Kalki 2898AD Movie : కల్కి మూవీకి వెళ్తున్నారా? అయితే.. కొన్ని విషయాలను తప్పక గుర్తుంచుకోండి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి మూవీకి ఫుల్ రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం కల్కి మూవీ గురించి పబ్లిక్ టాక్ నడుస్తోంది. ప్రభాస్ అభిమానుల దగ్గర నుంచి ప్రతిఒక్కరూ ఈ మూవీ గురించే తెగ చర్చించుకుంటున్నారు.
అప్పట్లో బాహుబలి మూవీ ఎంతగా రెస్పాన్స్ వచ్చిందో ఇప్పుడు అంతకన్నా డబుల్ డోస్ రెస్పాన్స్ వస్తోంది. బాహుబలి తర్వాత చెప్పుకొదగ్గ మూవీల్లో ఈ కల్కి ఒకటి అనడంలో సందేహం అక్కర్లేదు. ప్రభాస్ అంటే ఆ మాత్రం ఉంటుందిలే అన్నట్టుగా మారిపోయింది. కల్కి మూవీ రిలీజ్ అయిన మొదటిరోజే పాజిటివ్ టాక్ అందుకుంది. దర్శకుడు నాగ్ అశ్మిన్ చేసిన ప్రయోగం సక్సెస్ అయిందనే చెప్పాలి.
ప్రభాస్ బుజ్జి రిలేషన్ కూడా సూపర్ అంటున్నారు మాస్ ప్రేక్షకులు. ఆది పురుష్‌కు వచ్చిన నెగటివ్ మాత్రం ఈ కల్కి మూవీకి రాలేదు. అంతగా విజువల్ ఎఫెక్స్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో హాలీవుడ్ మూవీ రేంజ్ మూవీ అంటూ పైకి ఎత్తేస్తున్నారు. దర్శకుడు నాగ్ అశ్వీన్ విజువలైజేషన్ సూపర్ అంటున్నారు.

ఈ మూవీలో ప్రభాస్ భైరవ ఎంట్రీ సీన్ మాత్రం అదిరిపోయింది. అదే మూవీకి పెద్ద హైలెట్ అంటున్నారు. భైరవ్ ఉపయోగించే బుజ్జి కూడా బాగా ట్రెండ్ అవుతోంది. ఇంట్రడెక్షన్ సమయంలో ప్రభాస్ వదిలే ఒక్కో డైలాగ్ డైనమేట్‌లా పేలిపోయాయి. ప్రభాస్ తనదైన శైలిలో చెప్పిన డైలాగ్స్ విని అభిమానులు ఫుల్ ఫిదా అవుతున్నారు. రాజమౌళి తర్వాత నాగ్ అశ్వీన్ అంటూ ఒక రేంజులో పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
Kalki 2898AD Movie : కల్కి మూవీ ఎంజాయ్‌మెంట్ అసలు మిస్ కావొద్దు :
కల్కీ మూవీకి పిల్లలు, ఫ్యామిలీతో కలిసి చూసేలా ఉంది. ఈ మూవీని చూసేందుకు వెళ్లేవారంతా కొన్ని విషయాలను తప్పక గుర్తుంచుకోవాలి. ఇప్పటికే కల్కి చూసిన ఫ్యాన్స్ అందరూ తప్పక చూడాల్సిన సినిమా అంటున్నారు. సినిమాకు వెళ్లేవారందరికి రెబల్ ఫ్యాన్స్ కొన్ని విషయాలను సూచిస్తున్నారు. సినిమా చూసే సమయంలో అరుపులు, కేకలు పెడుతుంటారు. అలాంటిప్పుడు గొంతు ఎండిపోయినట్టుగా అయిపోతుంది. అలాంటి సమయంలో బాగా దాహంగా అనిపించవచ్చు. అందుకే మూవీకి వెళ్లే సమయంలో వెంట ఒక వాటర్ బాటిల్ తప్పనిసరిగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు.
ప్రభాస్ అభిమానులు చిన్నపాటి సంచుల నిండా కత్తిరించిన పేపర్లను తీసుకెళ్తున్నారు.. ఏదైనా సీన్ వచ్చినప్పుడు గట్టిగా అరుస్తూ పేపర్లను పైకి ఎగరవేస్తూ ఎంజాయ్ చేయాలని అంటున్నారు. ఆసక్తికరమైన సన్నివేశాలను అసలు మిస్ చేసుకోవద్దని మరి చెబుతున్నారు. భైరవ్ ఎంట్రీ సీన్ అప్పుడు, ఇంటర్వెల్ ట్విస్ట్ సమయంలో పేపర్లను పైకి ఎగరవేసి గట్టిగా అరుస్తూ సరదాగా గోల చేస్తూ ఎంజాయ్ చేయాలని అంటున్నారు. అప్పుడే కల్కి మూవీ కిక్ అనిపిస్తుందని అంటున్నారు.
Read Also : Kalki 2898 Movie Review : ‘కల్కి 2898AD’ మూవీ రివ్యూ.. టాలీవుడ్‌లో హాలీవుడ్ రేంజ్.. ప్రభాస్ మూవీ ఎలా ఉందంటే?