Renu Desai Aadhya : అసలు మీరు మనుషులేనా.. నా కూతురు ఏడుపు మీకు కచ్చితంగా తగులుతుంది.. రేణూ దేశాయ్ పోస్టు వైరల్!

Renu Desai Aadhya : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్, తన పిల్లలు సోషల్ మీడియా ట్రోలర్స్ కారణంగా మానసిక వేదనకు గురవుతున్నారు. కొద్ది రోజులుగా తన పిల్లలపై వస్తున్న ట్రోల్స్‌కు తల్లి రేణు దేశాయ్ గట్టిగానే బదులిస్తున్నారు. అయినప్పటికీ కొంతమంది ట్రోలర్స్ వారిపై ట్రోలింగ్ చేస్తూనే ఉన్నారు. ఈ ట్రోలర్స్ బాధ భరించలేక రేణూ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కామెంట్ బాక్స్ కూడా డిసేబుల్ చేశారు.

లేటెస్టుగా ఈ ట్రోలర్స్ మీమ్స్ గురించి ఓ పోస్టు షేర్ చేశారు. అందులో పవన్, అన్నా లెజినోవా అకీరా, ఆద్య కలిసి ఉన్న ఫ్యామిలీ పిక్‌ అది. ఈ ఫొటోను షేర్ చేసిన ట్రోలర్స్‌పై రేణూ దేశాయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ ట్రోల్స్ కారణంగా తన కుమార్తె ఆద్య ఏడ్చిందంటూ రేణూ భావోద్వేగానికి గురయ్యారు. ఇలా చేస్తున్నారే.. మీకు మీవాళ్లు, కుటుంబాలు లేవా? అంటూ సూటిగా ప్రశ్నించారు.

మీకంటూ ఏ ఎమోషన్స్ లేవా? ఫొటోను క్రాప్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశానంటూ జోకులు పేలుస్తూ ఇష్టమొచ్చినట్లుగా మీమ్స్ చేస్తారా? ఇది సరికాదు.. మీకు కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది గుర్తించుకోండి. మీమ్ పేజ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక చెత్త పోస్టులో తన తల్లి రేణు దేశాయ్ గురించి జోకులు పేలుస్తూ పెట్టిన ఒక పోస్ట్ చూసి ఆద్య ఏడ్చింది. దీనిపై రేణూ సీరియస్ అయ్యారు.

Renu Desai Slams meme pages on trolling her Daughter Aadhya Photo Viral in Telugu
Renu Desai Slams meme pages on trolling her Daughter Aadhya ( Image Credit : Google/Instagram)

సెలబ్రెటీలు, రాజకీయ నేతల ఫ్యామిలీలపై జోకులు వేస్తుంటారు. మీకు కూడా మీ ఫ్యామిలీలో ఒక అమ్మ, అక్కాచెల్లెళ్లు, కూతుర్లు ఉండే ఉంటారు కదా. మీరు నిజంగా మనషులు అయితే.. ఇంతలా ఎలా క్రూరంగా మారిపోతున్నారో నాకు అర్థం కావడం లేదు. మీ చేతిలో ఫోన్ ఇంటర్నెట్ ఉంది కదా? అని సోషల్ మీడియాలో సెలబ్రెటీలపై ఏదైనా పోస్ట్ పెడతారా? అంటూ రేణూ దేశాయ్ ట్రోలర్స్‌ను ఏకిపారేశారు.

Renu Desai Aadhya : నా కూతురు ఏడుపు మీకు తగులుతుంది :

“నా కూతురు ఆద్య ఎంత బాధపడి ఉంటుందో ఓసారి గుర్తు పెట్టుకోండి. కచ్చితంగా నా కూతురు ఆద్య ఏడుపు మీకు తగులుతుంది. ఆ కర్మ అనుభవిస్తారు. మా పిల్లలపై ఇలాంటి ట్రోల్స్ చేసే మీమ్ పేజ్ అడ్మిన్‌లకు ఒక తల్లిగా ఇచ్చే శాపం కచ్చితంగా తగులుతుంది. ఈ పోస్ట్ చేసే ముందు ఒకటికి వంద సార్లు నేను ఆలోచించాను. నా కూతురు ఆవేదన చూసి తట్టుకోలేక ఈ పోస్టు పెట్టకుండా ఉండలేకపోయాను” అని రేణూ దేశాయ్ వాపోయారు.

గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో రేణూ, తన పిల్లలపై భారీగా ట్రోల్స్ వస్తున్నాయి. కొంతమంది ట్రోలర్స్ పెట్టే చెత్త పోస్టులను చూసి భరించలేక చివరికి రేణూ వాళ్ల పాపాన వాళ్లే పోతారులే అని పట్టించుకోకుండా ఉంటే సరిపోతుందిగా అని ఆమె నిర్ణయించుకున్నారు. కానీ, తన కూతురు ఆద్య విషయంలో కూడా ట్రోలర్స్ ఇలా మీమ్స్ పెట్టడంతో రేణు తట్టులేకపోయారు. కోపాన్ని ఆపుకోలేక తన బిడ్డ కన్నీళ్లకు కారణమయ్యారంటూ మళ్లీ పోస్టు పెట్టారు రేణూ దేశాయ్. ఇప్పుడు ఇన్‌స్టాలో రేణూ పెట్టిన పోస్టు వైరల్ అవుతుంది.

Read Also : Kalki 2898 AD Release Trailer : ప్రభాస్ ‘కల్కి’ ట్రైలర్‌లో కావాలనే ఆ హింట్ ఇచ్చారా? బాబోయ్ ఏంటి ఈ కన్ఫ్యూజన్.. బైరవ్ సరే.. ఇంతకీ కల్కీ ఎవరు..?!