Ravi Bishnoi : భారత క్రికెట్ జట్టులో చోటు సంపాదించాలంటే అంత ఈజీ కాదనే చెప్పాలి. జాతీయ జట్టులో చోటు కోసం ఎంతోమంది ఆటగాళ్లు ప్రయత్నిస్తుంటారు. కానీ, కొంతమందికి మాత్రమే ఈ అదృష్టం దక్కుతుంది. బ్లూ జెర్సీ జట్టు తరఫున ఆడాలని అనేక మందికి ఆసక్తి ఉంటుంది. కొందరికి మాత్రమే ఆ అవకాశం దక్కుతుంది. అందులోనూ ప్రపంచకప్ ఆడాలంటే ఏ ఆటగాడికి మాత్రం ఇష్టం ఉండదు. ఏ మ్యాచ్‌లో చోటు దక్కినా దక్కపోయినా గానీ ప్రపంచ్ కప్ జట్టులో మాత్రం చోటు దక్కించుకోవాలని ఎన్నో కలలు కంటుంటారు.
ఎంతగా ఫామ్‌లో ఉన్నప్పటికీ కచ్చితంగా చోటు దక్కుతుందన్న గ్యారెంటీ లేదు. సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించిన వారిలో ఎవరికో కొంతమందికి ఈ చక్కని అవకాశం దక్కుతుంది. కొన్నిసార్లు ఎంత బాగా ఆడినా కూడా ఆయా క్రికెటర్లను దురదృష్టం వెంటాడుతుంది.
ఒకవేళ కొంతమందికి అవకాశం దక్కినా కూడా అందినట్టే అంది ఛాన్స్ వెంటనే చేజారిపోతుంది. దాంతో చాలామంది నిరుత్సాహంతో ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. అలాంటి క్రికెటర్లలో ఒకడైన ఒక భారత క్రికెటర్ గురించి మీకు తెలుసా? అతడే.. రవి బిష్ణోయ్.. ఎందరో భారత క్రికెటర్లలో బౌలర్లుగా రాణించినా కుల్‌దీప్, యుజువేంద్ర చాహల్ స్పిన్నర్ల నుంచి పోటీని తట్టుకుని మరి భారత క్రికెట జట్టులో చోటు సంపాదించుకున్నాడు బిష్ణోయ్.
Ravi Bishnoi : రవి బిష్ణోయ్.. ఎంతకష్టం వచ్చింది..
తనదైన బౌలింగ్‌తో స్పిన్ మాయాజాలం చేసి ఇప్పటి క్రికెట్ బ్యాటర్లకు కూడా దడ పుట్టించాడు. దాదాపు అన్ని మ్యాచ్‌ల్లో అద్భుతంగా రవి బిష్ణోయ్ బౌలింగ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం టీ20 ప్రపంచకప్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ స్పిన్నర్ బౌలర్‌కు కచ్చితంగా చోటు దక్కుతుందని అంతా అనుకున్నారు. కానీ, అందరి అంచనాలు తలకిందులు అయ్యాయి. ప్రపంచ కప్‌లో చోటు దక్కకపోవడంతో చేసేదిఏమిలేక తన సొంత ఊరికి వెళ్లిపోయాడు. అక్కడి తన బంధువులందరితో కలసి కాలం గడిపేస్తున్నాడు.

తన ఫ్యామిలీతో కలిసి టైమ్ ఫాస్ చేస్తుండగా రవి బిష్ణోయ్ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తన నానమ్మతో కలిసి మట్టి పొయ్యిని తయారుచేస్తూ ఇలా కనిపించాడు. మణికట్టు మాయాజాలంతో క్రికెటర్లకు ముచ్చెమటలు పట్టించిన ఆటగాడే మన రవి బిష్ణోయ్.. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 2024 ప్రారంభానికి ముందు బిష్ణోయ్ క్యాష్ రిచ్ లీగ్ పేలవ ప్రదర్శనతో విఫలమయ్యాడు.
బ్యాటర్ల వికెట్లను బాగా పడేసినప్పటికీ పరుగులు భారీగా ఇవ్వడం అతడికి మైనస్ అయింది. దాంతో అతడిని ప్రపంచ కప్ టోర్నీలో ఆడే జట్టులో బీసీసీఐ సెలెక్ట్ చేయలేదు. ప్రపంచ కప్ టీమ్‌లో చోటు దక్కకపోవడంతో తనకు ఏం చేయాలో తెలియక తన సొంత ఊరికి వెళ్లి మట్టి పనులు చేసుకుంటున్నాడు. వైరల్ అవుతున్న ఫొటో ఇదే..