Kalki Movie Public Talk : తెలుగు సినిమా పరిశ్రమలో ప్రభాస్ రేంజ్ వేరు.. రెబల్ స్టార్ ప్రభాస్ అంటే పాన్ ఇండియా పాపులారిటీ ఆయనది. దానికి యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్వీన్ డైరెక్షన్ కూడా తోడైంది. ఇంకేముంది.. కల్కి 2898 ఏడీ మూవీ యేట్ అయింది. వీరిద్దరి కాంబినేషన్‌లో కల్కి మూవీ ప్రభంజనం సృష్టించబోతుంది.
పురాణాల నేపథ్యంతో ప్రస్తుత ఆధునిక ప్రపంచం ఎలా ఉండనుంది? అనేది సరికొత్త టెక్నాలజీతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు దర్శకుడు నాగ్ అశ్వీన్. ఈ మూవీ జూన్ 27న థియేటర్స్‌లో విడుదల కాగా.. భారీగా రెస్పాన్స్ వస్తోంది. ప్రత్యేకించి కల్కి మూవీ గురించి పబ్లిక్ టాక్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
నాగ్ అశ్విన్ మార్క్.. ప్రభాస్ నటవిశ్వరూపం.. అభిమానులను ఒక ఆధునిక ప్రపంచంలోకి తీసుకువెళ్తుంది. హిందూ పురాణాల్లో ఒకటైన మహాభారతంలో కొన్ని ఆసక్తికరమైన అంశాలను అద్భుతంగా తెరకెక్కించారు. ఈ పాత కథలను మన కలియుగానికి కనెక్ట్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. భైరవగా ప్రభాస్ తన నటనతో ఆకట్టుకోగా.. కల్కిగా అవతరించే సమయంలో ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి అనేది దర్శకుడు విజన్ ద్వారా పర్‌ఫెక్ట్‌గా చూపించాడు.
Kalki Movie Public Talk : హాలీవుడ్ రేంజ్ మూవీ.. ప్రభాస్ ఎంట్రీ సూపర్..
ఈ మూవీలో వీఎఫ్‌ఎక్స్ మాత్రం సూపర్ అని చెప్పవచ్చు. అంతేకాదు.. ఈ కల్కి మూవీ చూసిన జనాలంతా టాలీవుడ్ లో హాలీవుడ్ రేంజ్ మూవీ అంటూ తెగ మాట్లాడుకుంటున్నారట.. ఈ మూవీలో ప్రభాస్ ఎంట్రీ మామూలుగా లేదని అంటున్నారు. అందులోనూ బుజ్జి (వెహికల్) చెప్పే డైలాగ్స్ మాత్రం అదుర్స్ అని చెప్పవచ్చు. ఈ మూవీలో బుజ్జి, భైరవ మధ్య సీన్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయని అని పబ్లిక్ టాక్ వినిపిస్తోంది.

భైరవ్ ఎంట్రీ సీన్ సమయంలో థియేటర్స్ ప్రభాస్ ఫ్యాన్స్ అదిరిపోయేలా ఉంది. థియేటర్లలో కూర్చోకుండా రచ్చ రంబోలా చేస్తున్నారు అభిమానులు.. డార్లింగ్ రేంజ్ ఆ మాత్రం ఉంటుందిలే అని తెగ కామెంట్లు పెడుతున్నారు. కల్కి మూవీ టాక్ చూస్తుంటే.. బాహుబలి మించిన రేంజ్ అంటున్నారు. కల్కి మూవీ సూపర్ హిట్ అయినట్టే అంటున్నారు. సోషల్ మీడియాలో ప్రభాస్ కల్కి మూవీకి సంబంధించిన వివరాలు ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి.
Read Also : Kalki 2898 Movie Review : ‘కల్కి 2898AD’ మూవీ రివ్యూ.. టాలీవుడ్‌లో హాలీవుడ్ రేంజ్.. ప్రభాస్ మూవీ ఎలా ఉందంటే?