Become Successful Youtuber : 2024లో సక్సెస్‌ఫుల్ యూట్యూబర్‌ అవ్వడం ఎలా? ఛానల్ ద్వారా ఎన్ని మార్గాల్లో డబ్బు సంపాదించవచ్చు?

How to Become Successful Youtuber : యూట్యూబ్ ఛానెల్‌ స్టార్ట్ చేయాలని చూస్తున్నారా? అయితే, మీకు ఆల్ ది బెస్ట్.. ఎందుకంటే.. మిలియనీర్లందరూ ఇప్పటికే ప్లాట్‌ఫారమ్‌లో స్థిరపడిపోయారు. కొత్తగా ఛానెల్ మొదలుపెట్టి రాత్రికి రాత్రే యూట్యూబ్ సంచలనంగా మారడం చాలా అరుదు. మీరు ఛానెల్‌తో ఏం చేయలేరని కాదు. దీనికి చాలా సమయం పడుతుంది. ఇప్పుడు యూట్యూబ్‌లో సక్సెస్ అయిన యూట్యూబర్లు ఒకేసారి ఈ స్థాయికి వచ్చినవాళ్లు కాదు.. ఎన్నో ఏళ్ల నుంచి కష్టపడితే ఈ స్థాయికి చేరుకున్నారు.

అందుకే, ఛానల్ మొదలుపెట్టే ముందు అన్ని దృష్టిలో పెట్టుకోవాలి. చాలా ఓపిక, సహనం, ఓర్పు తప్పక ఉండాలి. ఒక వీడియో పెట్టగానే వ్యూస్ రాలేదని నిరుత్సాహపడొద్దు. అలానే కంటెంట్ పెడుతూ పోండి. ఏదో ఒకరోజు మీ ఛానల్ ఆశించిన స్థాయికి వెళ్లవచ్చు. అసలు యూట్యూబర్ అంటే ఏంటి? ఇప్పటివరకూ సక్సెస్ అయినవారిలో యూట్యూబర్లు ఎంత సంపాదిస్తున్నారు? కొత్త యూట్యూబర్లు ఎంతకాలంలో ఎన్ని మార్గాల్లో డబ్బులు సంపాదించవచ్చు? అనే విషయాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

యూట్యూబర్ అంటే ఏమిటి? :
యూట్యూబర్ అనేది వీడియో-షేరింగ్ ప్లాట్‌ఫారమ్ యూట్యూబ్‌లో వీడియోలను పబ్లీష్ చేసే కంటెంట్ క్రియేటర్. యూట్యూబర్‌లు గేమింగ్, టెక్నాలజీ, కామెడీ, మ్యూజిక్, ఎడ్యుకేషన్ వంటితో సహా వివిధ అంశాలపై వీడియోలను క్రియేట్ చేసుకోవచ్చు. అంతేకాదు.. యాడ్స్, స్పాన్సర్‌షిప్‌లు, సరుకుల విక్రయాలు, ఫ్యాన్స్ డొనేషన్ల ద్వారా కూడా డబ్బు సంపాదించవచ్చు.

యూట్యూబర్ ఎంత సంపాదిస్తాడు? ఎన్ని మార్గాల్లో డబ్బు సంపాదించవచ్చు :

యాడ్ రెవిన్యూ : యూట్యూబ్ వీడియోల నుంచి వచ్చే యాడ్ రెవిన్యూలో కొంత భాగాన్ని క్రియేటర్లతో షేర్ చేస్తుంది. వీక్షకుడి లొకేషన్, అడ్వైటైజర్లు, యాడ్స్ టైప్ వంటి అనేక అంశాలను బట్టి ఒక్కో వీక్షణకు వచ్చే డబ్బు మొత్తం మారుతుంది. సగటున, యూట్యూబర్‌లు ఒక్కో యాడ్ వ్యూకు దాదాపు 0.018 డాలర్ల వరకు సంపాదిస్తారు.

స్పాన్సర్‌షిప్‌లు : బ్రాండ్‌లు వీడియోలలో తమ ప్రొడక్టులు లేదా సర్వీసులను ప్రమోట్ చేయడానికి తరచుగా యూట్యూబర్‌లకు చెల్లిస్తాయి. యూట్యూబ్ ఛానెల్ సైజు, యూజర్ల ఎంగేజ్‌మెంట్ ఆధారంగా స్పాన్సర్‌షిప్‌ల నుంచి చాలావరకు సంపాదించుకోవచ్చు.

ప్రొడక్టుల విక్రయాలు : యూట్యూబర్‌లు దుస్తులు, అప్లియెన్సెస్, డిజిటల్ ప్రొడక్టుల వంటి వారి సొంత వస్తువులను విక్రయించవచ్చు. సరుకుల విక్రయాల నుంచి ఆర్జించిన లాభం గణనీయంగా ఉంటుంది. ముఖ్యంగా ఎక్కువ మంది, ఎంగేజ్ ఉన్న ప్రేక్షకులతో యూట్యూబర్‌లకు ఇది మరిన్ని డబ్బులను సంపాదించి పెడుతుంది.

ఫ్యాన్ డొనేషన్లు : యూట్యూబర్లు ఫ్యాన్ డొనేషన్ల ద్వారా డబ్బులు సంపాదింవచ్చు. ప్రధానంగా యూట్యూబ్ సూపర్ చాట్, (YouTube Super Chat), (Patreon) వంటి ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా యూట్యూబర్‌లు ఫ్యాన్స్ నుంచి విరాళాలను స్వీకరించవచ్చు. నమ్మకమైన అభిమానులతో కూడిన యూట్యూబర్‌లకు ఇది ముఖ్యమైన ఆదాయ వనరుగా చెప్పవచ్చు.

అఫ్ఫిలియేట్ మార్కెటింగ్ (Affiliate marketing) : యూట్యూబర్‌లు అప్ఫిలియేట్ లింక్‌ల ద్వారా ప్రొడక్టులు లేదా సర్వీసులను ప్రమోట్ చేయవచ్చు. వారి లింక్‌ల ద్వారా ప్రతి విక్రయానికి కమీషన్‌ను పొందవచ్చు. ఎక్కువ మంది, ఎంగేజ్ ఉన్న ప్రేక్షకులతో యూట్యూబర్‌ల కోసం కంటెంట్‌ను మానిటైజ్ చేయడానికి లాభదాయకమైన మార్గంగా చెప్పవచ్చు.

యూట్యూబర్‌ ఎక్కువ డబ్బులు ఎప్పుడు సంపాదించగలరంటే? :
సాధారణంగా, ఎక్కువ మంది ఎంగేజ్ అయ్యే ప్రేక్షకులతో యూట్యూబర్‌లు గణనీయంగా డబ్బు సంపాదించగలరు. అయితే, విజయవంతమైన యూట్యూబ్ ఛానెల్‌ని రూపొందించడానికి సమయం, కృషి, అంకితభావం చాలా అవసరమని గమనించాలి.

  • ఛానెల్ సైజు : యూట్యూబ్ ఛానెల్ ఎక్కువ సంఖ్యలో సబ్‌స్క్రైబర్‌లు, మిలియన్ల వ్యూస్ ఉన్న యూట్యూబర్‌లు సాధారణంగా ఎక్కువ డబ్బు సంపాదిస్తారు.
  • యూజర్ ఎంగేజ్‌మెంట్ :  హైయూజర్ ఎంగేజ్‌మెంట్ కలిగిన యూట్యూబర్‌లు స్పాన్సర్‌షిప్‌లను ఆకర్షించే యాడ్స్, ప్రొడక్టుల విక్రయాల నుంచి డబ్బు సంపాదించడానికి ఎక్కువ అవకాశం ఉంది.
  • వీడియో టైప్ : ట్యుటోరియల్స్, ప్రొడక్టు రివ్యూలు వంటి కొన్ని రకాల వీడియోలు ఇతర వాటి కన్నా ఎక్కువ యాడ్ రెవిన్యూని అందిస్తాయి.
  • కంటెంట్ కేటగిరీ : గేమింగ్, బ్యూటీ వంటి యూట్యూబర్‌లు ఇతర కేటగిరీ ఉన్నవారి కన్నా ఎక్కువ డబ్బు సంపాదించగలరు.

యూట్యూబ్ ఛానెల్‌లో ఏ కంటెంట్ ఇస్తారో నిర్ధారించుకోండి :
యూట్యూబ్‌లో అనేక రకాల కంటెంట్ అందుబాటులో ఉంటుంది. హౌ-టు వీడియోలు, ఫన్నీ వీడియోలు, మూవీ రివ్యూల వరకు చాలానే ఉంటాయి. మీ ఛానెల్‌లో (విద్యాపరమైన, వినోదాత్మకమైన లేదా స్ఫూర్తిదాయకమైన) ఏ రకమైన కంటెంట్‌ను అందించాలనుకుంటున్నారో ముందుగా ఎంచుకోవాలి. అదే లక్ష్యంతో ముందుకు సాగాలి. అలాంటి వీడియోలపైనే ఫోకస్ చేయాలి. అది మీ ఛానల్ బ్రాండ్ వాల్యూను పెంచుతుంది. ఆయా వీడియోలను ఎలా ప్రత్యేకంగా క్రియేట్ చేయవచ్చో ప్రయత్నించండి.

ఉదాహరణకు.. టెక్నాలజీ కంటెంట్ అయితే.. లేటెస్ట్ టెక్ అప్‌డేట్స్ అందించే టెక్ నిపుణుడిగా మారవచ్చు. మీ ఛానెల్‌లో వాటి గురించి వీడియోలను క్రియేట్ చేయొచ్చు. యూట్యూబర్‌గా ఎల్లప్పుడూ మీ ప్రేక్షకులకు అవసరమైన కంటెంట్ మాత్రమే చూపాలి. ఎందుకంటే.. మీ ఛానల్ పట్ల ప్రేక్షకుల్లో విశ్వాసాన్ని పెంచుతుంది. తద్వారా మీ వీక్షకులతో కనెక్ట్ అయ్యేలా చేస్తుంది.

యూట్యూబ్ ఛానెల్ కోసం ముందుగా ప్లాన్ చేసుకోండి :
మీ కంటెంట్ ప్లాన్‌తో పాటు మీరు ఛానెల్ క్రియేషన్ గురించి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోండి. మీరు యూట్యూబ్ ఛానెల్ ఎందుకు క్రియేట్ చేస్తున్నారు? ఫ్యాషన్ కోసమా? డబ్బులో కోసమా? అనేది నిర్ధారించుకోండి. దానికి అనుగుణంగా ప్రమాణాలకు కట్టుబడి ఉండాలి. మీరు క్వాలిటీ వీడియోలను రూపొందించే డివైజ్‌‌లను సిద్ధం చేసుకోండి. మీ యూట్యూబ్ ఛానెల్‌ని క్రియేట్ చేయడానికి పూర్తి చేయాల్సిన చెక్‌లిస్ట్‌గా చెప్పవచ్చు. ఉదాహరణకు.. హై క్వాలిటీ కెమెరా, మైక్రోఫోన్, లైట్-రింగ్, రికార్డింగ్ సాఫ్ట్‌వేర్ వంటివి అవసరం. ఛానల్ ప్రారంభంలో రెవిన్యూ ఉండదు కావునా.. తక్కువ బడ్జెట్‌లో మీ ఫోన్ కెమెరాలతో మొదలుపెట్టండి చాలు. మీ ఛానెల్‌లో పోస్టింగ్ షెడ్యూల్ కోసం ఒక టైమ్‌లైన్‌ను సెట్ చేసుకోండి. మీ కంటెంట్ కోసం మంచి టాపిక్స్ సేకరించండి. ఆ టాపిక్స్ పైనే వీడియోలను క్రియేట్ చేయండి.

మీ ఛానెల్‌ ప్రత్యేకంగా కనిపించేలా క్రియేట్ చేయండి :
మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత అది యూజర్లకు ఎలా కనిపిస్తుంది అనేది చాలా కీలకం. మీ ఛానెల్ ఐకానిక్ అయిన మీ ప్రొఫైల్ ఫొటో, ఛానెల్ బ్యాక్‌గ్రౌండ్ బ్యానర్ ఫొటో సరైన సైజులో ఉండాలి. మీ ప్రొఫైల్ థంబ్‌నెయిల్ ఆకర్షణీయంగా ఉండాలి. అందుకోసం యూట్యూబ్ లోగో మేకర్ (YouTube Logo Maker) ఉపయోగించండి. యూట్యూబ్ లోగోను ప్రత్యేకంగా రూపొందించడానికి ప్రయత్నించండి. ఆ తర్వాతే మీ ఛానెల్ పేరు ఎక్కువగా మందికి ఆసక్తిగా కనిపించేలా చేయొచ్చు. అందుకోసం యూట్యూబ్ (YouTube Name Generator) టూల్ ఉపయోగించవచ్చు. మీ యూట్యూబ్ ఛానెల్ పేరు ఆసక్తిగా ఉండాలి. యూజర్లకు ఛానల్ పేరు బాగా గుర్తుండేలా ఉండాలి. సెర్చ్ చేసే సమయంలో స్పెల్లింగ్ కూడా ఈజీగా టైప్ చేసేలా తక్కువ పదాలతో మంచి పేరు సెట్ చేసుకోండి.

యూట్యూబర్‌ ఛానెల్ సక్సెస్ కోసం SEO ఎలా చేయాలి? :
మీ యూట్యూబ్ వీడియోల కోసం SEO సరిగ్గా సెటప్ చేయడం అనేది అంత ముఖ్యం కాదు. మీ వీడియోలను రూపొందించడానికి ఎక్కువ సమయాన్ని వెచ్చించండి. మీరు చేసే ఎస్ఈఓ అనేది మీ ఛానెల్‌ని వీక్షకులకు తెలిసేలా చూసుకోండి. యూట్యూబ్ అనేది అడ్వాన్సడ్ సెర్చ్ ఇంజిన్. కొత్త కంటెంట్‌ కోసం వెతికే యూజర్ల కోసం ఎక్కువగా ఉపయోగిస్తారు. సరైన కీవర్డ్స్ ఎంచుకోవడం ద్వారా ఎక్కువ మంది దేనిపై ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారో తెలియజేస్తుంది.

మీరు క్రియేట్ చేయాలనుకునే వీడియోకు సమానమైన వీడియోలు ఉంటే.. రిజల్ట్స్ కోసం మీరు టైప్ చేసిన కచ్చితమైన పదాలను వెతకండి. ఆ సెర్చ్ రిజల్ట్స్ ఎలా మారతాయో చూడటానికి కొత్తగా ప్రయత్నించండి. తద్వారా మీరు ఒక పదం లేదా రెండు తేడాలు ఏమి చేయగలరో చూడవచ్చు. మీరు ఉపయోగించాలనుకుంటున్న కీవర్డ్స్ వాటి పాపులారిటీ, కాంపిటీషన్ ఉపయోగించే కీవర్డ్స్ కోసం రీసెర్చ్ చేయండి.

  • యూజర్ల ఆసక్తిని పెంచే కంటెంట్, సాధారణ ప్రశ్నలను సూచించే బలమైన డిమాండ్ ఉన్న వీడియోలను క్రియేట్ చేయాలి. అందుకోసం (Ahrefs) లేదా (Google Keyword Planner) వంటి కీవర్డ్ రీసెర్చ్ టూల్స్ ఉపయోగించండి.
  • (Quora) వంటి ప్లాట్‌ఫారంలో అడిగే ప్రశ్నలను చదవండి. గూగుల్ ట్రెండ్‌లను ఫాలో అవ్వండి. ప్రస్తుతం ఏ సబ్జెక్ట్‌లు హాట్‌గా ఉన్నాయో తెలుసుకునేందుకు సంబంధిత సోషల్ మీడియా గ్రూపులో యాక్టివ్‌గా ఉండండి. మీ యూట్యూబ్ వీడియోల కోసం ఇలా మంచి టాపిక్ ఎంచుకోవచ్చు.
  • మీ వీడియో కింది డిస్ర్కప్షన్‌లో మీ టార్గెట్ కీవర్డ్‌ని 3-4 సార్లు ఉపయోగించండి. మొబైల్ యూజర్ల కోసం ఆప్టిమైజ్ చేయడానికి ప్రారంభంలో మీ వీడియో క్యాప్షన్‌లో కీవర్డ్‌ని కూడా చేర్చండి. మీ ఛానెల్‌ని కనుగొనడానికి ఏ కీవర్డ్స్ అవసరమో వాటిని ఉపయోగించండి. తద్వారా ఆ టాపిక్ చుట్టూ మరిన్ని వీడియోలను టార్గెట్ చేసుకోవచ్చు.

రొటీన్‌ కంటెంట్‌కు కట్టుబడి ఉండండి :
మీరు యూట్యూబ్‌లో విజయవంతం కావాలంటే.. స్థిరత్వం ఉండాలి. అంటే.. ఒకే కంటెంట్ ఎంచుకోవాలి. అదే కంటెంట్‌కు కట్టుబడి ఉండాలి. మీరు ఏ రకమైన కంటెంట్‌ని క్రియేట్ చేసినా అదే కంటెంట్ ఇస్తూ ఉండాలి. వేర్వేరు కంటెంట్ ఇవ్వరాదు. మిక్సడ్ కంటెంట్ అసలు ఇవ్వొద్దు. మీ ఛానల్ ఆడియోన్స్ ఒకే కేటగిరికి చెందినవాళ్లు ఉండాలి. అప్పుడే మీ ఛానల్ సక్సెస్ అయ్యేందుకు వీలుంటుంది. మీ వీడియోలను ఎప్పుడు పబ్లీష్ చేస్తారో కూడా వీక్షకులకు తెలియజేయండి. ఆ టైమ్ ప్రకారమే షెడ్యూల్‌ని సెట్ చేయండి. అదే టైమ్‌కు స్టిక్ అయ్యేలా ఉండండి. ఒకే రోజు ఒకే సమయానికి వీడియోలను పబ్లీష్ చేయడం వల్ల మీ ప్రేక్షకులు మీ కొత్త కంటెంట్‌ను ఎప్పుడు వస్తుందో తెలుస్తుంది. అప్పుడు ఎక్కువ మంది మీ వీడియోను చూసే ఛాన్స్ ఉంటుంది.

how-to-become-successful-youtuber
how-to-become-successful-youtuber

మీ వీడియోలలో సూటిగా విషయాన్ని చెప్పండి :
యూట్యూబ్ వీడియోలో అనవసరమైన విషయాలను చెప్పొద్దు. మీ వీక్షకుడికి 30 సెకన్ల సమయం మాత్రమే పట్టేలా మీరు చూపగలిగే వీడియో ఉండాలి. దేనికైనా ఐదు నిమిషాల వివరణ సరిపోతుంది. అలా మాట్లాడినప్పుడు చాలా ఫన్నీగా అనిపిస్తుంది. సూటిగా చెప్పాలంటే. యూజర్ల సమయాన్ని వృధా చేయడం సరికాదు. మీరు (How To) అనే వీడియోలను చేస్తే.. వీలైనంత త్వరగా మీరు చెప్పదలుచుకున్న పాయింట్‌కి రావాలి. ఆ వీడియో దేనికి సంబంధించినదో వివరించాలి. మీ వీక్షకుడికి ఏది అవసరమో అది చెబితే సరిపోతుంది. మరింత వివరణ ఇవ్వాల్సి వస్తే.. తర్వాతి వీడియోలో కంటిన్యూ చేయండి. మీ ప్రేక్షకులకు కూడా వీక్షించేందుకు సులభంగా ఉంటుంది.

మీ సబ్‌స్క్రైబర్‌లతో ఎంగేజ్ అవ్వండి :
మీ ఛానెల్ విజయంలో మీ సబ్‌స్క్రైబర్‌ల పాత్ర ఎక్కువగా ఉంటుంది. మీరు వారితో క్రమం తప్పకుండా ఎంగేజ్ అయ్యేలా చూసుకోండి. సబ్‌స్క్రైబర్‌లు అడిగిన ప్రశ్నలకు సమాధానమివ్వడం చేయాలి. యూట్యూబ్ కమ్యూనిటీ ద్వారా యూజర్ల సందేహాలను తీర్చవచ్చు. యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ హోస్ట్ చేయడం, లైవ్ వీడియోలు చేస్తుండాలి. అప్పుడు మీ వీడియో మరింత మందికి చేరుతుంది. ఎందుకంటే.. మీ వీక్షకులతో నేరుగా ఇంటరాక్ట్ అయ్యేందుకు మిమ్మల్ని అనుమతిస్తుంది. మీ ప్రేక్షకులు అడిగే ప్రశ్నలకు సమాధానాలను వెంటనే పొందవచ్చు. ఏదైనా ప్రశ్నలు వేయమని వీక్షకులను అడగవచ్చు. ఆ ప్రశ్నలకు మీ తదుపరి వీడియోలో సమాధానం ఇవ్వవచ్చు. యూట్యూబ్‌తో పాటు ఇతర సోషల్ మీడియా నెట్‌వర్క్‌లలో కూడా కమ్యూనిటీని పెంచుకోవాలి. మల్టీ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా కొత్త ప్రేక్షకులను తెచ్చుకోవచ్చు.

వెబ్‌సైట్‌తో మీ యూట్యూబ్ ఛానెల్‌ని ప్రమోట్ చేయండి :
మీ యూట్యూబ్ కంటెంట్ ప్రమోట్ చేసుకోవడానికి వీడియోలను ఇతర సోషల్ నెట్‌వర్క్‌లలో షేర్ చేయవచ్చు. యూట్యూబ్ ఛానెల్‌ కోసం ప్రత్యేకించి ఒక వెబ్‌సైట్‌ను క్రియేట్ చేసుకోండి. మీ సైట్‌లోని వీడియోలను పోస్టు చేస్తూ ప్రమోట్ చేసుకోవచ్చు. సోషల్ మీడియాకు మాత్రమే పరిమితం కాకుండా మీ వెబ్‌సైట్లో యూట్యూబ్ వీడియోలోను పరిమితులు లేకుండా పోస్టు చేసుకోవచ్చు. తద్వారా మరింత మంది యూజర్లకు వీడియో చేరే అవకాశం ఉంటుంది.

Read Also : Maha Shivratri 2024 : మహాశివరాత్రి నాడు మారేడు చెట్టు దగ్గర ఇలా చేశారంటే.. వెయ్యి జన్మల దరిద్రం మొత్తం పోతుంది!

Leave a Comment