YS Jagan : ఏపీ అసెంబ్లీలో మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గౌరవం కల్పించింది చంద్రబాబు ప్రభుత్వం. ఈరోజు నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ అసెంబ్లీ సమావేశాలకు వైఎస్ జగన్ కూడా హాజరయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ కనీస సీట్లు రాకపోవడంతో ఈసారి విపక్ష హోదా కోల్పోయింది. దాంతో అసెంబ్లీలో జగన్‌కు ఎలాంటి ప్రోటోకాల్ ఉండదు.
ఒక విషయంలో మాత్రం చంద్రబాబు సర్కార్ జగన్‌కు ప్రత్యేక గౌరవం కల్పించింది. వైఎస్ జగన్ కారు అసెంబ్లీలోకి అనుమతించారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థనపై సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించినట్టు శాసనభా వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. మొదటిరోజుసభలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలంతా ప్రమాణస్వీకారం చేశారు. సీఎం నారా చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రమాణం చేయగా, అనంతరం ఒకరి తర్వాత మరొకరు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రమాణ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ ఒక విషయాన్ని వెల్లడించారు. మాజీ సీఎం వైఎస్ జగన్ కోసం అసెంబ్లీలోని కొన్ని నిబంధనలను పక్కన పెట్టినట్లు తెలిపారు.

నిజానికి, అసెంబ్లీలో సీఎంకు ప్రవేశం సపరేటుగా ఉంటుంది. కానీ, అలా కాకుండా సాధారణ ఎమ్మెల్యే హోదాలో ఏ మార్గంలోకి లోపలికి వెళ్తారో అదే మార్గంలో వస్తానన్నారని చంద్రబాబు చెప్పారని పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. సభలోకి ఎమ్మెల్యేలు వచ్చే ఎంట్రీ నుంచి అసెంబ్లీలోకి అడుగుపెట్టినట్టు తెలిపారు. వైఎస్ జగన్ విషయంలో కూడా సీఎం చంద్రబాబు ఔదార్యంతో వ్యవహరించనున్నట్టు చెప్పుకొచ్చారు.
YS Jagan : ఏపీ అసెంబ్లీలోకి మాజీ సీఎం కారుకు అనుమతి :
ఏపీ అసెంబ్లీ సమావేశాలకు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలతో కలిసి వైఎస్ జగన్ హాజరయ్యారు. జగన్‌కు విపక్ష హోదా లేనందున ఆయన కారుతో పాటు ఆయన పార్టీ ఎమ్మెల్యేల కార్లను కూడా అసెంబ్లీ బయటి పార్క్ చేసి లోపలోకి వెళ్లాల్సి ఉంటుంది. విపక్ష హోదా జగన్‌కు లేకపోయినప్పటికీ, వైఎస్ జగన్ మాజీ సీఎం కావడంతో ఆయనను తన కారుతో పాటు లోపలోకి అనుమతించినట్టు మంత్రి పయ్యావుల కేశవ్ ఆదేశాలు జారీ చేశారు. వైఎస్ జగన్ కారును మాత్రమే అసెంబ్లీ సిబ్బంది ప్రాంగణంలోకి అనుమతించినట్టు తెలుస్తోంది.
జగన్ హోదా తగ్గించవద్దని సీఎం చంద్రబాబు ఆదేశించారని, అసెంబ్లీలోనూ మాజీ సీఎంకు ఇబ్బందుల్లేకుండా చూసేందుకు ప్రభుత్వం సిద్దమైనట్లు తెలిసింది. వైఎస్ జగన్ వెనక గేటు నుంచి అసెంబ్లీ లోపలికి వెళ్లారు. అసెంబ్లీ ప్రాంగణంలోకి వెళ్లినా నేరుగా సభలోకి వెళ్లలేదు. సభ ప్రారంభమైన 5 నిమిషాలకు ఆయన లోపలికి అడుగుపెట్టారు. తన ప్రమాణస్వీకారం సమయం వచ్చినప్పుడే సభలోకి అడుగుపెట్టారు. వైసీపీ ఎమ్మెల్యేగా ప్రమాణం చేసి సభలో కూర్చోకుండా ఛాంబర్‌లోకి వెళ్లిపోయారు.
Read Also : CM Chandrababu Naidu : ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. వాళ్లందరికీ ఉచితంగా రూ.5 లక్షలు పరిహారం!