Sim Card Owner : ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్ లేని ప్రపంచాన్ని ఊహించుకోలేం. అలాగే, ప్రతిఒక్కరి చేతిలో మొబైల్ లేకుండా కూడా ఒక క్షణం కూడా జీవించలేని పరిస్థితి. అంతగా మొబైల్ ఫోన్ మనిషి జీవితంలో భాగమైంది. అలాంటి మొబైల్ ఫోన్‌లో వాడే ఫోన్ నెంబర్ల (sim cards check online) సంఖ్య కూడా అదే స్థాయిలో వాడేస్తున్నారు.
ప్రతి మొబైల్ వినియోగదారుడు కనీసం ఒకటికి మించి సిమ్ (Sim Card Owner name) కార్డులను వాడుతుంటారు. సిమ్ 1, సిమ్ 2 ఇలా రెండు ఫోన్ నెంబర్లను కలిగి ఉంటారు. కొన్నిసార్లు సరైన అవగాహన లేకుండా మొబైల్ నెంబర్లను తమ పేర్లపై మరొకరికి ఇస్తుంటారు. ఇలా ఎప్పుడూ చేయకూడదు.
అందులోనూ గుర్తుతెలియని వారికి మీ వివరాలతో కూడిన ఫోన్ నెంబర్లను ఇవ్వకూడదు. మీకు తెలియకుండానే మీ వ్యక్తిగత వివరాలను బహిర్గతం చేయడమే కాకుండా దుర్వినియోగం చేసే అవకాశం ఉంటుందని గమనించాలి.
ప్రస్తుతం స్కామర్లు, సైబర్ నేరగాళ్లు కూడా సిమ్ స్కామ్ ద్వారా అమాయక వినియోగదారుల నుంచి వారి బ్యాంకు అకౌంట్లలో డబ్బులను కాజేస్తున్నారు. ఒకప్పుడు ఫీచర్ ఫోన్లలో ఒక సిమ్ మాత్రమే ఉండేది. ఇప్పుడు స్మార్ట్‌ఫోన్లలో డ్యూయల్ సిమ్ అనేది తప్పనిసరిగా మారింది. స్మార్ట్‌ఫోన్ తయారీదారులు కూడా తమ డివైజ్‌లలో సిమ్ స్లాట్ డ్యూయల్ డిఫాల్ట్ ఆప్షన్ అందిస్తున్నారు.
మీ వ్యక్తిగత వివరాలను ఎవరికి ఇవ్వొద్దు :
స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసిన వినియోగదారులు కచ్చితంగా రెండు సిమ్ నెంబర్లను మెయింటైన్ చేసేస్తున్నారు. ఈ సిమ్ కార్డు (Sim Card Owner name)ల ద్వారానే అనేక మంది స్కామర్లు నేరాలకు పాల్పడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతినిత్యం ఈ సిమ్ స్కామ్ గురించి ఎక్కువగా ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. కొత్త సిమ్ కోసం అప్లయ్ చేసుకునే సమయంలో వ్యక్తిగత వివరాలను ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అత్యవసరమైతే తప్పా ఆధార్, పాన్ కార్డు వంటి వివరాలతో పాటు బ్యాంకు అకౌంట్ల వివరాలను అసలు బహిర్గతం చేయకూడదు.
ఇలాంటి సమయాల్లో చాలామంది నేరగాళ్లు మనకు తెలియకుండానే మన వ్యక్తిగత వివరాలను సేకరించి వాటిపై సిమ్ కార్డులను తీసుకుంటున్న ఘటనలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. చాలామంది వినియోగదారులకు తమ పేరుతో ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయి అనే విషయం కూడా అవగాహన ఉండదు. తాము ఒక సిమ్ మాత్రమే వాడుతున్నామని భావిస్తుంటారు. మనకు తెలియకుండానే కొన్నిచోట్ల అవసరమైనప్పుడు వివరాలను ఇస్తుంటాం. అలా వ్యక్తిగత వివరాలు ఇచ్చిన చోట నుంచే స్కామర్లు మన పేరుతో కొత్త సిమ్ కార్డులను తీసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు.

ఒకే కార్డును ఉపయోగించడం ద్వారా పౌరుల గుర్తింపును రుజువుచేసేందుకు ఆధార్ కార్డ్ ప్రవేశపెట్టారు. ఈ ఆధార్ కార్డు విధానం అమల్లోకి వచ్చిన తర్వాత భారత్‌లో నివసించే ప్రతి వ్యక్తికి నిత్యావసరంగా మారింది. విమానాశ్రయాలలో అథెంటికేషన్ ప్రక్రియ కోసం లేదా మీ మొబైల్ కోసం సిమ్ కార్డ్‌లను తీసుకోవడం కామన్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఆధార్ కార్డ్‌ని ధృవీకరణ కోసం సమర్పించడం ద్వారా ఇలాంటి ఘటనలు జరగవచ్చు. అయితే, మీ గుర్తింపుకు కూడా ముప్పుగా మారింది.
సిమ్ కార్డుతో సైబర్ నేరాల ప్రమాదం :
మీరు ఏదైనా ప్రయోజనం పొందడానికి ఆధార్ కార్డ్‌ని సమర్పించినప్పుడు అది వై-ఫై కనెక్షన్ కోసం అయినా లేదా మరేదైనా కారణం అయినా అది దుర్వినియోగం అయ్యే అవకాశాలు స్వల్పంగా ఉన్నాయి. మీ ఆధార్ వివరాలను ఉపయోగించి మీ పేరు మీద ఎక్కువ సిమ్‌లను (Sim Card Owner name) జారీ చేసే మోసగాళ్లు చాలా మంది ఉన్నారు. పెరుగుతున్న ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ (DoT) మీ పేరుపై ఎన్ని సిమ్‌లు యాక్టివ్‌గా ఉన్నాయో తెలుసుకోవడానికి మీకు సాయపడేందుకు ఒక వెబ్‌సైట్‌ను ప్రారంభించింది.
అవును.. మీరు ఆశ్చర్యంగా అనిపించవచ్చు. ఇంతకీ, మీ స్మార్ట్‌ఫోన్‌లో మీరు ఎన్ని సిమ్ కార్డులను వాడుతున్నారు? మీకు తెలియకుండానే మీ పేరుతో సిమ్ కార్డులను వినియోగించే ప్రమాదం లేకపోలేదు. మీ పేరుతో మీరు వాడే సిమ్ కార్డులతో పాటు మరి ఇంకేమైనా సిమ్ కార్డులు యాక్టివ్‌గా ఉన్నాయా లేదో ఎప్పుడైనా చెక్ చేసుకున్నారా? లేదంటే.. ఇప్పుడే ఆ పనిచేయండి. ముందుగానే గుర్తించడం ద్వారా స్కామర్ల చేతికి మీ వివరాలు చిక్కకుండా కాపాడుకోవచ్చు.
ఒకవేళ చిక్కినా ఆ సమస్య నుంచి అక్కడితోనే నివారించే అవకాశం ఉంటుంది. ఒక వ్యక్తికి సాధారణంగా సింగిల్ ఐడీ ప్రూఫ్ ద్వారా మొత్తం 9 సిమ్ కార్డులను తీసుకోవచ్చు. అయితే, ఇప్పటివరకూ మీరు ఎన్ని సిమ్ కార్డులను మీ పేరుతో తీసుకున్నారు? ఒకవేళ తీసుకుంటే ఎన్ని సిమ్ కార్డులు యాక్టివ్‌గా ఉన్నాయో తెలుసుకోవచ్చు.
Sim Card Owner : మీ పేరుతో ఎన్ని సిమ్ కార్డులు యాక్టివ్‌గా ఉన్నాయంటే? :
1. tafcop.sancharsaathi.gov.in పోర్టల్‌కి వెళ్లండి.
2. ఆపై మీ మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి
3. OTPని ఎంటర్ చేసి ఆపై క్లిక్ చేయండి.
4. OTP కంట్రోలింగ్ ప్యానెల్‌కి వెళ్లడానికి “OTPని రిక్వెస్ట్ చేసేందుకు క్లిక్ చేయండి
5. మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి ధృవీకరించు ఆప్షన్ క్లిక్ చేయండి.
6. ఇప్పుడు మీరు ఆధార్‌కు జారీ చేసిన మీ పేరు/మొబైల్ నంబర్/సిమ్ కార్డ్‌ని చూడవచ్చు
ఉదాహరణకు మీరు tafcop.sancharsaathi.gov.in వెబ్‌సైట్ విజిట్ చేయడం ద్వారా మీ పేరుపై ఎన్ని సిమ్ కార్డులు యాక్టివ్‌గా ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఒకవేళ మీ పేరుపై ఉపయోగించని ఫోన్ నంబర్‌ను గుర్తించినట్లయితే.. వెబ్‌సైట్లో చెక్ బాక్స్‌లో నిర్దిష్ట నంబర్‌ను రిపోర్టు చేయాల్సి ఉంటుంది. తదుపరి సహాయం కోసం మీ సమీపంలోని టెలికాం ఆపరేటర్‌ను కూడా సంప్రదించవచ్చు. మీరు వాడని ఏదైనా ఫోన్ నెంబర్ కూడా మీ ఆధార్ వంటి వివరాలకు లింక్ అయి ఉంటే వెంటనే వాటిని మీ ఫిర్యాదు ఆధారంగా తొలగిస్తారు అధికారులు.
డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ టీఏఎఫ్‌సీఓపీ (TAFCOP) పోర్టల్ నిర్వహిస్తోంది. ఈ పోర్టల్ ద్వారా మొబైల్ కనెక్షన్‌లకు సంబంధించిన డేటాను యాక్సస్ చేయొచ్చు. మీ ఆధార్ ద్వారా మీ పేరుపై ఎన్ని మొబైల్ నెంబర్లు యాక్టివ్‌గా వెంటనే తెలుసుకోవచ్చు. మీ ప్రమేయం లేకుండా ఎవరైనా మీ గుర్తింపు ఐడీతో సిమ్ కార్డు వాడుతుంటే.. ఈ కొత్త విధానంతో తెలుసుకోవచ్చు. మీ సిమ్ నుంచి ఎలాంటి క్రైమ్ జరిగినా అందుకు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని మరిచిపోవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.