Nara Lokesh : ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మంత్రి నారా లోకేశ్ కౌంటర్ ఇచ్చారు. ఈవీఎంలపై గతంలో వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలను ఆయన ట్విట్టర్ వేదికగా తీవ్రంగా ఖండించారు. 2019లో వైసీపీ గెలిచినప్పుడు ఈవీఎంలు గొప్పగా పనిచేస్తే.. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు అదే ఈవీఎంలను ఎలా నిందిస్తారని జగన్‌ను మంత్రి నారా లోకేష్ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్ నుంచి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలను డిమాండ్ చేస్తున్నారని అన్నారు.
Let’s face it @ysjagan, you’re allergic to democracy. You systematically destroyed institutions, systems and practices devoted to protecting people’s rights. You struck down in one stroke what the people of AP built collectively over the years.
When you won in 2019, EVMs worked… https://t.co/JMsxb4zVKg pic.twitter.com/uFnOXIhfdM
— Lokesh Nara (@naralokesh) June 18, 2024
ప్రజాస్వామ్యం అంటే.. జగన్‌కు ఎలర్జీ అని లోకేష్ విమర్శించారు. ఏళ్ల తరబడి ఏపీ ప్రజలు సమిష్టిగా నిర్మించిన వ్యవస్థలను జగన్ విధ్వంసం చేశారని మండిపడ్డారు. ప్రజా హక్కులను పరిరక్షించే సమస్యలను వ్యవస్థలను నాశనం చేశారని లోకేశ్ ఆరోపించారు.

పేదల డబ్బుతో రుషికొండ ప్యాలెస్ కట్టుకోవడానికి రూ. 560 కోట్లు ఎందుకు వెచ్చించారని సూటిగా ప్రశ్నించారు. ప్రజాధనంతో కొనుగోలు చేసిన ఫర్నిచర్‌ను ఎప్పుడు తిరిగిస్తారో చెప్పాలన్నారు. ఈ ప్రశ్నలకు ఏపీ ప్రజలకు సమాధానం కావాలంటూ నారా లోకేశ్ డిమాండ్ చేశారు.
Nara Lokesh Counter to Ys Jagan : ఈవీఎంలపై జగన్ సంచలన ట్వీట్ :
ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఈవీఎంలలో గోల్‌మాల్ జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. ఈవీఎంలపై విమర్శలు వస్తున్న వేళ ఆయన ట్విట్టర్ వేదికగా సంచలన ట్వీట్ చేశారు. గతంలో ఎప్పుడూ కూడా ఈవీఎంలపై జగన్ అనుమానాలు వ్యక్తం చేయలేదు. తొలిసారిగా ఆయన ఈవీఎంల గురించి ప్రస్తావించారు. ఈవీఎంలపై నమ్మకం పోతుందని, ఎలక్ట్రానిక్ ఈవీఎంలకు బదులుగా పేపర్ బ్యాలెట్ ఉపయోగించడమే చాలా ఉత్తమమని జగన్ ట్వీట్ చేశారు.
Just as justice should not only be served, but should also appear to have been served, so should democracy not only prevail but must appear to be prevalent undoubtedly.
In electoral practices across the world in almost every advanced democracy, paper ballots are used, not EVMs.…
— YS Jagan Mohan Reddy (@ysjagan) June 18, 2024
న్యాయం జరగడం మాత్రమే కాదు.. అది కూడా కనిపించాలి. ప్రజాస్వామ్యం బలంగా ఉండటమే కాదు.. నిస్సందేహంగా కనిపించాలన్నారు. చాలావరకూ ప్రపంచ ప్రజాస్వామ్య దేశాల్లో ఇప్పటికీ కూడా ఈవీఎంల స్థానంలో పేపర్ బ్యాలెట్లను వినియోగిస్తున్నారని మాజీ సీఎం జగన్ గుర్తు చేశారు. మనం కూడా అదే దిశగా పయనించాలని జగన్ ట్వీట్ చేశారు.
Read Also : CM Chandrababu Salary : ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు నాయుడు నెల జీతం ఇదేనట!
