Best Home Loans : మీరు హోమ్ లోన్ కోసం చూస్తున్నారా? హౌజింగ్ లోన్ అందించే టాప్ 5 బెస్ట్ బ్యాంకులివే

Best Home Loans : హోమ్ లోన్ తీసుకోవాలని అనుకుంటున్నారా? హౌసింగ్ లోన్ ఏ బ్యాంకులో తీసుకుంటే బాగుంటుంది అని ఆలోచిస్తున్నారా? ప్రస్తుతం అనేక బ్యాంకులు హోమ్ లోన్ అందిస్తున్నాయి. అందులో కొన్ని బ్యాంకులు మాత్రమే సరసమైన హోమ్ లోన్ అద్భుతమైన వడ్డీలతో అందిస్తున్నాయి. వాస్తవానికి గృహ రుణం అనేది బ్యాంకులను బట్టి మారుతుంటుంది. సాధారణంగా బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFCs) గృహ రుణాలను ఇస్తుంటాయి. ఎవరైనా వ్యక్తి ఒక ఇంటిని లేదా ప్రాపర్టీలను కొనుగోలు చేసేందుకు బ్యాంకు కొలేటరల్‌గా అందిస్తుంది. రుణ నిబంధనలపై ఆధారపడి, రుణగ్రహీత తప్పనిసరిగా లోన్ బ్యాలెన్స్‌తో పాటు వడ్డీని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఈఎంఐ మాదిరిగా నెలవారీగా చెల్లించాల్సి ఉంటుంది. హోమ్ లోన్ తీసుకోవడానికి టాప్ 5 బెస్ట్ బ్యాంకుల (Top 5 Best Banks for Home Loans) గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఎస్బీఐ హోమ్ లోన్ (SBI Home Loan) :
మీరు ఎస్బీఐలో హోమ్ లోన్ తీసుకువాలని అనుకుంటున్నారా? భారత్‌లో హోమ్ లోన్ కోసం అన్ని బ్యాంకుల్లో ఎస్బీఐ బెస్ట్ బ్యాంకుగా చెప్పవచ్చు. ఈ బ్యాంకులో ఆఫర్ వడ్డీ రేటు ఏడాదికి 8.05 శాతం నుంచి 8.55శాతం వరకు అందిస్తుంది. 30 ఏళ్ల వరకు రుణం చెల్లించేందుకు సమయాన్ని పొడిగించుకునే అవకాశం ఉంది. అంతేకాదు.. తీసుకున్న లోన్ సౌకర్యవంతమైన రీపేమెంట్ చేసే వెసులుబాటు కూడా ఉంటుంది. హోమ్ లోన్ ప్రాసెసింగ్ ఫీజు లోన్ మొత్తంలో 0.35శాతం అంటే.. గరిష్టంగా జీఎస్టీతో కలిపి రూ. 10వేలు ఉంటుంది.

2. హెచ్‌డీఎఫ్‌సీ హోమ్ లోన్ (HDFC Home Loan) :
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో హోమ్ లోన్ తీసుకునేవారు ఏడాదికి 8.60శాతం నుంచి 9.50శాతం వడ్డీతో సరసమైన గృహ రుణాన్ని పొందవచ్చు. 30 ఏళ్ల వరకు లోన్ కాలవ్యవధి పొడిగింపు ఎంపిక కూడా అందిస్తుంది. లోన్ ప్రాసెసింగ్ రుసుము లోన్ మొత్తంలో 0.50శాతం లేదా రూ. 3వేలు వరకు ఉంటుంది. అంటే.. ఇందులో ఏది ఎక్కువ అయితే పన్నులు వర్తిస్తాయి.

3. యాక్సిస్ బ్యాంక్ హౌజింగ్ లోన్ (Axis Bank Housing Loan) :
యాక్సిస్ బ్యాంక్‌లో హోమ్ (హౌజింగ్) లోన్ తీసుకునే కస్టమర్లు ప్రతి ఏడాదికి 7.60 శాతం నుంచి 8.05 శాతం వడ్డీతో గృహ రుణాలను అందిస్తుంది. 30 ఏళ్ల వరకు హోమ్ లోన్ కాలవ్యవధి పొడిగింపు ఆప్షన్ కూడా అందిస్తుంది. అంతేకాదు.. లోన్ ప్రాసెసింగ్ ఫీజు కనిష్టంగా రూ. 10వేలు లోన్ మొత్తంలో ఒక శాతం వరకు ఉంటుంది. అడ్వాన్స్ ప్రాసెసింగ్ రుసుము జీఎస్టీతో కలిపి రూ. 2,500 వరకు అందిస్తుంది.

4. ఐసీఐసీఐ హోమ్ లోన్ (ICICI Home Loan) :
ఐసీఐసీఐ బ్యాంకులో హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటే.. మీరు ఏడాదికి 8.40శాతం నుంచి 9.45 శాతం వరకు ప్రారంభ వడ్డీని అందిస్తుంది. 30 ఏళ్ల వరకు రుణకాల వ్యవధి పొడిగింపు ఆప్షన్ కూడా అందిస్తుంది. మీ హోమ్ లోన్ ప్రాసెసింగ్ రుసుము లోన్ మొత్తంలో జీఎస్టీతో కలిపి 1.00శాతం వరకు అందిస్తుంది.

5. బ్యాంక్ ఆఫ్ బరోడా హోమ్ లోన్ (Bank of Baroda Home Loan) :
మీరు హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటే.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఏడాదికి 7.45 శాతం నుంచి 8.80 శాతం వడ్డీ అందించే బెస్ట్ హోమ్ లోన్లలో ఒకటిగా చెప్పవచ్చు. 30 ఏళ్ల వరకు లోన్ కాలవ్యవధిని పొడిగించుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. అంతేకాదు.. లోన్ ప్రాసెసింగ్ రుసుము లోన్ మొత్తంలో 0.50శాతం వరకు ఉంటుంది. అంటే.. గరిష్టంగా జీఎస్టీతో కలిపి రూ. 7,500కు చెల్లించాల్సి ఉంటుంది.

భారత్‌లో గృహ రుణం అంటే ఏంటి? :

హోమ్ లోన్ అనేది బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు అందించే ఆర్థిక సాయం. బ్యాంకులు అందించే లోన్ మొత్తంతో ఇంటిని కొనుగోలు చేయడానికి వినియోగించుకోవచ్చు. అయితే, నిర్దిష్ట కాలవ్యవధిలో నిర్దిష్ట హోమ్ లోన్ అర్హత ప్రమాణాలతో హోమ్ లోన్‌ను పొందవచ్చు. బ్యాంకు వడ్డీ రేట్ల ప్రకారం.. వడ్డీతో పాటు పదవీ కాలంలో తీసుకున్న మొత్తం రుణాన్ని తప్పనిసరిగా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఇతర లోన్ల మాదిరిగానే హోమ్ లోన్‌ను నెలవారీ ఈఎంఐ పద్ధతిలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. చాలావరకూ బ్యాంకులు గృహ రుణాలను అందిస్తాయి. మీకు రెడీమేడ్ గృహాలను కొనుగోలు చేసేందుకు సాయపడతాయి. అంతేకాదు.. ఇంటి నిర్మాణం మొదలైనప్పటి నుంచి పూర్తి అయ్యేవరకు విడతలవారీగా లోన్ అందిస్తాయి. మీరు ఇల్లు పునర్నిర్మాణం చేసినా కూడా హోమ్ లోన్‌లను పొందవచ్చు.

హోమ్ లోన్‌తో కలిగే ప్రయోజనాలివే :
మీరు హోమ్ లోన్‌ తీసుకుంటే కలిగే ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం.

పన్ను (Tax) : గృహ రుణం వడ్డీ, అసలు మొత్తంపై ఆదాయపు పన్ను మినహాయింపులను క్లెయిమ్ చేసుకోవచ్చు. ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం.. సెక్షన్ 80సి ప్రకారం.. ప్రధాన చెల్లింపులపై రూ. 1.5 లక్షల వరకు పొందవచ్చు. సెక్షన్ 24బీ కింద వడ్డీ చెల్లింపులపై రూ. 2 లక్షల వరకు క్లెయిమ్ చేయవచ్చు. మీరు హోమ్ లోన్ ద్వారా ఇతర పన్ను ప్రయోజనాలను కూడా పొందవచ్చు.

వడ్డీ రేటు (Interest Rate) : ఇతర బ్యాంకుల రుణాలతో పోలిస్తే.. హోమ్ లోన్‌పై వడ్డీ రేటు చాలా తక్కువగా ఉంటుంది. మీ దగ్గర నగదు కొరత ఉంటే.. ఇప్పటికే ఉన్న హోమ్ లోన్‌తో పాటు టాప్-అప్ లోన్ కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

Best Home Loans _ top 5 best banks for home loans in India 2024 1
Top 5 best banks for home loans

ఆస్తుల ధృవీకరణ : మీరు హోమ్ లోన్ కోసం దరఖాస్తు చేసినప్పుడు.. బ్యాంకులు చట్టపరంగా మీ ఆస్తిని పరిశీలిస్తాయి. మీ ఇంటి పత్రాలు చెల్లుబాటు అవుతాయా? లేదా అని టైటిల్ స్పష్టంగా ఉన్నాయని నిర్ధారించుకోవాలి. తద్వారా ఎలాంటి స్కామ్‌ల బారిన పడకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. ఆస్తిని ధృవీకరించిన తర్వాత బ్యాంకులు లోన్ ఇచ్చేందుకు ముందుకు వస్తాయి.

హోమ్ లోన్ విషయంలో తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశాలివే :
హోమ్ లోన్ అంటే ఏమిటో తెలుసుకోవడమే కాకుండా, అందించే వివిధ రకాల హోమ్ లోన్‌లలో సరైన ఆప్షన్ ఎలా ఎంచుకోవాలో తెలుసుకోవడం ముఖ్యం. మీ అవసరాలకు అనుగుణంగా హోమ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అంశాలను తప్పనిసరిగా తెలుసుకోవాలి.

వడ్డీ రేటు : మీరు ఏ రకమైన హోమ్ లోన్ వడ్డీ రేటును పొందుతున్నారో అర్థం చేసుకోవాలి. వేరియబుల్ వడ్డీ రేటు, స్థిర వడ్డీ రేటుకు మధ్య లోన్ చెల్లించే వ్యవధిలో మార్పులు ఉండవచ్చు.

లోన్ చెల్లించే వ్యవధి : హోమ్ లోన్ వ్యవధి ముఖ్యమైనది. గడువు తేదీలో ప్రతి నెలా చెల్లించాల్సిన ఈఎంఐ మొత్తాలను సూచిస్తుంది. మీరు కచ్చితమైన కాలవ్యవధిని తెలుసుకోవాలి. తదనుగుణంగా మీ ఫైనాన్స్‌లను ప్లాన్ చేసుకోవాలి.

అప్లికేషన్ : హై డాక్యుమెంటేషన్ లేకుండా సరళమైన అప్లికేషన్ ప్రాసెస్‌ కలిగిన హోమ్ లోన్‌ని ఎంచుకోవచ్చు. మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవడం ద్వారా తొందరగా హోమ్ లోన్‌ అందించే ఆప్షన్ ఎంచుకోవాలి.

సాధారణ హోమ్ లోన్ దరఖాస్తు ప్రక్రియ :
మీరు హోమ్ లోన్ పొందాలంటే ముందుగా మీ అర్హతను బ్యాంకులు చెక్ చేస్తాయి. హోమ్ లోన్‌కు అర్హత అనేది మీ రీపేమెంట్ చేసే విధానంపై ఆధారపడి ఉంటుంది. మీ నెలవారీ ఆదాయం, నెలవారీ ఖర్చులు, ఇతర చెల్లింపులు మొదలైన వాటి ఆధారంగా మీరు చెల్లించగలరో లేదో బ్యాంకులు నిర్ణయిస్తాయి. మీరు సకాలంలో రుణ వాయిదాలను చెల్లించగలరని బ్యాంకులు భావిస్తుంటాయి.

హోమ్ లోన్ దరఖాస్తుదారుడి వయస్సు, కుటుంబ పరిస్థితిని కూడా బ్యాంకులు పరిగణనలోకి తీసుకుంటాయి. చాలా మంది డిపెండెంట్‌లతో ఉన్న ఎవరైనా ప్రతి నెల లోన్ ఖర్చులను తీర్చలేకపోవచ్చు. దీనితో పోలిస్తే.. డిపెండెంట్లు లేని యువ దరఖాస్తుదారుడు ఎవరైనా హోమ్ లోన్ తిరిగి చెల్లించడానికి వారి నెలవారీ ఆదాయంలో అధిక మొత్తాన్ని వెచ్చించవచ్చు.

మీ అర్హతను బ్యాంకులు లేదా ఫైనాన్స్ కంపెనీలు పరిగణనలోకి తీసుకున్న తర్వాత మీ ఆస్తి విలువను పరిగణనలోకి తీసుకుంటాయి. సాధారణంగా, గృహ రుణాలు సురక్షిత రుణాలుగా చెప్పవచ్చు. మీరు రుణం తిరిగి చెల్లించే వరకు మీ ఆస్తి సంబంధిత పత్రాలు బ్యాంకుల వద్ద ఉంటాయి. దరఖాస్తుదారు ఆస్తిని పొందవచ్చు. కానీ, డిఫాల్ట్ అయితే మాత్రం.. బ్యాంక్ ఆస్తిని స్వాధీనం చేసుకుంటుంది. సాధారణంగా ఆస్తి విలువకు ముందుగా నిర్ణయించిన రుణాన్ని మాత్రమే బ్యాంకులు అందిస్తాయి. ఉదాహరణకు.. ఆస్తి విలువకు రుణం 75శాతం అయితే.. ఆస్తి విలువలో 75శాతం నిధులను బ్యాంక్ అందిస్తుంది. ఆ తర్వాత, బ్యాంకులు హోమ్ లోన్ మొత్తాన్ని అందిస్తాయి.

హోమ్ లోన్ కోసం ఎలా దరఖాస్తు చేయాలంటే? :
హోమ్ లోన్ దరఖాస్తు ప్రక్రియ చాలా ఈజీగా ఉంటుంది. హోమ్ లోన్ దరఖాస్తు చేయాలనుకుంటున్న బ్యాంకును ఎంచుకోవాలి. వివిధ బ్యాంకులు గృహ రుణాలకు వేర్వేరు వడ్డీ రేట్లను అందిస్తుంటాయి. హోమ్ లోన్ కోసం ఒకటి కన్నా ఎక్కువ బ్యాంకులను ఎంచుకోవాలి. ఒకవేళ ఏదైనా బ్యాంకులో రుణం అందకపోతే.. మరో బ్యాంకును సంప్రదించవచ్చు. ప్రతి బ్యాంకుకు సొంత రుణ దరఖాస్తు ప్రక్రియ ఉంటుంది. దరఖాస్తులను బ్యాంక్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో చేయవచ్చు లేదా బ్యాంక్ శాఖలో ఆఫ్‌లైన్‌లో చేయవచ్చు. రెండు సందర్భాల్లోనూ ఒక ఫారమ్‌ను నింపడంతో పాటు సంబంధిత పత్రాలను దానికి జత చేయాల్సి ఉంటుంది. హోమ్ లోన్ పొందడానికి అవసరమైన కొన్ని డాక్యుమెంట్‌లను ఇప్పుడు తెలుసుకుందాం.

  • నివాస రుజువు
  • గుర్తింపు రుజువు
  • గత 3 ఏళ్లలో ఆదాయపు పన్ను రిటర్న్స్
  • 6 నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు
  • ఆస్తి రిజిస్ట్రేషన్ పత్రాలు

మీ డాక్యుమెంట్‌ల ఆధారంగా, మీరు హోమ్ లోన్‌కి అర్హులా కాదా అనేది బ్యాంకులు నిర్ణయిస్తాయి. మీ నెలవారీ వాయిదాలను బ్యాంక్ నిర్ణయిస్తుంది. మీ దరఖాస్తును ఆమోదించిన తర్వాత మొత్తం రుణం మీ బ్యాంకు అకౌంట్‌లో జమ అవుతుంది. హోమ్ లోన్ తీసుకున్న తర్వాత నుంచి ఎంచుకున్న కాల వ్యవధిలో ఈఎంఐ పద్ధతిలో నెలవారీగా చెల్లించాల్సి ఉంటుంది. మీరు ఎంచుకున్న కాలానికి అనుగుణంగా వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. వడ్డీతో పాటు కలిపి మొత్తాన్ని నెలవారీ వాయిదా పద్ధతిలో గృహ రుణం అందించిన బ్యాంకులకు చెల్లించాల్సి ఉంటుంది. మీరు ఉద్యోగులైతే మీ నెలవారీ వేతనంలో నుంచి నేరుగా బ్యాంకు అకౌంట్లో ఈఎంఐ వాయిదాను డెబిట్ అయ్యేలా ఎంచుకోవచ్చు. లేదంటే సంబంధిత బ్యాంకుకు వెళ్లి కూడా ప్రతి నెలా మీ ఈఎంఐ మొత్తాన్ని వాయిదాలుగా చెల్లించవచ్చు.

Read Also :  Cheapest Car Insurance : 2024లో చౌకైన కారు ఇన్సూరెన్స్ కోసం చూస్తున్నారా? బెస్ట్ కారు బీమా రేట్ల కోసం 5 అద్భుతమైన టిప్స్!

Leave a Comment