IPL 2025 Season : ఐపీఎల్ 2025 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ రాబోతున్నాడట.. ఐపీఎల్ టైటిల్ కోసం 17 సీజన్‌లుగా ఆర్సీబీ ప్రయత్నిస్తూనే ఉంది. కానీ, ఆ కల ఇంతవరకు నెరవేరలేదు. ప్రతి ఐపీఎల్ సీజన్‌లో ఫైనల్ దాకా కూడా రాకుండానే బెంగళూరు జట్టు (royal challengers bangalore) నిష్ర్కమించాల్సి వచ్చింది. చివరిదాకా ప్రయత్నించినా కప్ మాత్రం దక్కడం లేదు. గత ఐపీఎల్ సీజన్ విషయానికి వస్తే.. బెంగళూరు జట్టు ఆడిన 14 మ్యాచ్‌ల్లో 7 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచింది. వచ్చే సీజన్‌లో బెంగళూరు జట్టు సారథ్యం మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం ఆర్సీబీ జట్టు కెప్టెన్‌గా డుప్లెసిస్ కొనసాగుతున్నాడు. అతడి వయస్సు 39ఏళ్లు. క్రికెట్ వయస్సు పరిమితి దృష్ట్యా వచ్చే ఐపీఎల్ సీజన్‌లో బెంగళూరు జట్టుకు ఆడే పరిస్థితి లేదు. ఇక ఆ స్థానాన్ని విరాట్ కోహ్లీ భర్తీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే, టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు విరాట్ కోహ్లీ (virat kohli retirement) గుడ్‌బై చెప్పేశాడు. టీ20 ప్రపంచ కప్ సాధించిన వెంటనే కోహ్లీ తన రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ నేపథ్యంలో కోహ్లీ రాబోయే ఐపీఎల్ సీజన్‌కు మళ్లీ సారథ్య బాధ్యతలు తీసుకునే అవకాశం ఉందంటూ ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.
IPL 2025 Season : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్‌గా కోహ్లీ వచ్చే ఛాన్స్?
టీమిండియాకు సారథ్య బాధ్యతలు కారణంగా కోహ్లీ ఆర్సీబీ జట్టుకు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఒకవైపు టీమిండియా జట్టు, మరోవైపు బెంగళూరు జట్టును సారథ్యంలో ఒకేసారి నడిపించడం చాలా భారంగా ఉంటుంది. ఈ విషయంలోనే కోహ్లీ లీగ్ క్రికెట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నట్టుగా అప్పట్లో ప్రకటించాడు. ఆ తర్వాత నుంచి కోహ్లీకి ఫుల్ ప్రీడమ్ దొరికింది. అంతేకాదు.. భారత జట్టు 3 జట్ల కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకున్నాడు. కోహ్లీ బెంగళూరు జట్టుకు మరోసారి కెప్టెన్‌గా వచ్చేందుకు ఎలాంటి ఇబ్బంది లేదు.

ఈ క్రమంలోనే ఆర్సీబీ జట్టుకు కోహ్లి సారథ్యం వహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వచ్చే ఐపీఎల్ (IPL 2025) సీజన్ నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB team) జట్టుకు కెప్టెన్‌గా కోహ్లీ మళ్లీ బాధ్యతలు చేపట్టే ఛాన్స్ అధికంగా ఉన్నాయి. కోహ్లి ఇప్పటివరకూ ఆడిన 143 మ్యాచ్‌లలో బెంగళూరు జట్టుకు సారథ్యం వహించాడు. మొత్తం 66 మ్యాచ్‌లలో కోహ్లీ సారథ్యంలో గెలిపించాడు. కోహ్లి సారథ్యంలో ఆర్సీబీ జట్టు 2016లో ఫైనల్స్‌లోకి ప్రవేశించించింది. అలాగే, 3 సార్లు ప్లేఆఫ్స్ కూడా చేరుకుంది. అందుకే, బెంగళూరు జట్టు పగ్గాలు మళ్లీ కోహ్లీకే అందించాలని ఆ జట్టు ఫ్రాంచైజీ పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. అదే నిజమైతే.. ఆర్సీబీ ఫ్యాన్స్ పండుగే అంటున్నారు.