Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా జనసేనాని పవన్ కళ్యాణ్ బాధ్యతలను స్వీకరించారు. జూన్ 19న రాష్ట్రంలో విజయవాడలోని డిప్యూటీ సీఎం క్యాంపు ఆఫీసులో జనసేన అధినేత పవన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఆయన డిప్యూటీ సీఎంగా బాధ్యతలను స్వీకరించారు.
ఈరోజు ఉదయం 10.47 నిమిషాలకు క్యాంపు ఆఫీసులో పవన్ తన బాధ్యతలను స్వీకరించారు. కేటాయించిన మంత్రిత్వ శాఖల్లో ముందుగా పంచాయతీరాజ్, రూరల్ వాటర్ సప్లైస్, రూరల్ డెవలప్‌మెంట్, శాస్త్ర సాంకేతిక, అటవీ, పర్యావరణం శాఖల బాధ్యతలను ఆయన స్వీకరించారు.
ఈ సందర్భంగా పలు ఫైల్స్‌పై సంతకాలు చేశారు. పవన్ తొలి సంతకాన్ని తనకు కేటాయించిన శాఖల ఫైళ్లపైనే చేశారు. అందులో మొదటగా రెండు ఫైళ్ళపై పవన్ సంతకాలు చేయగా.. ఉపాధి హామీ పథకం, ఉద్యాన వన పనులకు సంబంధించి నిధులు మంజూరు ఫైల్‌పై తొలి సంతకం చేశారు. గిరిజన గ్రామాల్లోని పంచాయతీ భవనాల నిర్మాణం ఫైల్‌పై పవన్ రెండో సంతకం చేశారు.
Pawan Kalyan : పవన్ రెండో సంతకం ఏ ఫైల్‌పై చేశారంటే?
డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన జనసేనానికి అక్కడి అధికారులు, టీడీపీ, జనసేన నేతలు శుభాకాంక్షలు తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్‌కు ఇంద్రకీలాద్రి ఆలయ వేదపండితులు ఆశీర్వచనం అందించారు. జనసేన నేత కొత్తపల్లి సుబ్బారాయుడు, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, నాదెండ్ల మనోహర్ పవన్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఐపీఎస్, ఐఏఎస్ అధికారులతో జనసేన చీఫ్ సమావేశం కానున్నారు. అంతేకాదు.. గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో కూడా పవన్ చర్చించనున్నారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన క్షణం నుంచి పవన్ ఫుల్ బిజీగా గడిపేస్తున్నారు. ముందుగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జలవనరులశాఖకు చెందిన ఇరిగేషన్ కాంప్లెక్స్ క్వార్టర్లను డిప్యూటీ సీఎం నివాసం, క్యాంపు ఆఫీసుకు కేటాయిస్తూ శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రిన్సిపల్ సెక్రటరీ (పీఆర్ అండ్ ఆర్డీ) శశిభూషణ్ కుమార్, ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు. మంత్రులు నాదెండ్ల మనోహర్ (ఆహారం, పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు), కందుల దుర్గేష్ (పర్యాటక, సంస్కృతి), కాకినాడ ఎంపీ టి.ఉదయ్ శ్రీనివాస్, విశాఖపట్నం దక్షిణ ఎమ్మెల్యే సిహెచ్. శ్రీనివాసరావు (వంశీకృష్ణ యాదవ్), జేఎస్సీ ప్రధాన కార్యదర్శి, పవన్ అన్నయ్య కె.నాగబాబు శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో ఉన్నారు.
Read Also : Pawan Kalyan : పవన్ చేతికి పవర్.. నేడే డిప్యూటీ సీఎం సహా 5 కీలక శాఖలకు బాధ్యతలు..!