Sooseki Song Lyrics : టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీ అతి త్వరలో రిలీజ్ కానుంది. ఈ మూవీ రిలీజ్ కావడానికి ముందే పుష్ప 2 ది రూల్ మూవీ నుంచి రెండు సూపర్ పాటలు విడుదల అయ్యాయి. అందులో మొదటిది పుష్ప పుష్ప టైటిల్ సాంగ్ కాగా.. రెండోది సూసేకి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సామి.. అనే పాట యువతను ఉరూత్రలూగిస్తోంది.
ఈ పాట ఎక్కడ చూసినా పుష్ప మేనియా కనిపిస్తోంది. యూట్యూబ్ నుంచి ఏ సోషల్ మీడియా రీల్స్ చూసినా ఇదే సాంగ్ వినిపిస్తోంది. తగ్గేదేలే అన్నట్టుగా బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను సైతం బద్దలు కొట్టిన పుష్పరాజ్.. ది రూల్ అంటూ సీక్వెల్‌తో రాబోతున్నాడు. మరోసారి బాక్సాఫీస్ రూల్ చేసేందుకు రెడీ అవుతున్నాడు బన్నీ. ఎట్టకేలకు వాయిదాల అనంతరం వచ్చే డిసెంబర్‌లో పుష్ప 2 మూవీ విడుదల కానుంది.
తగ్గేదేలే.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే డైలాగ్ వినిపిస్తోంది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరి నోట ఇదే పుష్ప డైలాగ్ వినిపిస్తోంది. అల్లు అర్జున్ మేనేరిజంతో అందరూ తమ నోట తగ్గేదేలే అనే ఇదే డైలాగ్ పలుకుతున్నారు. ఏదిఏమైనా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అంటే ఆ మాత్రం ఉంటుందిలే అన్నట్టుగా కొనసాగుతోంది.
పుష్ప మూవీతో జాతీయ అవార్డును సైతం అల్లు అర్జున్ కొల్లగొట్టారు. పుష్ప 2 ది రూల్‌తో మళ్లీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేందుకు బన్నీ సిద్ధమయ్యాడు. వచ్చే ఆగష్టు 15న ఈ మూవీ రిలీజ్ కానుండగా వాయిదా కారణంగా వచ్చే డిసెంబర్ 6కి రిలీజ్ చేయనున్నట్టు మూవీ యూనిట్ ప్రకటించింది.
Sooseki Song Lyrics : పుష్ప ‘సూసేకి అగ్గిరవ్వ మాదిరే’ వీడియో సాంగ్..
పుష్ప-2 మూవీలోని ‘సూసేకి అగ్గిరవ్వ మాదిరే’ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్ రాబడుతోంది. ఇప్పటివరకూ 66 మిలియన్లను దాటేసింది. తక్కువ వ్యవధిలోనే అత్యధిక వ్యూస్ సాధించిన పాటగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ పాటే టాప్ ట్రెండింగ్‌లో నడుస్తోంది.

చంద్రబోస్ రాసిన ఈ పాటను సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేయగా.. మెలోడీ సింగర్ శ్రేయా ఘోషాల్ అద్భుతంగా పాడారు. ఎంతో అద్భుతమైన ఈ పాటకు సంబంధించి లిరిక్స్ ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది. ఈ పాటకు సంబంధించి తెలుగు లిరిక్స్ తో పాటు ఇంగ్లీష్ లిరిక్స్ కూడా నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.
‘సూసేకి అగ్గిరవ్వ మాదిరే’ లిరిక్స్ తెలుగులో :
వీడు మొరటోడూ..
అని వాళ్ళు వీళ్ళు ఎన్నెన్ని అన్నా
పసిపిల్లవాడు నా వాడూ
వీడు మొండోడూ
అని ఊరు వాడ అనుకున్న గాని
మనసులో వెన్న
రాయిలా ఉన్నవాడిలోన
ఉంటాడే నా సామి..
మెత్తాని పత్తి పువ్వులా మరి
సంటోడే నా సామి
చరణం 1 :
హో.. ఎర్రబడ్డ కళ్ళలోన.. కోపమే మీకు తెలుసు
అడవిలో పులిలా సరసర సరసర
చెలరేగడమే నీకు తెలుసు
అలసిన రాతిరి ఒడిలో చేరి
హో.. గొప్ప గొప్ప ఇనాములనే.. ఇచ్చివేసే నవాబు
ఇట్టాంటి మంచి మొగుడుంటే.. ఏ పిల్లైనా మహారాణీ
Read Also : Pushpa 2 Video Song : పుష్ప 2 మూవీ నుంచి ‘సూసేకి అగ్గిరవ్వ’ రెండో సాంగ్ చూశారా? శ్రీవల్లి అదరగొట్టిందిగా!