Best Days to Buy Gold : 2024లో బంగారం కొనేందుకు చూస్తున్నారా? ఏ రోజు బంగారం కొంటే మంచిదో తెలుసా? అసలు ఏయే రోజుల్లో బంగారాన్ని కొనుగోలు చేయాలి? ఏయే వారాల్లో బంగారం కొనుగోలు చేస్తే కలిసివస్తోందో తెలుసుకోవాలని చాలామందికి ఆసక్తిగా ఉంటుంది. ముఖ్యంగా పెళ్లిరోజులు లేదా ఏదైనా ఫంక్షన్లు, పండుగ రోజుల్లో బంగారం కొనేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. బంగారం కొనుగోలుకు మంచి రోజులేంటి? అనేది చాలామందికి అవగాహన లేక ఇలాంటి అనేక సందేహాలు మనసులో మెదులుతుంటాయి.
ఎన్నో శతాబ్దాలుగా బంగారం కేవలం ఆభరణాలకు మాత్రమే కాదు.. గృహ పెట్టుబడిగా, ఆర్థిక భద్రతకు ప్రధాన మార్గమని చెబుతుంటారు. సాధారణంగా పెట్టుబడిదారులను గోల్డ్ పోర్ట్‌ఫోలియోలను మాత్రమే కలిగి ఉండకుండా తమ రాబడి రిస్క్‌ను తగ్గించుకోవడానికి బంగారంపై పెట్టుబడి పెట్టాలని నిపుణులు సూచిస్తుంటారు. బంగారం ఎల్లప్పుడూ అధిక రాబడిని అందించకపోవడమే దీనికి కారణంగా చెప్పవచ్చు. మీరు బంగారంలో పెట్టుబడి పెట్టడానికి అనేక మార్గాలు ఉన్నాయి.
భారతదేశంలో, బంగారం ఆర్థిక విలువకు మాత్రమే కాకుండా సాంస్కృతిక ప్రాముఖ్యతకు చాలా విలువైనదిగా పేరుగాంచింది. సంపద, అదృష్టం, శ్రేయస్సుకు సంబంధించినది. భారతీయులలో బంగారంపై లోతుగా విశ్వాసం పాతుకుపోయింది. ప్రత్యేకించి శుభ దినాలలో బంగారం కొనుగోలు చేస్తే అదృష్టాన్ని తీసుకువస్తుందని గట్టిగా విశ్వసిస్తారు. భారత్ ఒక బహుళ సాంస్కృతిక దేశం.. వివిధ కమ్యూనిటీలు, రాష్ట్రాల ప్రజలు బంగారాన్ని కొనుగోలు చేయడానికి వివిధ రోజులను మంచివిగా భావిస్తారు. దేశంలో పసిడి లోహాన్ని ఒక ఆస్తిగా పరిగణిస్తారు. నగల తయారీ లోహాలలో ఎక్కువగా ఉపయోగించేది బంగారం ఒకటి. 2024లో బంగారం కొనడానికి అత్యంత అనువైన రోజుల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
2024లో బంగారం కొనడానికి మంచి రోజులివే :
- మకర సంక్రాంతి : 15 జనవరి 2024
- పుష్య నక్షత్రం : 21 ఫిబ్రవరి 2024
- పుష్య నక్షత్రం : 19 మార్చి 2024
- ఉగాది – గుడి పడ్వా : 9 ఏప్రిల్ 2024
- పుష్య నక్షత్రం : 16 ఏప్రిల్ 2024
- అక్షయ తృతీయ : 10 మే 2024
- పుష్య నక్షత్రం : 13 మే 2024
- పుష్య నక్షత్రం : 9 జూన్ 2024
- పుష్య నక్షత్రం : 7 జూలై 2024
- పుష్య నక్షత్రం : 3 ఆగస్టు 2024
- పుష్య నక్షత్రం : 26 సెప్టెంబర్ 2024
- నవరాత్రులు : 3 అక్టోబర్ నుంచి 11 అక్టోబర్ 2024 వరకు
- దసరా : : 12 అక్టోబర్ 2024
- ధంతేరాస్/దీపావళి : : 29 అక్టోబర్ 2024 నుంచి 1 నవంబర్ 2024
- బలిప్రతిపాద : 2 నవంబర్ 2024
మకర సంక్రాంతి :
ప్రతి ఏడాది ప్రారంభంలో జనవరి మాసంలో మకర సంక్రాంతి వస్తుంటుంది. ఎక్కువగా ఒకే తేదీల్లో ఈ పండుగను జరుపుకుంటారు. భారతదేశంలో బంగారాన్ని కొనుగోలు చేయడానికి మకర సంక్రాంతి రోజున ప్రధాన ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఈ పండుగ సూర్యుడు మకర రాశిలోకి మారడాన్ని సూచిస్తుంది. అందుకే మకర సంక్రాంతి అని పేరు వచ్చింది. శీతాకాలం ముగింపునకు చేరుకుంటుంది.
అక్కడి నుంచి వేసవి కాలం మొదలవుతుంది. ఎండలు మొదలయ్యే రోజును సూచిస్తుంది. ఈ రోజున, బంగారం కొనుగోలు చేయడం వల్ల అదృష్టంతో పాటు శ్రేయస్సు కలుగుతుందని నమ్ముతారు. సూర్యుని కదలిక సానుకూలతను పెంచుతుందని అంటారు. బంగారం కొనుగోలుకు ఈ మకర సంక్రాంతి అనుకూలమైనదిగా భావిస్తారు.
పుష్య నక్షత్రం :
పుష్యమి, పూయం లేదా పూసం అని కూడా పిలిచే పుష్య నక్షత్రం.. హిందూ సంస్కృతిలో ఒక ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంది. అమావాస్య లేదా పౌర్ణమి తర్వాత ఎనిమిదవ రోజున ఇది వస్తుంది. ఈ నక్షత్రం ఉన్న గడియల్లో బంగారంపై పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన రోజులలో ఒకటిగా చెబుతారు.
వేద జ్యోతిషశాస్త్రాన్ని పరిశీలిస్తే.. పుష్యమిని శ్రేయస్సు, సంపద గ్రహం అయిన బృహస్పతి (గురుడు) పాలించాడని నమ్ముతారు. బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఇది ఉత్తమమైన రోజులలో ఒకటి అని జ్యోతిష్కులు నమ్ముతారు. ఎందుకంటే ఈ రోజున బంగారం కొనుగోలు చేస్తే.. వృద్ధి, అదృష్టంతో పాటు ఆర్థిక సమృద్ధిని తెస్తుందని భావిస్తారు.
ఉగాది లేదా గుడి పడ్వా :
భారతదేశంలోని వివిధ రాష్ట్రాలలో ఉగాది లేదా గుడి పడ్వా నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. అంటే.. ఆంగ్ల సంవత్సరాది మాదిరిగానే తెలుగు సంవత్సరాదిగా పిలుస్తారు. అంతేకాకుండా, ఈ రోజును వైశాఖి లేదా ఓనం అని కూడా పిలుస్తారు. కొత్త ఏడాది ప్రారంభానికి సంబంధించి ప్రజలు అదృష్టానికి చిహ్నంగా బంగారం కొనుగోలు చేయడం ద్వారా ఈ పండుగను సూచిస్తారు. ఉగాది కన్నడ, తెలుగు నూతన సంవత్సరం అయితే.. గుడి పడ్వా మరాఠీ నూతన సంవత్సరాన్ని సూచిస్తుంది. ఈరోజు ముఖ్యంగా బంగారు లోహంపై ఉజ్వల భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు.
అక్షయ తృతీయ :
అక్ష తీజ్ లేదా అక్షయ తృతీయ అనే పేరుతో పిలుస్తారు. హిందూ సంస్కృతిలో బంగారం కొనుగోలు చేయడానికి మంచి రోజుగా చెబుతారు. ఈరోజు సాంప్రదాయ భారతీయ క్యాలెండర్ వైశాఖ మాసం మూడో చంద్ర రోజున వస్తుంది. హిందూ పురాణాల ప్రకారం.. ఈ పవిత్రమైన రోజున బంగారాన్ని కొనుగోలు చేయడం ‘అక్షయ’ పేరు సూచించినట్లుగానే పెరుగుతూనే ఉంటుంది. అంటే.. శాశ్వతమైన లేదా అంతులేనిది అని అర్థం. చాలా మంది ఈ రోజున పెళ్లి చేసుకోవాలని లేదా కొత్త వెంచర్ ప్రారంభించడానికి ఎక్కువగా ప్రయత్నిస్తుంటారు.
దసరా-నవరాత్రులు :
నవరాత్రి అనేది భారతదేశంలో విస్తృతంగా జరుపుకునే పండుగ. దుర్గాదేవతకు ప్రీతికరమైన రోజు. హిందూ పురాణాల ప్రకారం.. నవరాత్రి తొమ్మిది రోజులలో ప్రతి రోజు ఒక దేవత రూపానికి అంకితం చేస్తారు. బంగారం అమ్మవారి శక్తిని సూచిస్తుంది. నవరాత్రులు పదవ రోజు దుర్గాపూజతో ముగుస్తాయి. దీనిని దసరా లేదా విజయదశమిగా పిలుస్తారు. ఈరోజున బంగారం కొనుగోలు చేయడం వల్ల చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా భావిస్తారు. అమ్మవారి ఆశీర్వాదాలు లభిస్తాయని నమ్ముతారు. ప్రజలు తమ జీవితాల్లో శ్రేయస్సు, సంపదను ఆహ్వానించే సాధనంగా బంగారంలో పెట్టుబడి పెట్టడానికి ఈరోజు కోసం లక్షలాది మంది ఆసక్తిగాఎదురుచూస్తుంటారు.
ధంతేరాస్ – దీపావళి :
భారతదేశంలో విస్తృతంగా జరుపుకునే పండుగ దీపావళి.. మొదటి రోజు ధన్తేరస్. ఈరోజు కార్తీక మాసంలో (హిందూ మాసం) కృష్ణ పక్షం 13వ రోజున జరుపుకుంటారు. హిందూ సంస్కృతిలో అపారమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. ధన్‌తేరస్ పేరు మాదిరిగానే సంపద, శ్రేయస్సు కోసం అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తుంటారు. మహావిష్ణువు అవతారం, దేవతల వైద్యులలో ఒకరైన ధన్వంతరి అమృతం కుండతో ఉద్భవించాడని నమ్ముతారు. ఈరోజు ఆర్థిక స్థిరత్వాన్ని కూడా సూచిస్తుంది. అందుకే చాలామంది ప్రజలు సంపదను పూజించడానికి ఈ రోజున బంగారు లోహాలపై పెట్టుబడి పెడతారు.
బలిప్రతిపాద :
బలిప్రతిపాద అనేది ముఖ్యమైన హిందూ పండుగ. మతపరమైన, సాంస్కృతిక ప్రాముఖ్యత కారణంగా బంగారం కొనుగోలు సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ఈ రోజున, బాలి రాజు భూమికి తిరిగి వచ్చాడు. ఇది దాతృత్వం, శ్రేయస్సును సూచిస్తుంది.

ఈ రోజున, బంగారం కొనుగోలు చేయడం శుభప్రదంగా పరిగణించబడుతుంది, ఇది సంపద మరియు శ్రేయస్సును సూచిస్తుంది. ఈ చర్య బంగారం దీవెనలను ఆకర్షిస్తుందనే నమ్మకంతో పాతుకుపోయింది, ఇది సంపద మరియు ఆర్థిక శ్రేయస్సుకు చిహ్నంగా భావిస్తారు.
Best Days to Buy Gold : వారంలో బంగారం కొనడానికి ఏ రోజు మంచిదంటే? :
వారంలో సోమవారం, మంగళవారం, గురువారం, ఆదివారం రోజులు బంగారం కొనడానికి చాలా మంచి రోజులుగా చెబుతారు.
శనివారం బంగారం కొనవచ్చా? :
బంగారం కొనడానికి శనివారం మంచి రోజు కాదని పెద్దలు చెబుతుంటారు. అయితే, శనివారం నాడు ఇనుము, ఇనుము సంబంధిత వస్తువులను కొనుగోలు చేయడం శుభప్రదంగా చెబుతారు.
ఏ నెలలో బంగారం చౌకగా ఉంటుందంటే? :
యూఎస్ గోల్డ్ బ్యూరో ప్రకారం.. బంగారం కొనుగోలు చేసేందుకు మార్చి నెల అత్యంత చౌకైనదిగా చెప్పవచ్చు. ఈ నెలలో బంగారం చాలా తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చు.
గోల్డ్ హాల్‌మార్కింగ్ అంటే ఏంటి? :
హాల్‌మార్క్ అనేది బంగారు ఆభరణాలపై స్వచ్ఛతను తెలియజేస్తుంది. దీనిని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) గుర్తుగా సూచిస్తారు. దేశంలో హాల్‌మార్కింగ్ కేంద్రం కూడా ఉంది. ఆభరణాల స్వచ్ఛత గురించి తెలుసుకోవడానికి బీఐఎస్-ధృవీకరించిన హాల్‌మార్క్ స్టాంప్ అందిస్తుంది. దీని ఆధారంగానే బంగారం నాణ్యతను నిర్ధారిస్తారు. ఉదాహరణకు.. 18K (క్యారెట్లు) బంగారాన్ని కొనుగోలు చేస్తే.. 24 భాగాలలో 18 స్వచ్ఛమైన బంగారం ఉండగా మిగిలినవి 50: 50 నిష్పత్తిలో రాగి, వెండి ఉంటుంది.
స్వచ్ఛమైన బంగారాన్ని ఆభరణాల తయారీకి వినియోగిస్తారు. అందుకే, వెండి, బంగారం వంటి విలువైన లోహాలు మన్నికైనవి. ఎక్కువగా కాలం చెక్కుచెదరకుండా ఉంటాయి. అందుకేు వీటిని మిశ్రమంగా వాడుతుంటారు. అంతేకాదు.. రాగి, ప్లాటినం, పల్లాడియం, జింక్ కూడా ఉపయోగిస్తారు. దీని ఆధారంగానే ప్రతి ఆభరణాల స్వచ్ఛతను నిర్ణయిస్తాయి. ఇతర లోహాలకు బంగారంలో హాల్‌మార్క్ స్టాంప్ ఇవ్వబడదు.
బంగారంలో పెట్టుబడికి సురక్షితమైనదేనా? :
బంగారు ఆభరణాలు సాంప్రదాయకంగా భారతీయులు బంగారంలో పెట్టుబడి పెట్టడానికి సురక్షితమైన మార్గంగా భావిస్తుంటారు. దాదాపు అన్ని నగల వ్యాపారులు భారతదేశంలో బంగారు ఆభరణాలను విక్రయిస్తారు. అన్ని బంగారు నాణేలు సాధారణంగా బీఐఎస్-హాల్‌మార్క్ కలిగి ఉంటాయి. మీ బంగారం కొనుగోలు చేయడానికి ముందు మీరు మీ బంగారం వ్యాపారి నుంచి స్వచ్ఛత ధృవీకరణ పత్రాన్ని తప్పనిసరిగా అడిగి తీసుకోవాలి.
బంగారు నాణెం లేదా కడ్డీని కొనుగోలు చేసే సమయంలో ఇది తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఆభరణాల కొనుగోలు ఖర్చు బంగారం ధర, తయారీ వ్యయంపై ఆధారపడి ఉంటుంది. బంగారం ధర కన్నా 5శాతం నుంచి 20శాతం వరకు ఉంటుంది. ఆభరణాల తయారీకి అయ్యే ఈ ఖర్చు మీ బంగారు ఆభరణాలను విక్రయించినప్పుడు మీరు తిరిగి పొందలేకపోవచ్చు.
బంగారంపై పన్నులు.. వడ్డీతో గోల్డ్ లోన్ :
బంగారు ఆభరణాలను కొనుగోలు చేసేటప్పుడు మీరు ప్రస్తుత ధరల ప్రకారం 3శాతం వస్తువులు, సేవల పన్ను (GST) చెల్లించాలి. మీ ఆభరణాలను తిరిగి విక్రయించినప్పుడు మీరు దీన్ని తిరిగి పొందలేరు. మీరు బంగారం విలువలో 75శాతం నుంచి 90శాతం వరకు సంవత్సరానికి 8శాతం వడ్డీ రేట్లతో గోల్డ్ లోన్ పొందవచ్చు.
Read Also : Best Home Loans : మీరు హోమ్ లోన్ కోసం చూస్తున్నారా? హౌజింగ్ లోన్ అందించే టాప్ 5 బెస్ట్ బ్యాంకులివే