Money Abroad Rules : ప్రస్తుత రోజుల్లో విదేశాల నుంచి అత్యధిక మొత్తంలో నగదు వచ్చే ప్రపంచంలో భారత్ మొదటి దేశమని చెప్పవచ్చు. అంటే.. విదేశాల్లో ఉంటూ ఉద్యోగం లేదా వ్యాపారం ద్వారా డబ్బు సంపాదించి తమ దేశానికి తిరిగి పంపే వ్యక్తుల జాబితాలో భారతీయులు అగ్రస్థానంలో ఉన్నారు. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (IOM) వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్-2024లో విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు 2022లో 111 బిలియన్ డాలర్ల మొత్తాన్ని భారత్‌కు తిరిగి పంపారని వెల్లడైంది. అంతేకాదు.. ఆ పెద్ద మొత్తాన్ని భారత రూపాయిగా మార్చుకుంటే.. దాని విలువ అక్షరాలా రూ. 9 లక్షల 22 వేల కోట్లు ఉంటుంది.
ఇది మాత్రమే కాదు.. ఒక ఏడాదిలో 100 బిలియన్ డాలర్ల కన్నా ఎక్కువ రెమిటెన్స్‌లను అందుకున్న ప్రపంచంలోనే భారత్ మొదటి దేశంగా అవతరించింది. దీనికి ముందు, చైనా ఈ విషయంలో చాలా కాలంగా నంబర్ వన్ స్థానంలో ఉంది. కానీ, అది కూడా 100 బిలియన్ డాలర్ల స్థాయిని ఎప్పటికీ దాటలేకపోయింది. ఇప్పుడు ఇక్కడ ప్రశ్న ఏమిటంటే… భారతదేశానికి ఇంత నగదు వస్తున్నప్పుడు ఆ మొత్తంపై కూడా ప్రభుత్వం పన్ను వసూలు చేస్తుంది.
Money Abroad Rules : ఎప్పుడు పన్ను చెల్లించాలంటే? :
దేశ ప్రజలను అయోమయంలో పడేసిన మొదటి ప్రశ్న ఏమిటంటే.. సాధారణ బ్యాంకు అకౌంట్లలో డబ్బు పంపవచ్చా లేదా అనేది. వారి కోసం, మీ బంధువులు లేదా బంధువులు పంపుతున్న విదేశాల నుంచి మీరు మీ బ్యాంకు అకౌంటుకు డబ్బు పంపడం కచ్చితంగా చట్టబద్ధమైనదని గుర్తించాలి. చాలా మందికి వృద్ధ తల్లిదండ్రులు భారత్‌లో నివసిస్తున్నారు. విదేశాలలో నివసిస్తున్న వారి పిల్లలు వారి భారతీయ బ్యాంకు అకౌంట్లకు డబ్బు పంపడం వల్ల కూడా జరుగుతుంది. అలాంటి డబ్బుపై ఎలాంటి పన్ను లేదు. కానీ ఇది నియమం. ఆ డబ్బును ఏదైనా పెట్టుబడిలో పెట్టుబడి పెట్టకపోతే పన్ను ఉండదు. విదేశాల్లో నుంచి వచ్చే నగదును మీ సొంత బిజినెస్ కోసం ఇన్వెస్ట్ చేయడం ద్వారా అధిక మొత్తంలో డబ్బులను సంపాదించినట్టుయితే.. అలాంటి డబ్బుపై కచ్చితంగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఎవరి బ్యాంకు అకౌంట్లలో డబ్బులు వస్తాయో వారు మాత్రమే ఈ పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
ఫెమా రూల్స్ (FEMA)పై అవగాహన తప్పనిసరి :
విదేశాల నుంచి భారతదేశంలోని బ్యాంకు అకౌంట్లలోకి వచ్చే డబ్బును ఇన్‌వర్డ్ రెమిటెన్స్ అంటారు. ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ లేదా ఫెమా అని పిలిచే అలాంటి నగదు లావాదేవీల కోసం భారత్‌లో ఒక ప్రత్యేకమైన సదుపాయం అందుబాటులో ఉంది. ఫెమా నిబంధనల ప్రకారం.. మీ నిత్యవసర ఖర్చుల కోసం విదేశాల నుంచి నగదు ఏమైనా భారత్‌లోని మీ బ్యాంకు అకౌంట్లలో క్రెడిట్ అయితే.. అలాంటి నగదు మొత్తంపై ఎలాంటి పన్ను చెల్లింపు ఉండదు.

అంతేకాదు.. విదేశాల్లో స్థిరపడిన ఒక వ్యక్తి భారత్‌లో నివసిస్తున్న తన తల్లిదండ్రులకు ఆర్థిక అవసరాలను తీర్చేందుకు తాను ఉండే దేశం నుంచి తన భారతీయ బ్యాంకు అకౌంట్లోకి నగదు పంపినట్టుయితే కూడా అలాంటి సొమ్ముపై ఎటువంటి పన్ను పడదు. అంతేకాదు.. విదేశాల నుంచి బహుమతులు, వైద్య ఖర్చులు, చదువులు, విరాళాలు, ప్రయాణ ఖర్చుల కోసం విదేశాల నుంచి డబ్బులను పంపితే కూడా అలాంటి డబ్బుపై కూడా పన్ను విధింపు ఉండదు.
ఎంత మొత్తంలో డబ్బు వస్తే పన్ను చెల్లించాలి :
ఏ కుటుంబ సభ్యులు పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని పొందవచ్చో కూడా (FEMA) వెల్లడించింది. ఒక్క మాటలో చెప్పాలంటే.. మీరు విదేశాల నుంచి వచ్చే డబ్బుపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఇతర దేశాల నుంచి నగదును పంపే వ్యక్తులకు సంబంధించి ఎవరైనా సరే.. తమ కుటుంబ సభ్యుల్లో ఒకరు లేదా అంతకంటే ఎక్కువమంది ఉన్నప్పటికీ, వారిలో భర్త లేదా భార్య లేదంటే.. సోదరీమణులు, సోదరులు, లైఫ్ పార్టనర్ బ్రదర్ లేదా సిస్టర్‌కు నగదు పంపే వ్యక్తికి సంబంధికుల్లో తల్లిదండ్రుల సోదరి లేదా సోదరుడు ఎవరు కూడా ఈ పన్ను పరిధిలోకి రారని గమనించాలి.
ఈ కుటుంబ సభ్యులు కాకుండా బయటి సభ్యుల్లో ఎవరైనా విదేశాల నుంచి మీ నగదును తీసుకుంటే ఆ వ్యక్తి తప్పనిసరిగా పన్ను చెల్లించక తప్పదు. కానీ, ఈ డబ్బు మొత్తం పరిధిని ఏడాదికి రూ.50వేలుగా నిర్ణయించారు. ఈ మొత్తం సొమ్ము కన్నా తక్కువ మొత్తాన్ని భారత్‌లోని ఏ బ్యాంకు అకౌంట్లో గానీ డిపాజిట్ చేస్తే అది పన్ను పరిధిలోకి రాదని గమనించాలి.
విదేశీ డబ్బుపై పన్ను తగ్గింపు ఎలా పొందాలంటే? :
రిజర్వ్ బ్యాంక్ ప్రకారం.. విదేశాలలో నివసిస్తున్న వ్యక్తి భారత్‌లోని తన తల్లిదండ్రులకు రెండు మార్గాల్లో డబ్బు పంపవచ్చు. ఇందులో రూపాయి డ్రాయింగ్ అరేంజ్‌మెంట్, మనీ ట్రాన్స్‌ఫర్ సర్వీస్ స్కీమ్ ఉన్నాయి. మొదటి పద్ధతిలో ఇన్‌వర్డ్ రెమిటెన్స్‌పై పరిమితి లేదు. కానీ, వ్యక్తిగత ఖర్చుల కోసం విదేశాల నుంచి డబ్బును పంపాలి. ఎంటీఎస్ఎస్(MTSS)లో ఈ పరిమితి 2500 డాలర్లు.. అంటే.. సుమారుగా రూ. 2 లక్షలుగా ఉంటుంది. భారత్‌లో నివసిస్తున్న కుటుంబ సభ్యులు ఎంటీఎస్ఎస్ కింద ఏడాదికి 30 పేమెంట్లను పొందవచ్చు. అయితే, మన దేశంలో దీనిపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు.
Read Also : Sharing Same Soap : మీ ఇంట్లో వారంతా ఒకే సబ్బును వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త.. ఈ పొరపాటు అసలు చేయొద్దు..!