RR vs RCB Eliminator : ఐపీఎల్-2024 కీలక మ్యాచ్‌కు సమయం ఆసన్నమైంది. ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లీగ్ దశలో కొన్ని నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఒకప్పుడు మొదటి-రెండు స్థానానికి ఆశాజనకంగా కనిపించిన రాజస్థాన్ రాయల్స్ బెంగళరు చివరకు పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది.
గౌహతిలో ఎడతెరిపిలేని వర్షం కారణంగా చివరి లీగ్ గేమ్ రద్దు అయింది. ఈ మ్యాచ్‌కు ముందు సంజూ శాంసన్ నేతృత్వంలోని జట్టు వరుసగా నాలుగు పరాజయాలను చవిచూసింది. మూడో స్థానం అంటే.. రాజస్థాన్ రాయల్స్ ఇప్పుడు ఎలిమినేటర్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడతారు. లీగ్ దశ రెండో భాగంలో ఆర్ఆర్ ఊపందుకోగా ఆర్సీబీ మళ్లీ పుంజుకుంది.
బెంగళూరుకు చెందిన ఫ్రాంచైజీ వరుసగా ఆరు విజయాలు సాధించి ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. గత ఆదివారం చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరు తమ చివరి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై 27 పరుగుల తేడాతో విజయం సాధించింది. డు ప్లెసిస్ సారథ్యంలోని జట్టు ఇప్పుడు మిగిలిన గేమ్‌లలో తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే ఐపీఎల్ టైటిల్ ఎలాగైనా దక్కించుకోవాలని ఊవిళ్లూరుతోంది.
మే 22, బుధవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆర్ఆర్, ఆర్సీబీ ఇరుజట్ల మధ్య హై-వోల్టేజ్ ఐపీఎల్ 2024 జరగనుంది. ఈ కీలక పోరులో గెలిచిన ఐపీఎల్ జట్టు క్వాలిఫయిర్-2కు అర్హతను సాధిస్తుంది. అలాగే, ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఇరుజట్ల బలాబలాలు పరిశీలిస్తే పోటాపోటీగా తలపడేలా కనిపిస్తున్నాయి. ఈరోజు మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ నెలకొంది.
RR vs RCB Eliminator : వర్షంతో మ్యాచ్ రద్దు అయితే :
ప్రస్తుతానికి ఈరోజు ఎలిమినేటర్ మ్యాచ్‌కు వర్షం ముప్పులేదనే చెప్పాలి. మ్యాచ్ ఆటంకం లేకుండా సాగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే, ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయం కలిగినా ఎలాంటి సమస్య ఉండదు. ఎందుకంటే.. ప్లేఆఫ్స్ మ్యాచ్ రిజల్ట్స్ డిక్లేర్ చేసేందుకు 2 గంటలు ఎక్స్‌ట్రా టైమ్ కేటాయించారు. దీని ప్రకారం.. ఈరోజు రాత్రి 9.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమైనా సరే 20 ఓవర్లతో మ్యాచ్‌ను ఆడించే పరిస్థితి ఉంటుంది.
అప్పటికీ కూడా వర్షం అంతరాయం కలిగించి మ్యాచ్ జరగకపోతే.. చివరిగా రిజర్వ్ డే ప్రకటించి ఫుల్ మ్యాచ్ మ్యాచ్ ఆడించే అవకాశం ఉంటుంది. ఆ రిజర్వ్ డే రోజున కూడా వరుణుడు అడ్డంకిగా నిలిచి మ్యాచ్ ఫలితాన్ని నిర్ధారించలేని పరిస్థితి ఎదురైతే.. ఐపీఎల్ 2024 పాయింట్ల పట్టికలో టాప్ ర్యాంకులో నిలిచిన జట్టును ఫైనల్‌కు వెళ్లే జట్టుగా ప్రకటిస్తారు.
4వ స్థానంలో ఉన్న బెంగళూరు జట్టుకు బదులుగా 3వ స్థానంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్ జట్టు క్వాలిఫయిర్-2కు క్వాలిఫై అవుతుంది. ఇప్పటివరకూ రాజస్థాన్ ఆడిన 14 మ్యాచ్‌ల్లో ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 8 మ్యాచ్‌ల్లో గెలిచి 5 మ్యాచ్‌ల్లో ఓడి 17 పాయింట్లతో ఉంది. బెంగళూరు జట్టు కూడా ఆడిన 14 మ్యాచ్‌ల్లో 7 గెలిచి 7 ఓడి 14 పాయింట్లతో నాల్గో స్థానంలో ఉంది.
రాజస్థాన్ రాణించగలదా? :
రాజస్థాన్ రాయల్స్ లీగ్ దశలో 9 మ్యాచ్‌లలో కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే ఓడి అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఇప్పుడు ఒక్క మ్యాచ్ గెలిస్తే చాలు.. ప్లేఆఫ్స్ బెర్త్ ఖాయమైనట్టే అనే తరుణంలో కనీసం ఒక మ్యాచ్ కూడా గెలవలేదు. 4 మ్యాచ్స్ ఓడినా ఒకటి వర్షం కారణంగా రద్దు అయింది. ఫలితంగా ఆర్ఆర్ ప్లేఆఫ్స్ చేరింది. ఏదిఏమైనప్పటికీ రాజస్థాన్ బ్యాటింగ్ లైనప్‌లో సరిగా లేకపోవడం ఒక కారణమైతే.. ఈ జట్టులోని ఓపెనర్ ఆటగాడు బట్లర్ ఇంగ్లండ్‌కు తిరిగి వెళ్లిపోవడం ఆర్ఆర్ జట్టును ఆందోళన గురిచేస్తోంది.
మరో ఆటగాడు యశస్వి జైస్వాల్ రాణించకపోవడం కూడా మరో సమస్య.. ఈ పరిస్థితుల్లో ఆర్ఆర్ ఎలిమినేటర్‌లో దూకుడు మీదున్న బెంగళూరును ఎలా ఎదుర్కొగలదు అనే సందేహం వ్యక్తమవుతోంది. రియాన్ పరాగ్ మాత్రమే రాణిస్తుండగా.. హెట్‌మయర్, ధృవ్ జురెల్ ఆటగాళ్లు బ్యాట్ ఝళిపించడంలో తేలిపోతున్నారు. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో బెంగళూరులో ఎలిమినేటర్‌లో రాజస్థాన్ ఎంతవరకు నెగ్గగలదో లేదో చూడాలి.
RR VS RCB హెడ్ టు హెడ్ (గత 5 మ్యాచ్‌లు) :
- 2024 – RR 6 వికెట్ల తేడాతో గెలిచింది.
- 2023 – RCB 112 పరుగుల తేడాతో గెలిచింది.
- 2023 – RCB 7 పరుగుల తేడాతో గెలిచింది.
- 2022 – RR 7 వికెట్ల తేడాతో గెలిచింది.
- 2022 – RR 29 పరుగుల తేడాతో గెలిచింది.
రాజస్థాన్ రాయల్స్ (RR) జట్టు (అంచనా) :
యశస్వి జైస్వాల్, టామ్-కోహ్లర్ కాడ్మోర్, సంజు శాంసన్ (కెప్టెన్, వికెట్ కీపర్), రియాన్ పరాగ్, ధృవ్ జురెల్, రోవ్‌మన్ పావెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ సేన్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు (అంచనా) :
విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ (సి), గ్లెన్ మాక్స్‌వెల్, రజత్ పాటిదార్, మహిపాల్ లోమ్రోర్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్ (వికె), యశ్ దయాల్, కర్ణ్ శర్మ, మహ్మద్ సిరాజ్, లాకీ ఫెర్గూసన్
RR vs RCB డ్రీమ్11 ప్రిడిక్షన్ :
- కెప్టెన్ : కామెరాన్ గ్రీన్
- వైస్ కెప్టెన్ : యశస్వి జైస్వాల్
- వికెట్ కీపర్ : సంజు శాంసన్
- బ్యాటర్లు : యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్
- ఆల్‌రౌండర్లు : గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, రవిచంద్రన్ అశ్విన్
- బౌలర్లు : ట్రెంట్ బౌల్ట్, లాకీ ఫెర్గూసన్, యుజ్వేంద్ర చాహల్
రాజస్థాన్ రాయల్స్ (RR) జట్టు :
యశస్వి జైస్వాల్, టామ్ కోహ్లర్-కాడ్మోర్, సంజు శాంసన్(వికెట్ కీపర్/కెప్టెన్), రియాన్ పరాగ్, ధృవ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్, రోవ్‌మన్ పావెల్, నాంద్రే బర్గర్, కేశవ్ మహరాజ్, తాన్ కోటియన్, కుల్దీప్ సేన్, డోనోవన్ ఫెరీరా, అబిద్ ముస్తాక్, శుభమ్ దూబే, కునాల్ సింగ్ రాథోడ్, నవదీప్ సైనీ.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) స్క్వాడ్ :
ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), గ్లెన్ మాక్స్‌వెల్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, అనుజ్ రావత్, దినేష్ కార్తీక్, సుయాష్ ప్రభుదేసాయి, విల్ జాక్స్, మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, మనోజ్ భాండాగే, మయాంక్ డాగర్, విజయ్‌కుమార్ వైషాక్, ఆకాశ్ దీప్, టామ్ కర్రాన్, టోప్లీ, హిమాన్షు శర్మ, యష్ దయాల్, రెహ్మద్ సిరాజ్, కామెరాన్ గ్రీన్, రాజన్ కుమార్, లాకీ ఫెర్గూసన్, సౌరవ్ చౌహాన్, అల్జారీ జోసెఫ్, స్వప్నిల్ సింగ్
రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)
(RCB) మ్యాచ్ వివరాలు – ఐపీఎల్ 2024 :
రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
మ్యాచ్ ఎప్పుడంటే :
మే 22 బుధవారం రాత్రి 7:30 గంటలకు
నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్
మ్యాచ్ ఎక్కడ చూడాలి :
RR vs RCB లైవ్ స్ట్రీమింగ్ : జియోసినిమా (JioCinema) యాప్, అధికారిక వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
Read Also : Sharing Same Soap : మీ ఇంట్లో వారంతా ఒకే సబ్బును వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త.. ఈ పొరపాటు అసలు చేయొద్దు..!