Pushpa 2 Sukumar : పుష్ప 2 మూవీ మరికొద్ది నెలల్లో రాబోతోంది. ఇప్పటికే చాలావరకూ షూటింగ్ పూర్తి అయింది. ఇంకా నిర్మాణ పనులతో పాటు అవసరమైన చోట మళ్లీ రీషూట్ ప్లాన్ చేస్తోంది మూవీ యూనిట్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ది రూల్ మూవీ వచ్చే డిసెంబర్ 6న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మూవీకి సంబంధించి షూటింట్ జరిగే సమయంలో ఒక సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. పాన్ ఇండియా డైరెక్టర్‌గా పేరొందిన డైరెక్టర్ సుకుమార్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
ఇంతకీ, అదేంటంటే.. పుష్స 2 షూటింగ్ సమయంలో దర్శకుడు సుకుమార్ ఎంతో ఖరీదైన తన ఐఫోన్ కిందకి గట్టిగా విసిరికొట్టారట.. ఇప్పుడు టాలీవుడ్ టాక్ వినిపిస్తోంది. ఇందులో నిజమెంత? అనేది క్లారిటీ లేనప్పటికీ సుకుమార్ ఇలా చేయడానికి అసలు కారణం ఏంటి అనే ప్రశ్న తలెత్తుతోంది.
వాస్తవానికి మూవీ షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తి చేయాలని భావించినా కొన్ని పరిస్థితుల కారణంగా మూవీ రిలీజ్ ఆలస్యమైంది. షెడ్యూల్ ప్రకారం.. పుష్ప 2 ది రూల్ వచ్చే ఆగస్టు 15న థియేటర్లలో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ, కొన్ని అనుకోని పరిస్థితుల రీత్యా మరింత ఆలస్యమవుతోంది. వచ్చే డిసెంబర్ 6వ తేదీకి వాయిదా పడినట్టు టాలీవుడ్ టాక్ నడుస్తోంది.
Pushpa 2 Sukumar : పుష్ప 2 మూవీ రిలీజ్.. డిసెంబర్ 6 ఫిక్స్ అయినట్టేనా?
దీనికి ప్రత్యేక కారణం.. పుష్ప 2 మూవీలోని కొన్ని సన్నివేశాలను రీషూట్ చేయాల్సి వచ్చిందట.. అందుకే ఈ మూవీని చిత్ర యూనిట్ వాయిదా వేసినట్టు క్లారిటీ ఇచ్చింది. అంతేకాదు.. పుష్ప2 మూవీపై ఒక ఇంగ్లీష్ పేపర్ రాసిన వార్త కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అందులో దర్శకుడు సుకుమార్ పుష్ప 2 మూవీ షూటింగ్ సమయంలో తన ఐఫోన్ కోపంగా విసిరేసినట్టు తెలిసింది. ఇప్పుడు ఇదే న్యూస్ ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతుంది. .

ఈ పుష్ప మూవీలో ప్రధాన సన్నివేశం షూట్ చేసే సమయంలో సుకుమార్ ఫుల్ ఫైర్ అయ్యారట.. అక్కడి సీన్ వివరించే ప్రయత్నం చేయగా వారు సీన్ తగినట్టుగా నటించలేకపోవడంతో సుకుమార్ కోపగించుకున్నారట.. కేవలం ఒక సీన్ పూర్తి చేసేందుకు 40 టేకులు తీసుకోవడం చిరాకు తెప్పించదట..
ఒక నటుడు బాగా చేస్తే, మరొకరు సరిగా నటించలేకపోయారని, దాంతో సుకుమార్ అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఆ సమయంలో ఎవరిపై కోపం చూపించాలో తెలియక తన ఖరీదైన ఐఫోన్‌ను బలంగా నేలకేసి కొట్టి అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయారట.. ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ, సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
Read Also : Kalki 2898AD Movie : కల్కి మూవీకి వెళ్లేవారు.. తప్పనిసరిగా ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి..!