మరొకరికి వ్యాపించదు :
ఒకే సబ్బును ఉపయోగించే వ్యక్తుల మధ్య బ్యాక్టీరియా వ్యాపిస్తుందో లేదో పరీక్షించడానికి 1965లో ఒక అధ్యయనాన్ని నిర్వహించారు. ఈ అధ్యయనం కోసం ప్రత్యేకించి పరిశోధకులు ఉద్దేశపూర్వకంగా తమ చేతులను దాదాపు ఐదు బిలియన్ల బ్యాక్టీరియాతో కలుషితం చేశారు. ఇందులో స్టాఫ్, ఇ. కోలి వంటి వ్యాధి కలిగించే వైరస్ జాతులు ఉన్నాయి. తమ చేతులను సబ్బుతో కడుక్కొని, మరొక వ్యక్తిని చేతులు శుభ్రంగా కడుక్కుని ఉపయోగించమని సూచించారు. అప్పుడు ఆ బ్యాక్టీరియా అనేది ఒకరి నుంచి మరికరికి వ్యాపించలేదని గుర్తించినట్టు పేర్కొన్నారు.
కుటుంబ సభ్యులతో ఒకే సబ్బు వాడటం అనేది నిజంగా అనారోగ్యం కాదు. కానీ, చర్మ నిపుణుల ప్రకారం.. అలా చేయడం మంచి పద్ధతి కాదని హెచ్చరిస్తున్నారు. ప్రత్యేకించి ఎవరికైనా అంటువ్యాధి సోకినట్లయితే.. చాలా చర్మ వ్యాధులు ఒకే సబ్బు వాడకం ద్వారానే వ్యాప్తిచెందుతాయని తెలిపారు. తద్వారా అనేక చర్మ వ్యాధులకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. చాలా సందర్భాలలో ఈ అంటువ్యాధులు సబ్బు ద్వారా సంక్రమించి నయం అయినప్పటికీ కొన్నిసార్లు ఈ అంటువ్యాధులు హానికరమైనవిగా మారవచ్చు.