Gold Rates Today : బంగారం కొనేవారికి బిగ్ షాక్.. బంగారం, వెండి ధరలు తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగాయి. వరుసగా కొన్నిరోజులు తగ్గిన బంగారం ధరలు మే 28న మరోసారి స్వల్పంగా పెరిగాయి. ఈరోజు బంగారం ధర కాస్తా రూ.250కిపైగా పెరిగింది. ఇక, అంతర్జాతీయ మార్కెట్లలోనూ బంగారం ధరలు భారీగానే పెరిగాయి. మరోవైపు వెండి ధరలు ఏకంగా రూ. 1500కి పైగా పెరిగాయి. గత కొన్నిరోజులుగా ఆల్ టైం గరిష్ట స్థాయికి చేరిన బంగారం ధరలు స్వల్పంగా తగ్గగా, బంగారం ప్రియులకు మళ్లీ షాక్ ఇచ్చింది.
నేడు బంగారం ధర 10 గ్రాములకు రూ.250కిపైగా పెరిగింది. కిలో వెండి ధర రూ.1500 పెరిగింది. భారత మార్కెట్లో ప్రస్తుతం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,650 ఉండగా, స్వచ్ఛమైన బంగారం 24 క్యారెట్ల ధర రూ.72,710గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని మెట్రో నగరాలతోపాటు దేశంలోని ఇతర నగరాల్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నేడు బంగారం, వెండి ధరలు వివరాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Gold Rates Today : ప్రపంచ మార్కెట్లో బంగారం ధరలు :
ప్రపంచ బులియన్ మార్కెట్లో గోల్డ్ ధరలు రికార్డ్ స్థాయి దిశగా దూసుకెళ్తున్నాయి. నేటి స్పాట్ బంగారం ధర ఔన్సుకు 2351 డాలర్ల వద్దకు చేరుకుంది. అలాగే, స్పాట్ సిల్వర్ ధర కూడా ఔన్సుకు 31.64 డాలర్లకు చేరింది. ఈ క్రమంలో మన దేశీ కరెన్సీ రూపాయి విలువ భారీగా పడిపోయింది. ప్రస్తుతం డాలర్ విలువ రూ. 83.138 వద్ద ట్రేడ్ అవుతోంది.
రూ.250 పెరిగిన బంగారం ధరలు :
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు మరోసారి భారీగా పెరిగాయి. 24 క్యారెట్లు 10గ్రాముల బంగారం ధరలు రూ. 270 పెరగడంతో రూ. 72, 710 వద్దకు ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా, 22 క్యారెట్ల బంగారం 10గ్రాముల ధర తులానికి రూ. 250 పెరిగింది. దాంతో బంగారం ధర రూ.66,650 వద్దకు చేరింది. దేశ రాజధాని ఢిల్లీ బులియన్ మార్కెట్లో కూడా 22 క్యారెట్లు 10గ్రాముల బంగారం ధరలు ఈరోజు తులానికి రూ. 250 పెరిగింది. దాంతో నేటి బంగారం ధర ఒక్కసారిగా రూ. 66,800కి చేరింది. బంగారం ధరల్లో 24 క్యారెట్ల విలువైన స్వచ్ఛమైన 10 గ్రాముల గోల్డ్ ధర ధర రూ. 270 పెరగడం ద్వారా రూ. 72, 860కు చేరుకుంది.

రూ.1500 పెరిగిన వెండి ధరలు :
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కిలో వెండి ధరలు రూ. 1500పైకి చేరింది. కిలో వెండి ధర ప్రస్తుతం రూ. 97,500కి చేరుకుంది. దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో కిలో వెండి ధర చూస్తే.. రూ.1500 పెరిగింది. దాంతో రూ. 93,000కి చేరింది. అయితే, స్థానిక బంగారం పన్నులను బట్టి వివిధ ప్రాంతాల్లో బంగారం, వెండి ధరల్లో తేడాలు ఉంటాయని గమనించాలి. వెండి ధరలపై ఎలాంటి పన్నులు ఉండవనే చెప్పాలి. అన్ని పన్నులతో కలిపి బంగారం, వెండి ధరలు మరింత పెరిగే ఛాన్స్ కనిపిస్తోంది. మార్కెట్ విశ్లేషకుల అంచనాలను పరిశీలిస్తే.. బంగారం ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. రానున్న రోజుల్లో బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. 2024 ఏడాది ఆఖరికి బంగారం ధరలు రూ.70వేల మార్క్ దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు :
తెలంగాణలోని హైదరాబాద్ సిటీ 22 క్యారెట్లు గోల్డ్ 10 గ్రాముల ధర రూ. 66,660గా ట్రేడ్ అవుతోంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 72,720గా ఉంది. ఏపీలోని ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖపట్నంలోనూ బంగారం ధరలు ఒకేలా ఉన్నాయి. ఇక వెండి ధరల విషయానికి వస్తే.. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.3,500 పెరిగి రూ.1,01,000 వద్ద కొనసాగుతోంది. అదేవిధంగా విజయవాడ, వైజాగ్ నగరాల్లో కూడా వెండి ధరలు ఇదే ధరతో కొనసాగుతున్నాయి.
దేశీయ ప్రధాన నగరాల్లో బంగారం ధరలు :
22 క్యారెట్లు 10గ్రాముల బంగారం ధరలు బెంగళూరు నగరంలో రూ.66,650గా ఉండగా, చెన్నై నగరంలో రూ.67,200, ముంబై నగరంలో రూ.66,650, దేశ రాజధాని ఢిల్లీలో రూ.66,800గా నమోదయ్యాయి. అదేవిధంగా కోల్‌కతాలో బంగారం ధర రూ.66,650గా ఉంది. కేరళలో రూ. 66,650గా నమోదైంది. ఇతర నగరాల్లో 24 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర బెంగళూరులో రూ. 72,720 ఉండగా, చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధరలు రూ. 73,320గా నమోదయ్యాయి. ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,720, ఢిల్లీలో బంగారం ధర రూ. 72,870, కోల్‌కతాలో బంగారం ధరలు రూ. 72,720, కేరళలో బంగారం ధరలు రూ. 72,720గా నమోదయ్యాయి.
వెండి ధరలను పరిశీలిస్తే.. నేడు వెండి ధరలు స్వల్పంగా పెరుగుదల కనిపించింది. కిలో వెండి ధర రూ.1500 పెరగడంతో హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 97,600గా నమోదైంది. కోల్‌కతాలో కూడా వెండి ధర రూ. 93,100గా ఉండగా, బెంగళూరులో కిలో వెండి ధర రూ. 93,350గా నమోదైంది.
Note : బంగారం, వెండి ధరలు కచ్చితమైనవి కావు.. కేవలం అంచనా మాత్రమే.. బంగారానికి సంబంధించి సేకరించిన సమాచారం మేరకు ఈ ధరల వివరాలను అందించడం జరిగింది. ఈ బంగారం ధరల్లో జీఎస్టీ, మేకింగ్ ఛార్జీలతో కలిపి ప్రాంతాన్ని బట్టి హెచ్చుతగ్గులు ఉండవచ్చు.
Read Also : Gold Price Today : బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ఎంత తగ్గిందంటే?