Deepika Padukone Baby Girl : బాలీవుడ్ క్యూట్ కపుల్ దీపికా పదుకొణె రణవీర్ సింగ్ తల్లిదండ్రలయ్యారు. తమ జీవితంలోకి మొదటి ఆడబిడ్డకు స్వాగతం పలికారు. ముంబైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన దీపికా ఆదివారం (సెప్టెంబర్ 8) పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ బిడ్డా క్షేమంగా ఉన్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
దీపిక, రణ్ వీర్ దంపతులకు అభిమానులు, నెటిజన్ల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. దీపికా, రణవీర్ ఇద్దరూ తమ చిన్నారి రాకతో మురిసిపోయారు. అంతకుముందు బాలీవుడ్ క్యూట్ కపుల్ తమ లగ్జరీ కారులో ముంబై ఆసుపత్రికి చేరుకున్నారు. దీపికా డెలివరీకి ముందే ఎప్పటి నుంచో అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ జంట ప్రకటన కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూశారు.
Deepika Padukone : సిద్ధివినాయక ఆలయాన్ని సందర్శించిన దంపతులు :
గత వారం ముంబైలోని సిద్ధివినాయక ఆలయాన్ని సందర్శించిన దంపతులిద్దరూ దీపికా ప్రసవానికి ముందు ఆశీర్వాదం అందుకున్నారు. తల్లిదండ్రులు కాబోతున్న దీపిక, రణవీర్‌లకు వారి స్నేహితులు, కుటుంబ సభ్యులు, అభిమానులు తమ హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. గత వారమే దీపికా పదుకొణె తన గర్భం గురించి జరుగుతున్న ఊహాగానాలు, విమర్శలకు ముగింపు పలికేందుకు ఇన్‌స్టా వేదికగా ప్రసూతి షూట్‌తో అభిమానులను ఆకర్షించింది.
నెలల తరబడి ట్రోలింగ్, అవమానాన్ని ఎదుర్కొన్నప్పటికీ, ఫేక్ బేబీ బంప్ ఆరోపణలను దీపిక అద్భుతమైన ఫోటోల సిరీస్‌తో అన్ని పుకార్లకు ముగింపు పలికింది. ఆ ఫోటోలలో ఆమె తన భర్త, నటుడు రణవీర్ సింగ్‌తో కలిసి పోజులిచ్చింది.
నిండు గర్భిణిగా దీపికా పదుకొణె ప్రసూతి షూటింగ్ ఆమె జీవితంలో ఒక ప్రత్యేక అధ్యాయం. అద్భుతమైన వేడుక. దీపిక మరో నల్లటి దుస్తులు ధరించి, భర్త రణ్‌వీర్ సింగ్‌తో కలిసి తన బేబీ బంప్‌ను చూపిస్తూ అత్యంత సన్నిహితంగా ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
View this post on Instagram