Pushpa 2 Video Song Release : పుష్ప 2 మూవీ కోసం అల్లు అర్జున్ అభిమానులు ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సుకుమార్ దర్వకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప 2 మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే పుష్ప 2 మూవీ నుంచి మొదటి సాంగ్ రిలీజ్ కాగా ఫుల్ పాపులర్ అయింది. లేటెస్టుగా పుష్ప 2 మూవీ నుంచి రెండో వీడియో సాంగ్ రిలీజ్ అయింది. ఈ లిరికల్ వీడియో కపుల్ సాంగ్ అల్లు అర్జున్ అభిమానులు సహా అందరిని ఆకట్టుకుంటోంది.
Pushpa 2 Video Song Release : సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి :
చిత్ర యూనిట్ విడుదల చేసిన ‘సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి’ అనే ఈ కొత్త వీడియో సాంగ్ బాగా ట్రెండ్ అవుతోంది. ఈ పాటలో అల్లు అర్జున్, రష్మిక మందన ఎంతో క్యూట్ జోడీగా కనిపించారు. ఈ పాటను శ్రేయా ఘోషల్ పాడగా.. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. ఇక ఈ పాటకు లిరిక్స్ చంద్రబోస్ రాశారు. అల్లుఅర్జున్, రష్మిక జంట మధ్య రొమాన్స్ సాగే ఈ పాటకు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది.

ఇప్పటికే పుష్ప 2 ది రూల్ మూవీ నుంచి వచ్చిన మొదటి పాటకు కూడా ఫుల్ రెస్పాన్స్ వచ్చింది. ‘పుష్ప పుష్ప’ పాటతో పాటు అల్లు అర్జున్ వేసిన స్టెప్స్ కూడా ఫుల్ వైరల్ అయ్యాయి. రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే రికార్డులు బద్దలు కొట్టేసింది.
పాన్ ఇండియాగా వచ్చిన పుష్ప ఫస్ట్ పార్ట్ సూపర్ డూపర్ హిట్ కొట్టి భారీగా వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు రాబోయే పుష్ప 2 పార్ట్ మూవీ కూడా అదే రేంజ్లో ఉంటుందని అంటున్నారు. భారీ సీక్వెల్ తో రానున్న పుష్ప 2 ది రూల్ మూవీ వచ్చే ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read Also : Pushpa 2 Update : పుష్ప గాడు వస్తున్నాడోచ్.. రిలీజ్ ప్లానింగ్ అదిరిగిందిగా.. ఫైనల్ షూటింగ్ అప్డేట్!