Varun Tej Surgery : వరుణ్ తేజ్‌కు సర్జరీనా..? పెళ్లైన ఏడాదిలోపే ఆపరేషనా? ఇందులో నిజమెంత?

Varun Tej Surgery : మెగా ఫ్యామిలీ గురించి ఏ చిన్న విషయం బయటకు వచ్చినా సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేసేస్తుంటారు. అందులో నిజమెంత అనే విషయం పక్కనపెడితే అదేదో నిజమైనట్టుగా చర్చించుకోవడం అదో ట్రెండ్ అయిపోయింది. మెగా కుటుంబంలో ఒకరైన వరుణు తేజ్ కొన్ని నెలల క్రితమే లావణ్య త్రిపాఠిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరిపై కూడా మొదట్లో అనేక పుకార్లు, రుమర్లు వినిపించాయి. అయితే, తాజాగా వరుణ్ తేజ్ గురించి మరో కొత్త రుమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వరుణ్ తేజ్ సర్జరీ చేయించుకోనున్నాడని ఆ వార్త సారాంశం.. ఇంతకీ వరుణ్ తేజ్ ఎందుకు సర్జరీ చేయించుకోనున్నాడు.

అందుకు కారణాలంటి? అనేది స్సష్టత లేదు. కానీ, వరుణ్‌కు ఇటీవల తన కాలికి ఒక గాయమైందట. అది చిన్న గాయమే అయినప్పటికీ, పెద్దగా పట్టించుకోలేదట. ట్రీట్‌మెంట్ తీసుకున్నా కూడా గాయం మానలేదట.. ఇంకా పెద్దది కావడంతో చివరికి వైద్యులు సర్జరీ చేయాలని సూచించారట. ఇప్పుడు ఆ గాయం కాస్తా పెద్దది కావడంతో ఆయన్ను తప్పనిసరిగా సర్జరీ చేయించుకోవాలని సూచించారట.. వాస్తవానికి అది పెద్ద సర్జరీ కాదు.. ఏదో చిన్నపాటి మైనర్ సర్జరీ.. ఈ విషయం బయటకు వచ్చిందో లేదో సోషల్ మీడియాలో ట్రోలర్స్ అదేదో జరిగిపోయిందంటూ నానా రాద్దాంతం చేసేస్తున్నారు. మరికొంతమంది ట్రోలర్లు ఈ విషయాన్ని మరింత వల్గర్‌గా ట్రోల్ చేస్తున్నారు. ఈ వార్త గురించి తెలియగానే మెగా అభిమానులు సైతం ఆందోళన చెందుతున్నారు.

Varun Tej Surgery  : వరుణ్ తేజ్‌కు ఆపరేషనా? ఇందులో నిజమెంతా? :

ట్రోలర్లు మాత్రం వరుణ్‌పై ఫన్నీ కామెంట్లతో వ్యంగంగా పోస్టులు పెడుతున్నారు. వరుణ్ తేజ్ కు ఎంత కష్టమొచ్చింది? బాగా నొప్పిగా ఉందా? అంటూ చెత్తగా ట్రోల్ చేస్తున్నారు. ఆయన అభిమానులు మాత్రం ఈ వార్తను నమ్మడం లేదు. వరుణ్ నిజంగా ఆపరేషన్ చేయించుకోబోతున్నాడా? ఇందులో నిజమెంతా? అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. వరుణ్ తేజ్ కు అసలు ఏమైంది అనే విషయంపై క్లారిటీ లేకపోవడంతో ఆయన అభిమానుల్లో కూడా కొంత ఆందోళన ఉన్నట్టు కనిపిస్తోంది. తనపై వస్తున్న ఈ రుమర్లకు వరుణ్ తేజ్ చెక్ పెడతారా లేదో చూడాలి.

Mega Hero Varun Tej to Surgery For his Leg Operation News Viral Telugu
Varun Tej to Surgery 

మెగా బ్రదర్ నాగబాబు కుమారుడు మెగాప్రిన్స్ వరుణ్ తేజ్, నటి లావణ్య త్రిపాఠిని ఇటలీలో వివాహం చేసుకున్నాడు. కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమలో మునిగితేలారు. చివరికి ఒకటి అయ్యారు. గత ఏడాది జూన్ నెలలోకుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా నిశ్చితార్ధం చేసుకున్నారు. గత ఏడాది నవంబర్ నెలలో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఇటీవలే ఈ కొత్త పెళ్లి జంట హనీమూన్‌కు కూడా వెళ్లినట్టు తెలుస్తోంది. ప్రత్యేకించి హనీమూన్ కోసం అర్కిటిక్‌కు వెళ్లారని టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. ఏదిఏమైనా అర్కిటిక్ సర్కిల్‌‌లోని ల్యాప్ లాండ్‌లో ఈ న్యూ కపుల్ ఎంజాయ్ చేస్తున్నారు. వరుణ్, లావణ్యకు సంబంధించి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read Also : Sharing Same Soap : మీ ఇంట్లో వారంతా ఒకే సబ్బును వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త.. ఈ పొరపాటు అసలు చేయొద్దు..!