IPL 2024 KKR vs GT : అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ (gujarat titans), కోల్‌కతా నైట్ రైడర్స్ (kolkata knight riders) మధ్య ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరగనుంది. గుజరాత్ జట్టు తన చివరి మ్యాచ్‌లో చెన్నై(CSK)పై విజయం సాధించింది. అదే సమయంలో కేకేఆర్ జట్టు ముంబైని ఓడించి సీజన్‌లో ప్లే ఆఫ్‌కు చేరుకున్న మొదటి జట్టుగా నిలిచింది. కేకేఆర్ జట్టు మొత్తం 18 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇప్పుడు కేకేఆర్ గుజరాత్ టైటాన్స్‌తో తలపడాల్సి ఉంది. ప్లేఆఫ్‌కు చేరుకోవాలన్న గుజరాత్ జట్టు ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. ఇరుజట్లు ఇప్పుడు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం (Narendra modi stadium)లో తలపడనున్నాయి.
ఐపీఎల్ 2024 63వ మ్యాచ్‌లో కోల్‌కతాతో గుజరాత్ తలపడనుంది. ఈ మ్యాచ్ మే 13న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని కేకేఆర్ జట్టు ఇప్పటికే ఐపీఎల్ 2024 కోసం ప్లేఆఫ్ టిక్కెట్‌ను దక్కించుకుంది. అదే సమయంలో, గుజరాత్ టైటాన్స్ జట్టు IPL 2024 ప్లేఆఫ్ రేసులో కొనసాగుతోంది. గిల్ సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాలంటే తమ చివరి రెండు మ్యాచ్‌ల్లో గెలవాలి. ఈ పరిస్థితిల్లో కీలక మ్యాచ్‌కు ముందు.. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలోని పిచ్‌పై ఏ జట్టులో బౌలర్లు లేదా బ్యాట్స్‌మెన్‌కు ప్రయోజనం చేకూర్చనుంది? అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
నరేంద్ర మోదీ స్టేడియం గణాంకాలు.. ఏం చెబుతున్నాయి? :
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం పిచ్ విషయానికి వస్తే.. గత మ్యాచ్‌లో రెండు సెంచరీల ఇన్నింగ్స్‌లతో ఇక్కడ బ్యాట్స్‌మెన్‌దే పైచేయి సాధించారు. స్టేడియం మొత్తం 32 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చింది. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 14 సార్లు గెలిచింది. ఆ తరువాత బ్యాటింగ్ చేసిన జట్టు 18 సార్లు గెలిచింది. ఈ మైదానంలో తొలి ఇన్నింగ్స్‌లో సగటు స్కోరు 171 నుంచి 180 పరుగులు రాబట్టాయి.
GT vs KKR మధ్య ఐపీఎల్ రికార్డులు :
గుజరాత్ టైటాన్స్, కోల్‌కతా హెడ్-టు-హెడ్ రికార్డుకు సంబంధించి ఐపీఎల్ చరిత్రలో రెండు జట్లు మొత్తం 3 సార్లు ఢీకొన్నాయి. అందులో గుజరాత్ 2 మ్యాచ్‌లు గెలుపొందగా, కేకేఆర్ ఒక్కటి మాత్రమే గెలిచింది. మే 13 (సోమవారం) జరిగే ఐపీఎల్‌లో తప్పనిసరిగా గెలవాల్సిన కీలక మ్యాచ్‌లో టేబుల్-టాపర్స్ కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడేందుకు గుజరాత్ టైటాన్స్ జట్టు సన్నద్ధమవుతోంది. శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని గుజరాత్‌కు ఇంతకంటే మెరుగైన సమయంలో రాలేదు. గతంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గిల్ చేసిన మెరుపు సెంచరీ జీటీ ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా నిలుపుకుంది. గిల్ మ్యాచ్-విన్నింగ్ గుజరాత్‌కు బాగా కలిసొచ్చింది. గిల్, సాయి సుదర్శన్‌ల భాగస్వామ్యంతో చివరి గేమ్‌లో సెంచరీలు నమోదు చేశారు. ఈ క్రమంలోనే ప్లేఆఫ్ బెర్త్‌ను ఖాయం చేసుకున్న మొదటి జట్టు కోల్‌కతాతో తలపడేందుకు సిద్ధమవుతున్నారు.
ప్లేఆఫ్ రేసులో (2024 Playoffs) ఇంకా ఏడు జట్లు పోటీ పడుతుండడంతో పోటీ మరింత తీవ్రమైంది. రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మొదటి మూడు స్థానాల్లో స్థిరంగా ఉండగా, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ త్రయం 12 పాయింట్లతో పోటీలో ఉన్నాయి. ప్రస్తుతం 10 పాయింట్లతో ఉన్న గుజరాత్ టైటాన్స్, నెగిటివ్ నెట్ రన్ రేట్‌తో తమ పాయింట్లను పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఫ్లేఆఫ్స్ అర్హత సాధించాలంటే చివరి మ్యాచ్‌ల్లో గెలవక తప్పదు. ఏదిఏమైనాప్పటికీ గుజరాత్ ఫ్లేఆఫ్స్ అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఏదైనా అద్భుతమైన ప్రదర్శన చేస్తే తప్ప ఫ్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకోగలదు. కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ఇప్పటికే గుజరాత్ టైటాన్స్ పైచేయి సాధించింది. కేకేఆర్‌తో జరిగిన చివరి 3 మ్యాచ్‌ల్లో రెండింటిలో గుజరాత్ విజయం సాధించింది.
పిచ్ రిపోర్ట్ (pitch report) :
అహ్మదాబాద్ బ్యాటర్లు, బౌలర్లు ఇద్దరికీ సమాన అవకాశాలను అందిస్తుంది. ఈ వేదికపై గుజరాత్ చివరిసారి ఆడినప్పుడు.. క్రికెట్ అభిమానులు అత్యధిక స్కోరింగ్ థ్రిల్లర్‌ను చూశారు. మొదట బ్యాటింగ్ చేసిన గిల్ జట్టు 231/3 చేసింది. ఓపెనర్లు గిల్, సాయి సుదర్శన్ చెరో సెంచరీ చేశారు. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఛేజింగ్‌లో విఫలమైంది. 20 ఓవర్లలో 196/8 మాత్రమే చేసింది.

ఐపీఎల్ 2024 గ్రౌండ్ హిస్టరీ :
ఈ వేదికపై రెండు జట్లు 6 మ్యాచ్‌లు ఆడినందున, డైనమిక్స్ మొదటి బ్యాటింగ్ ఎంచుకోవడం లేదా రెండో బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటాయి. రెండో బ్యాటింగ్ చేసిన జట్లు 4 సార్లు విజయం సాధించగా, మొదట బ్యాటింగ్ చేసిన జట్లు 2 సార్లు విజయం సాధించాయి. ఈ బ్యాలెన్స్ పిచ్ టార్గెట్ నిర్దేశించడంతో పాటు జట్టు ఆ లక్ష్యాన్ని ఛేదించడం రెండింటికీ అవకాశాలను అందిస్తుందని సూచిస్తుంది. సగటు మొదటి ఇన్నింగ్స్ మొత్తం 175 వద్ద ఉంది. పిచ్ జట్ల స్కోర్‌లకు బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు. అయితే, రెండో ఇన్నింగ్స్‌లో సగటున 171 పరుగులతో రెండో బ్యాటింగ్ చేసిన జట్లు లక్ష్యాలను విజయవంతంగా ఛేదించగలిగాయి. థ్రిల్లింగ్ రన్ ఛేజింగ్‌లకు ఈ పిచ్ పెట్టింది పేరు.
కీలక ఆటగాళ్ళు :
సునీల్ నరైన్ : కేకేఆర్ వెటరన్ ప్లేయర్ నరైన్.. ఈ సీజన్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. బ్యాటింగ్ ప్రారంభించిన కరీబియన్ ఆల్ రౌండర్ 461 పరుగులు చేశాడు. కేకేఆర్ నాకౌట్ దశకు చేరుకున్నప్పటికీ నరైన్ అదే జోరును కొనసాగిస్తున్నాడు.
ఫిల్ సాల్ట్ :
మరో కేకేఆర్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంటున్నాడు. ఆడిన 12 మ్యాచ్‌లలో కీపర్-బ్యాటర్ 435 పరుగులు చేశాడు.
సాయి సుదర్శన్ : గుజరాత్‌కు చెందిన లెఫ్ట్ హ్యాండర్ ఈ సీజన్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. యువ సాయి 12 మ్యాచ్‌ల్లో 47.91 సగటుతో 527 పరుగులు చేశాడు.
తలపడే జట్లు (KKR vs GT) :
కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR Team) :
శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), కెఎస్ భరత్ (వికెట్ కీపర్), రెహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), రింకు సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, మనీష్ పాండే, ఆండ్రీ రస్సెల్, నితీష్ రాణా, వెంకటేష్ అయ్యర్, అనుకుల్ సింగ్, అనుకుల్ రాయ్, వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్, వైభవ్ అరోరా, చేతన్ సకారియా, హర్షిత్ రాణా, సుయాష్ శర్మ, మిచెల్ స్టార్క్, దుష్మంత చమీరా, సాకిబ్ హుస్సేన్, ముజీబ్ ఉర్ రెహమాన్, గుస్ అట్కిన్సన్, అల్లా ఘజన్‌ఫర్, ఫిల్ సాల్ట్.
గుజరాత్ టైటాన్స్ (GT Team) :
శుభమన్ గిల్ (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, కేన్ విలియమ్సన్, మాథ్యూ వేడ్, వృద్ధిమాన్ సాహా, అభినవ్ మనోహర్, బి.సాయి సుదర్శన్, దర్శన్ నల్కండే, విజయ్ శంకర్, జయంత్ యాదవ్, రాహుల్ తెవాటియా, నూర్ అహ్మద్, సాయి కిషోర్, రషీద్ ఖాన్, జాషువా లిటిల్, మోహిత్ శర్మ, అజ్మతుల్లా ఒమర్జాయ్, షారుక్ ఖాన్, సుశాంత్ మిశ్రా, ఉమేష్ యాదవ్, కార్తీక్ త్యాగి, మానవ్ సుతార్, స్పెన్సర్ జాన్సన్, సందీప్ వారియర్, బీఆర్ శరత్.
డ్రీమ్11 ఫాంటసీ టీమ్:
వికెట్ కీపర్ : ఫిల్ సాల్ట్ బ్యాటర్: శుభమాన్ గిల్, సాయి సుదర్శన్, నితీష్ రాణా
ఆల్ రౌండర్ : సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, షారుక్ ఖాన్
బౌలర్ : వరుణ్ చక్రవర్తి, జాషువా లిటిల్, హర్షిత్ రాణా
పాయింట్ల పట్టికలో టాప్ 10 జట్లు ఇవే :
- కోల్‌కతా : 12 మ్యాచ్‌లు ఆడితే 9 గెలిచింది.. 3 ఓడింది. 18 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
- రాజస్థాన్ : 12 మ్యాచ్‌లు ఆడితే 8 గెలిచింది.. 4 ఓడింది. 16 పాయింట్లతో 2వ స్థానంలో కొనసాగుతోంది.
- చెన్నై : 13 మ్యాచ్‌లు ఆడితే 7 గెలిచింది.. 6 ఓడింది. 14 పాయింట్లతో 3వ స్థానంలో కొనసాగుతోంది.
- హైదరాబాద్ : 12 మ్యాచ్‌లు ఆడితే 7 గెలిచింది.. 5 ఓడింది. 14 పాయింట్లతో 4వ స్థానంలో కొనసాగుతోంది.
- బెంగళూరు : 13 మ్యాచ్‌లు ఆడితే 6 గెలిచింది.. 7 ఓడింది. 12 పాయింట్లతో 5వ స్థానంలో కొనసాగుతోంది.
- ఢిల్లీ క్యాపిటల్స్ : 13 మ్యాచ్‌లు ఆడితే 6 గెలిచింది.. 7 ఓడింది. 12 పాయింట్లతో 6వ స్థానంలో కొనసాగుతోంది.
- లక్నో జెయింట్స్ : 12 మ్యాచ్‌లు ఆడితే 6 గెలిచింది.. 6 ఓడింది. 12 పాయింట్లతో 7వ స్థానంలో కొనసాగుతోంది.
- గుజరాత్ : 12 మ్యాచ్‌లు ఆడితే 5 గెలిచింది.. 7 ఓడింది. 10 పాయింట్లతో 8వ స్థానంలో కొనసాగుతోంది.
- ముంబై : 13 మ్యాచ్‌లు ఆడితే 4 గెలిచింది.. 9 ఓడింది. 8 పాయింట్లతో 9వ స్థానంలో కొనసాగుతోంది.
- పంజాబ్ : 12 మ్యాచ్‌లు ఆడితే 4 గెలిచింది.. 8 ఓడింది. 8 పాయింట్లతో 10వ స్థానంలో కొనసాగుతోంది.
కోల్‌కతా నైట్ రైడర్స్‌తో కీలకమైన పోరుకు సిద్ధమవుతున్న తరుణంలో గిల్ సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ ఫ్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే చివరి రెండు మ్యాచ్‌ల్లో తప్పక గెలవాల్సి ఉంటుంది. ఈ కీలక మ్యాచ్ ఎవరికి ప్రయోజనం చేకూరుస్తుందో తెలియాలంటే ఈరోజు రాత్రి (7.30) జరుగబోయే మ్యాచ్ తప్పక చూడాల్సిందే..
కోల్‌కతాతో జరగాల్సిన మ్యాచ్ రద్దు.. గుజరాత్ ఫ్లేఆఫ్స్ నుంచి ఔట్ :
నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా కనీసం ఒక్క బంతి కూడా వేయకుండానే రద్దు అయిపోయింది. దాంతో గుజరాత్ ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. జీటీ ఇప్పుడు 13 మ్యాచ్‌లతో 11 పాయింట్లను కలిగి ఉంది. గరిష్టంగా 13 పాయింట్లను చేరుకోగలదు. టాప్ 4 స్థానానికి ఇది సరిపోదు. మరోవైపు, కేకేఆర్ 19 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. చివరి లీగ్ గేమ్‌లో రాజస్థాన్ జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా ఓడినా ఎలా రాణించారనే దానితో సంబంధం లేకుండా టాప్ 2 ప్లేసులో నిలువగలదు.
వరుణుడు శాంతిస్తాడని ఆశగా ఎదురుచూసిన క్రికెట్ అభిమానులకు నిరాశ తప్పలేదు. 25వేల మంది అభిమానులు ఆట ప్రారంభం అవుతుందనే ఆశతో వేదికలో నుంచి బయటకు కూడా రాలేదు. రాత్రి 10:56 5-ఓవర్ల మ్యాచ్ కోసం కట్-ఆఫ్ సమయం విధించారు. కానీ, సుమారు రాత్రి 10:40కి అంపైర్లు మ్యాచ్‌ను నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్‌లో లీగ్ దశ మ్యాచ్‌ల చివరి వారంలోకి ప్రవేశించినప్పుడు అందరి దృష్టి గుజరాత్, కోల్‌కతా మధ్య జరగబోయే పోరుపైనే పడింది.
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మ్యాచ్ రెండు జట్లకు సీజన్‌లో 13వ ఆట. ఈ కీలక మ్యాచ్ ఆడకుండానే గుజరాత్ ఫ్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అంతకుముందు గుజరాత్ టైటాన్స్ చెన్నై సూపర్ కింగ్స్‌పై విజయం సాధించింది. తప్పక గెలవాల్సిన గేమ్‌లో, శుభమాన్ గిల్, సాయి సుదర్శన్ ఇద్దరూ సెంచరీలతో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. తమ జట్టును 231 పరుగుల స్కోరుకు పరుగులు పెట్టించారు.
Read Also : Best Home Loans : మీరు హోమ్ లోన్ కోసం చూస్తున్నారా? హౌజింగ్ లోన్ అందించే టాప్ 5 బెస్ట్ బ్యాంకులివే
