Kalki 2898 AD Release Trailer : పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ కొత్త మూవీ కల్కి అతి త్వరలో రాబోతోంది. అతిపెద్ద తారాగణంతో కల్కీ మూవీ ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే, ఈ మూవీ రావడానికి ముందుగానే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ కల్కీ గురించి రోజుకో విషయం వెలుగులోకి వస్తోంది. సినిమా రిలీజ్ దగ్గరపడటంతో మూవీ ప్రమోషన్లలో డైరెక్టర్ నాగ్ అశ్వీన్ ఫుల్ బిజీ అయిపోయాడు.
ఈ ప్రమోషన్లలో సమయంలోనే కల్కీ రిలీజ్ ట్రైలర్ వదిలాడు. ఈ రిలీజ్ ట్రైలర్ చూస్తుంటే ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. ప్రతిఒక్కరికి ఒక డౌట్ కచ్చితంగా రాకమానదు.. అదేంటంటే.. ట్రైలర్ బాగా గమనిస్తే.. కల్కీ మూవీలో బైరవ్ పాత్రలో ప్రభాస్ కనిపించనున్నాడు సరే.. అసలు కల్కీ ఎవరు? ఇదే ప్రశ్న అందరిని కన్ఫూజ్ చేసేస్తోంది. కల్కీగా ఎవరిని నాగ్ అశ్వీన్ చూపించబోతున్నాడు అనే ఆసక్తిని రేకిత్తిస్తోంది.
ఇప్పుడు ఎక్కడా చూసినా కల్కీ మూవీ గురించే తెగ తెగ చర్చ జరుగుతోంది. అందులోనూ ఇటీవల మూవీ యూనిట్ రిలీజ్ చేసిన సెకండ్ ట్రైలర్‌లోనూ క్రేజీ హింట్స్ వదిలారట. అయ్య బాబోయ్.. కల్కీ ఎవరు అనేది హింట్ ఇచ్చారా? లేదా కన్ఫూజ్ చేస్తున్నారా? అనేది తెలియడం లేదు. ఒక మాటలో చెప్పాలంటే.. ఈ కల్కీ మూవీ చూస్తుంటే.. ఒక మహాభారతంలో కురుక్షేత్రం మాదిరిగా కనిపిస్తోంది. కలియుగంలో కురుక్షేత్రం జరిగితే ఎలా ఉంటుంది అనేది చూపించబోతున్నారట.. సినిమా కాన్సెప్ట్ బాగానే ఉంది.. కానీ, ఒక విషయం అంతుపట్టడం లేదు.. కల్కీ ట్రైలర్ ప్రకారం.. భూమి మీద పాపాలు పెరిగితే శ్రీ మహావిష్ణువు కల్కీగా అవతరించనున్నాడు. కానీ, మూవీ ట్రైలర్ చూపించినట్టు.. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె తన కడుపులో బిడ్డ రూపంలో కల్కీ పుట్టబోతున్నట్టుగా కనిపిస్తోంది.
Kalki 2898 AD Release Trailer : కురుక్షేత్రంలో అశ్వద్ధామను కొట్టింది ఎవరు?
ఇందులో ఒక క్లారిటీ మాత్రం వచ్చింది.. పుట్టేది కల్కీ అనే విషయం.. ఇంతకీ.. ఆ కల్కీగా భైరవ్ పాత్రలో ఉన్న ప్రభాస్ మారుతాడా? లేదా మరొకరు ఉంటారా? అనేది చిన్న కన్ఫూజన్ క్రియేట్ చేశాడు దర్శకుడు నాగ్ అశ్విన్. బైరవ్ గా ప్రభాస్ హీరోనా లేదా అనేది ట్విస్ట్ మాదిరిగా కనిపిస్తోంది. అంతేకాదు.. బైరవ్ గా ప్రభాస్ పాజిటివ్ రోల్ చేస్తున్నాడా? నెగటివ్ రోల్ అనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఎందుకంటే.. అశ్వద్ధామ సుమతిని రక్షించేందుకు భైరవ్ తెగ ట్రై చేస్తుంటాడు. భైరవ్ సుమతిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. అక్కడ బిగ్ వార్ జరుగుతుంది.

అశ్వద్ధామని ఒక్కటి గట్టిగా ఇస్తే.. ఆమిడ దూరంలో పడిపోతాడు. దాంతో అశ్వద్ధామకి కురుక్షేత్ర యుద్ధం స్ట్రైక్ అవుతుంది. అంటే.. కురుక్షేత్రంలో అశ్వద్ధామను కొట్టింది ఎవరు అనేది కొద్దిగా మాత్రం క్లారిటీ వచ్చింది. ఆనాడు అశ్వద్ధామను కొట్టిన వ్యక్తే ఇప్పుడు మళ్ళీ బైరవగా జన్మించాడా? కురుక్షేత్రంలో అశ్వద్ధామను కొట్టింది ఎవరు? అతడు అర్జునుడా..? భీముడా ..? లేదా కృష్ణుడా..? అనేది తెలియాల్సి ఉంది. అశ్వద్ధామతో అసలు యుద్ధం చేసింది ఎవరు? అనేది అతిపెద్ద ట్విస్ట్ అనమాట..
ఒకవేళ భైరవ్‌నే కల్కీ అనుకుంటే.. అతడు ఒక సాధారణ మానవుడు.. అప్పటికే సుమతి కడుపులో ఉన్నది కల్కీగా చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు. ఆ సుమతినే కాపాడేందుకు భైరవ్ ప్రయత్నిస్తుంటాడు. సుమతి గర్భంలో ఉంది కల్కీనా? ఇంకెవరు? అనేది ప్రేక్షకులను మాత్రం ఫుల్ గా కన్ఫూజన్‌లో పడేస్తున్నాయి. చూస్తుంటే.. ఇదంతా నాగ్ అశ్విన్ ట్ర్లైలర్ తో మాయ చేసినట్టుగా కనిపిస్తోంది. ఇంతకీ ఈ సస్పెన్స్ అంతా ఎందుకు? అనేది తెలియాలంటే ఈ నెల 27 కల్కీ మూవీ రిలీజ్ అయ్యేవరకు వేచి చూడాల్సిందే..