Viral Video : వయస్సు నెంబర్ మాత్రమే.. ఈ 70 ఏళ్ల బామ్మ నిరూపించింది.. పెట్రోల్ బంకులో పనిచేస్తూ సొంతంగా జీవనం..!

Viral Video : పనిచేస్తే ఎలాగైనా బతకొచ్చు.. పనిలేదని, అవకాశం రాలేదని ఏదేదో కారణాలు చూపిస్తూ నేటి యువతరం ఖాళీగా కూర్చొని సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. చాలామంది కుర్రాళ్లు పనిచేసుకోగల స్థితి ఉండికూడా ఏం చేయకుండా సోమరితనంగా జీవిస్తుంటారు. ఎంత చదివినా ఉద్యోగాలు లేవని సాకు చెబుతుంటారు. జీతం సరిగా లేదని, తక్కువ జీతమని మానేసి ఖాళీగా కూర్చొని కబర్లు చెప్పేస్తుంటారు. ఎలాంటి పని లేకుండా తల్లిదండ్రుల మీదనే ఆధారపడి ఉంటుంటారు. కొంతమంది తమకు ఏది చేతకాదని చెప్పి నిరాశతో ప్రాణాలు తీసుకుంటుంటారు. ఇలాంటి యువకులకు అనేక మంది వృద్ధులు ఆదర్శంగా చెప్పవచ్చు.

పనిచేయాలనే ఆలోచన, అందుకు తగిన సంకల్పం ఉండాలే గానీ వయస్సు పెద్ద విషయం కాదు.. ఆ పని మీద సరిగా మనసు పెడితే ఎంతటి పని అయినా సునాయసంగా పూర్తి చేయొచ్చునని అంటున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియోలో కూడా అంతే.. ఒక వృద్ధురాలు ఈ వయస్సులో కూడా పనిచేస్తూ యువకులకు ఆదర్శంగా నిలుస్తోంది. పెట్రోల్ బంకులో పనిచేస్తూ ఆ వృద్ధురాలు పొట్ట వెల్లదీసుకుంటుంది. సాధారణంగా ఈ వయస్సు వచ్చేసరికి చాలామంది వృద్ధులు మా వల్ల కాదు.. ఏ పని చేయలేను.. నాకు చేతకాదు అని అంటుంటారు. పిల్లల మీదే ఆధారపడుతుంటారు. పిల్లల బాధ్యత అంటూ కాలయాపన చేయకుండా సొంతంగా పనిచేసుకుని డబ్బులు సంపాదిస్తూ జీవనం కొనసాగిస్తోంది. ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన ఈ బామ్మ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Viral Video : నేటి యువతకు ఆదర్శంగా 70 ఏళ్ల బామ్మ..

చాలామంది వృద్ధులు వయస్సు అనేది ఒక నెంబర్ మాత్రమేని నిరూపిస్తున్నారు. ఎప్పుడు ఏదో ఒక పని చేయాలనే వారిలో ఉత్సాహం కనిపిస్తోంది. బతకడానికి ఏదో ఒక పనిచేసుకోవడం పెద్ద కష్టం కాదని చెప్పవచ్చు. కేరళలో 70 ఏళ్ల వయస్సు ఉన్న వృద్ధురాలు కూడా వయస్సు సహకరించిక పోయినా పనిచేసేందుకు ఏది తనకు ఇబ్బంది లేదని నిరూపించింది. ముసలి వయస్సులో కూడా కడక్‌లోని పెట్రోల్‌ బంకులో పగలు రాత్రి అనే తేడా లేకుండా పనిచేస్తూ కుటుంబ సభ్యులకు భారం కాకుండా తన కష్టం మీదనే జీవనం సాగిస్తోంది.

This Old woman works at petrol bunk for financial life in telugu video viral
This Old woman works at petrol bunk ( Image Source : Instagram)

కేరళకు చెందిన ఫోటోగ్రాఫర్ పొన్ను సూర్య (@పొన్నుసూర్యర్) ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో ఈ వీడియోను షేర్ చేశాడు. దాదాపు 70 ఏళ్ల వయస్సు ఉన్న వృద్ధురాలు పెట్రోల్ బంకులో పనిచేస్తూ కనిపించింది. అక్కడి పెట్రోల్ బంకులో వచ్చే పోయే వాహనాలకు పెట్రోల్, డీజిల్ నింపుతోంది. బామ్మ ఈ వయస్సులో కూడా పనిచేస్తున్న తీరు అందరి హృదయాలను కదిలిస్తోంది. ఇటీవీల షేర్ చేసిన ఈ వీడియోకు 4.2 మిలియన్ల వ్యూస్ రాగా 40 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. వయస్సుతో సంబంధం లేకుండా కష్టపడుతున్న ఈ బామ్మ అందరికి స్ఫూర్తిగా నిలుస్తుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Read Also : Renu Desai Aadhya : అసలు మీరు మనుషులేనా.. నా కూతురు ఏడుపు మీకు కచ్చితంగా తగులుతుంది.. రేణూ దేశాయ్ పోస్టు వైరల్!