Top 5 Electric Scooters : కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం చూస్తున్నారా? అయితే, భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ కంపెనీల నుంచి అనేక సరికొత్త మోడల్ ఈవీ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఇంధన వాహనాల కన్నా ఎలక్ట్రిక్ స్కూటర్లకే ఫుల్ డిమాండ్ పెరిగింది. ప్రతిఒక్క వాహనదారులూ పర్యావరణ రహిత ఎలక్ట్రిక్ స్కూటర్లపైనే ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు ప్రజాదరణ భారీగా పెరుగుతోంది.
రాబోయే నెలల్లో భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలు మరింత జోరుందుకుంటాయని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే పలు ఈవీ స్కూటర్ తయారీ కంపెనీలు కొత్త లాంచ్‌లతో ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ గతంలో కన్నా అత్యంత బిజీగా మారిపోయింది. ఇలాంటి పరిస్థితిలో భారత మార్కెట్లో టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన ఎలక్ట్రిక్ స్కూటర్ ఎంచుకుని వెంటనే కొనేసుకోండి.
ఏథర్ రిజ్టా (Ather Rizta):
భారత మార్కెట్లో ఇటీవల లాంచ్ అయిన ఏథర్ రిజ్టా ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ మొత్తం మూడు వేరియంట్లలో వస్తుంది. మీరు అన్ని రకాల ఉపయోగాలకు వినియోగించుకునేలా డిజైన్ చేశారు. అద్భుతమైన ఫీచర్లతో కూడిన ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం చూస్తున్నారా? అయితే, ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్ కన్నా మెరుగైన ఆప్సన్ మరొకటి లేదనే చెప్పాలి. ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 1.10 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. అలాగే, ఈ ఈవీ స్కూటర్ మోడల్ 2.9 నుంచి 3.7kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో వస్తుంది. అలాగే, కంపెనీ ప్రకారం.. టాప్ మోడల్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 160 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.
ఓలా S1 ప్రో జెన్ 2 వెర్షన్ స్కూటర్ (Ola S1 Pro Gen 2 Version ) :
ఓలా కస్టమర్ల కోసం ఓలా S1 ప్రో భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ స్కూటర్. ఈ ఓలా స్కూటర్ పూర్తగా టెక్నాలజీ ఫీచర్లతో నిండిపోయింది. ఓలా ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ 4kWh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. పూర్తి ఛార్జ్‌తో 195 కిలోమీటర్ల వరకు దూసుకుపోతుంది. ఓలా S1 ప్రో జనరేషన్ 2 ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 1.30 లక్షల నుంచి (ఎక్స్-షోరూమ్) ప్రారంభమవుతుంది. ఇంకా, ఓలా ఎలక్ట్రిక్ పాత మోడళ్లతో పోల్చితే.. అనేక అప్‌గ్రేడ్స్ ఫీచర్లతో వస్తుంది. సాంప్రదాయ ఫోర్క్‌ను కూడా అందిస్తోంది.

ఏథర్ 450x (Ather 450X) :
ఏథర్ 450ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ స్కూటర్. ఈ స్కూటర్ డిజైన్ అద్భుతంగా ఉంటుంది. ఈ స్కూటర్‌లో 3.7kWh బ్యాటరీ ప్యాక్ కూడా ఉంది. ఈ స్కూటర్ ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 150 కిలోమీటర్లు దూసుకుపోతుందని కంపెనీ పేర్కొంది. అంతేకాదు.. 2.9kWh బ్యాటరీ ప్యాక్‌తో కొత్త బేస్ వేరియంట్ కలిగి ఉంది. ఏథర్ 450ఎక్స్ స్కూటర్ ధర ఇప్పుడు రూ. 1.41 లక్షలతో (ఎక్స్-షోరూమ్, బెంగళూరు) ప్రారంభమవుతుంది. అయితే, టాప్-స్పెషిఫికేషన్లతో కూడిన ఈ స్కూటర్ మోడల్ ఫుల్ ఛార్జ్ చేసిన బ్యాటరీ ప్యాక్‌పై 150 కిలోమీటర్ల సర్టిఫైడ్ పరిధిని అందిస్తుంది.
Top 5 Electric Scooters : టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ (TVS iQube ST) :
భారత మార్కెట్లో టీవీఎస్ (TVS) టాప్-స్పెషిఫికేషన్లతో సరికొత్త స్కూటర్ తీసుకొచ్చింది. టీవీఎస్ ఐక్యూబ్ ఎస్‌టీ డెలివరీలను ఇప్పటికే ప్రారంభించింది. ఈ స్కూటర్ అతిపెద్ద 5.1kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. అంతేకాదు.. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ పరిధి 145కిలోమీటర్లు దూసుకెళ్లగలదు. టీవీఎస్ ఐక్యూబ్ స్కూటర్ మరింత పాపులర్ అయింది. కంపెనీకి భారత్ అంతటా సర్వీస్ సెంటర్లు కూడా ఉన్నాయి కాబట్టి.. ఈ స్కూటర్ సర్వీస్‌ను పొందడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. టీవీఎస్ ఐక్యూబ్ ST ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రారంభ ధర రూ. 1.85 లక్షలు (ఎక్స్-షోరూమ్, బెంగళూరు) అందుబాటులో ఉంది.
సింపుల్ వన్ (Simple One) :
సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ మైలేజీ 211 కిలోమీటర్లు ఇస్తుంది. ఈ జాబితాలో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అత్యధికం. ఇంకా, ఈ మోడల్ ట్విన్ బ్యాటరీ ప్యాక్ సెటప్‌తో వస్తుంది. ఇందులో రిమూవబుల్ బ్యాటరీతో వస్తుంది. అవసరమైనప్పుడు బ్యాటరీ మార్చుకునే అవకాశం ఉంటుంది. అయితే, ఈ మోడల్ డెలివరీ సమయం కొంచెం ఎక్కువ పడుతుంది. సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రారంభ ధర రూ. 1.66 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఎక్కువ దూరం ప్రయాణం చేసే వాహనదారులకు ఇది ఆకర్షణీయమైన ఆప్షన్ అని చెప్పవచ్చు. అలాగే, ఈ సింపుల్ వన్ స్పోర్టి డిజైన్ యువతకు కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.
Read Also : Rave Party Hema Arrest : బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో ఊహించని ట్విస్ట్.. అడ్డంగా దొరికిపోయిన నటి హేమ!